సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Iravatham: కనురెప్ప వేయనివ్వని చిత్ర కథనం.. చిన్న సినిమా సక్సెస్‌కు ఇది కదా నిదర్శనం

ABN, First Publish Date - 2023-03-23T22:03:48+05:30

ఎస్తేర్ నోర్హ (Ester Noronha), తన్వి నెగ్గి (Tanvi Negi), అమర్ దీప్ (Amardeep), అరుణ్ (Arun), సప్తగిరి (Saptagiri) నటించిన ‘ఐరావతం’ (Iravatham) చిత్రం ఓటీటీలో ఊహించని విజయాన్ని అందుకుంది. ఒక వైట్ కెమెరా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో

Ester Noronha In Iravatham Movie
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్తేర్ నోర్హ (Ester Noronha), తన్వి నెగ్గి (Tanvi Negi), అమర్ దీప్ (Amardeep), అరుణ్ (Arun), సప్తగిరి (Saptagiri) నటించిన ‘ఐరావతం’ (Iravatham) చిత్రం ఓటీటీలో ఊహించని విజయాన్ని అందుకుంది. ఒక వైట్ కెమెరా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో (Disney Puls Hotstar) చేసిన మ్యాజిక్ ఇప్పుడు ఐరావతం ద్విముఖం (పార్ట్2) తీయడానికి నాంది పలికింది. ఒక చిన్న సినిమా ఊహించని ప్రజాదరణ దక్కించుకుని 200 మిలియ‌న్ అండ్ ఫిఫ్టీ థౌజండ్ వ్యూయింగ్ మినిట్స్‌ సాధించి.. సంచలనానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఊహించని ఆదరణ దక్కించుకున్న ఈ చిత్రం ఇప్పటివరకు రికార్డ్ వ్యూయింగ్ మినిట్స్ సాధించడమే కాకుండా.. ఇంకా ప్రేక్షకుల ఆదరణను పొందుతూనే ఉంది.

నూజివీడు టాకీస్‌పై (Nuziveedu Talkies) రేఖ పలగాని సమర్పణలో రాంకీ పలగాని (Ramki Palagani), బాలయ్య చౌదరి చల్లా (Balaiah Chowdary Challa), లలిత కుమారి తోట (Lalitha Kumari Thota) ఈ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ డీసెంట్ ఫ్యూజన్ డ్రామా నవంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. న్యూ యేజ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలో ఘన విజయాన్ని అందుకోవడంతో.. టీమ్ అంతా కలిసి సక్సెస్ పార్టీతో సెలబ్రేట్ చేసుకుంది. అంతేకాదు, త్వరలోనే రెండో పార్ట్‌కు సంబంధించిన వివరాలను కూడా వెల్లడిస్తామని మేకర్స్ అధికారికంగా తెలిపారు.

కథ విషయానికి వస్తే (Iravatham Story).. శ్లోక (Sloka) అనే బ్యూటీషియన్‌కి బర్త్ డే రోజు ఒక వైట్ కెమెరా గిఫ్ట్‌గా వస్తుంది. అప్పటి నుంచి ఆమె లైఫ్ తలక్రిందులు అవుతుంది. బర్త్ డే వీడియోలు తీస్తే డెత్‌డే వీడియోలు వస్తుంటాయి. అందులో ఇష్యూస్ డీకోడ్ చేసే క్రమంలో ఎన్నో రహస్యాలు బయట పడుతుంటాయి. ఆ రహస్యాల అల్లికే ఐరావతం అనే తెల్ల కెమెరా కథ. కథా గమనంలో మనం ఒకటి ఊహిస్తే క్షణ క్షణానికి అది మారిపోతుంటుంది. క‌థానాయ‌కుడు పెళ్లి చేసుకోవాల‌నుకున్న‌ పెళ్లి కూతురు త‌న ప్రేమించిన వాడితో వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠతో సాగే చిత్రమిది. గుణశేఖర్ శిష్యుడు సుహాస్ మీరా ఈ మూవీని స్టోరీ మూడ్ ఫ్లోకి అనుగుణంగా చిత్రీకరించారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*Brahmanandam: నాకు మోక్షం వద్దు.. మళ్లీ మళ్లీ జన్మించాలనే కోరుకుంటా!

*Trivikram Srinivas: ఆయన స్థాయి నుంచి ఎన్నో మెట్లు దిగి.. ఈ పాత్రను పోషిస్తున్నారు

*NTR30: ఈ టెక్నీషియన్స్ మాటలు వింటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు

*Madhav: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న రవితేజ వారసుడు.. ఎవరి డైరెక్షన్‌లో అంటే?

*Rangamarthanda: బ్రహ్మీ నటనకు మెగాస్టార్, గ్లోబల్ స్టార్ ఫిదా!.. ఇద్దరూ కలిసి ఏం చేశారంటే?

*Das Ka Dhamki: ఇదేందయ్యా ఇది.. ‘ధమ్కీ’నా? ‘ధమాకా’నా?

*RRR Naatu Naatu: అమెరికాలో టెస్లా కార్ లైట్ షో.. దర్శకధీరుడు ఫిదా..

*NBK108: బాలయ్య సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే.. సెట్ వీడియో వైరల్

*Hema: కోట శ్రీనివాసరావు మృతి అనే వార్తలపై హేమ ఫైర్.. ఫైనల్‌గా ఏం చేసిందంటే?

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

Updated Date - 2023-03-23T22:04:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!