OTT Movies: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు ఇవే..

ABN , First Publish Date - 2023-03-24T08:24:50+05:30 IST

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలకు మాత్రం మేలు జరిగింది.

OTT Movies: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు ఇవే..
ott

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలకు మాత్రం మేలు జరిగింది. ఈ మహమ్మారి తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్‌లో విడుదలలు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. ప్రత్యేక కంటెంట్‌తో అటు థియేటర్స్‌కి.. ఇటు టీవీలకి ప్రత్యామ్నాయంగా మారిపోతున్నాయి. కాగా మార్చి 23న ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..

ఓ మేరీ లైలా (Oh meri Laila)

ఓ మేరీ లైలా అనేది మలయాళ రొమాంటిక్ డ్రామా చిత్రం. డిసెంబర్ 23, 2022న థియేటర్లలో విడుదలైంది. అభిషేక్ కెఎస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లైలాసురన్ పాత్రలో ఆంటోని వర్గీస్ నటించాడు. కిచు తెల్లుస్, నందన రాజన్ కీలక పాత్రలు పోషించారు.

ఓ కాలేజీ కుర్రాడు ఒక రహస్యమైన కొత్త అమ్మాయితో ప్రేమలో పడతాడు. దాని వల్ల అతని జీవిత అనుకొని మలుపులు తిరుగుతుంది. వాటి నుంచి ఆ కుర్రాడు ఎలా బయట పడ్డాదనేది ఈ చిత్ర కథాంశం. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సైనా ప్లేలో స్ట్రీమింగ్ అవుతోంది.

laila.jpg

మూన్ రైస్ (Moonrise)

విల్ బ్రౌన్ అనే గాయకుడు భార్య మరణిస్తుంది. దాని వల్ల అతనిలో దుఃఖం, బాధ పెరిగి వృత్తిని పక్కన పెట్టేస్తాడు. అలాగే తన కూతురికి కూడా దూరం అవుతాడు. ఈ తరుణంలోనే ఓ గుర్రపు శిక్షకుడు అతని బలం, టాలెంట్ ని గుర్తించి ప్రోత్సహిస్తాడు. దాని వల్ల ఆ గాయకుడి జీవితం ఎలాంటి మలుపులు తీసుకుందానేది ఈ చిత్ర కథాంశం. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది.

moonrise.jpg

జోన్నీ (Johnny)

పాట్రిక్ అనే ఒక చిన్న పట్టణంలోని ఇంటకి వెళతాడు. అతను చేసిన తప్పుకు శిక్షగా ఆ పట్టణంలోని ఓ ధర్మశాలలో సమాజ సేవకు చేయమని చేయాల్సి వస్తుంది. అక్కడ అతనికి అసాధారణ వ్యక్తి అయిన ఫాదర్ జాన్ కాజ్‌కోవ్స్కీని కలుస్తాడు. అలాగే అతని ప్రోద్బలంతో రోగులకు సేవ చేస్తాడు. దాని వల్ల అతని నిజమైన ప్రేమ అంటే ఏం చేస్తుందో తెలుస్తుంది. ఆ తర్వాత అతనే ఆ ధర్మశాలకి లీడర్ అవుతాడు. అలా అతని జీవితంలో చోటు చేసుకున్న మార్పు కథే ‘జోన్నీ’. డేనియల్ జోరెస్జెక్ దర్శకత్వం వహించిన ఈ పోలిష్ చిత్రం ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

johnny.jpg

అమెజాన్ ప్రైమ్ (Amazon prime)

Legacy peak - ఇంగ్లిష్

How to Survive Being Single Season 3 - ఇంగ్లిష్

Nothing like Paris - టాగాలాగ్

నెట్ ఫ్లిక్స్ (Netflix)

The Night Agent - ఇంగ్లిష్, హిందీ

Furies - వియత్నామీస్

షామారో మీ (Shamaroo me)

Karma - గుజరాతీ

ఎమ్ఎక్స్ ప్లేయర్ (MX player)

Tu Zakhm Hai Season 2 - హిందీ

ఇవి కూడా చదవండి:

Samyuktha Menon: మాట ఇచ్చి ఎందుకు తప్పారు.. ‘విరూపాక్ష’ టీంపై నటి ఫైర్..

NTR30: భయం పుట్టించేందుకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్

Kota Srinivasa Rao: ఇలా చేస్తే గుండె ఆగిపోతుంది.. మరణ వార్తలపై స్పందించిన కోటా

Adipurush: ఓంరౌత్ మేలుకో.. ట్రెండింగ్‌లో ప్రభాస్ మూవీ..

Niharika Konidela: అలా చేయడం దేనికి సంకేతం.. భర్తతో విబేధాలు వచ్చాయా?

Allu Arjun: హీరోయిన్‌ని బ్లాక్ చేసిన ఐకాన్ స్టార్.. నటి ట్వీట్ చేయడంతో..

LEO: మళ్లీ కలుసుకుందాం.. సార్‌

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

Updated Date - 2023-03-24T08:25:15+05:30 IST