PKSDT: టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2023-05-17T13:41:43+05:30 IST

‘PKSDT’ టైటిల్ ఇదేనంటూ ఓ టైటిల్ బాగా ట్రెండ్ అవుతోన్న నేపథ్యంలో మేకర్స్ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్‌ను అధికారికంగా విడుదల చేయబోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ‘PKSDT’ టైటిల్, ఫస్ట్ లుక్‌ విడుదలకు సంబంధించి ఓ పోస్టర్‌

PKSDT: టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?
Pawan kalyan and Sai Dharam Tej

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan), సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ‘PKSDT’ అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ‘PKSDT’ టైటిల్ ఇదేనంటూ ఓ టైటిల్ బాగా ట్రెండ్ అవుతోన్న నేపథ్యంలో మేకర్స్ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్‌ను అధికారికంగా విడుదల చేయబోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ‘PKSDT’ టైటిల్, ఫస్ట్ లుక్‌ విడుదలకు సంబంధించి ఓ పోస్టర్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు.

ఈ పోస్టర్‌లో పరమశివుడిని చూపిస్తూ.. ఆ టైమ్ వచ్చేసింది అంటూ ‘PKSDT’కి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను మే 18 సాయంత్రం 4 గంటల 14 నిమిషాలకు రివీల్ చేయబోతున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు. దీంతో మరోసారి ‘PKSDT’ ట్యాగ్ సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇది తమిళంలో తెరకెక్కి ఘన విజయం సాధించిన ‘వినోదయ్య సిత్తం’ చిత్రానికి రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఆ సినిమాని తెరకెక్కించిన టాలెంటెడ్ యాక్టర్, డైరెక్టర్ సముద్రఖని (Samuthirakani)నే ఈ చిత్రానికి (PKSDT) కూడా దర్శకుడు. తమిళ్‌లో దేవుడి పాత్రలో స్వయంగా సముద్రఖనినే నటించారు. ఈ రీమేక్‌లో మాత్రం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆ పాత్రను చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి టాకీపార్ట్ మొత్తం పూర్తయినట్లుగా మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. ఇంకా ఓ పాట చిత్రీకరించాలని అంటున్నారు.

PKSDT.jpg

ఈ పాట చిత్రీకరణ కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ భారీ సెట్‌ను రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఈ పాట పబ్‌లో చిత్రీకరించాల్సి ఉండటంతో.. గ్రాండ్‌గా పబ్ సెట్‌ వేశారని.. త్వరలోనే పాటను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory), జీ స్టూడియోస్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని జూలై 28న విడుదల చేయనున్నామని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే పలు టైటిల్స్ వైరల్ అవుతున్న నేపథ్యంలో.. ఈ సినిమాకు ఏ టైటిల్ పెట్టబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఆసక్తికి తెరపడాలంటే.. ఇంకొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదు.


ఇవి కూడా చదవండి:

************************************************

*Kavya Thapar: మరణం అంచుల వరకు వెళ్ళి వచ్చా

*Major: ‘మేజర్’ హీరో అడివి శేష్‌‌ను.. మాజీ రాష్ట్రపతి ఇంటికి పిలిచి మరీ..!

* Sharwanand: మే ఎండింగ్‌లో.. జైపూర్‌లో పెళ్లి అనుకున్నారు కానీ..?

*Vijay Antony: చాలా రోజులు అరటిపళ్ళు తిని బతికా..

*Nikhil: అమిత్ షా నుంచి నాకూ ఆహ్వానం వచ్చింది.. కానీ?

Updated Date - 2023-05-17T13:41:43+05:30 IST