సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Raghavendra Rao: దర్శకేంద్రుడికి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు.. ఎవరు ఇచ్చారంటే..

ABN, First Publish Date - 2023-03-27T10:25:08+05:30

టాలీవుడ్‌ మూవీలో రొమాంటిక్ సాంగ్స్ అంటే మొదట గుర్తొచ్చే పేరు కె. రాఘవేంద్రరావు (K Raghavendra Rao).

life time achievement award to Raghavendra Rao
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్‌ మూవీలో రొమాంటిక్ సాంగ్స్ అంటే మొదట గుర్తొచ్చే పేరు కె. రాఘవేంద్రరావు (K Raghavendra Rao). ఆయన సినీయర్ ఎన్టీఆర్ (Sr NTR) నుంచి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) వరకు ఎంతోమంది స్టార్ హీరోలతో సూపర్ హిట్ చిత్రాలు తీశారు. దర్శకరత్న దాసరి నారాయణ రావుతో కలిసి డైరెక్టర్లకి సైతం ఓ స్టార్‌డమ్ తీసుకొచ్చారు. అందుకే ఆయన్ని తెలుగు ప్రేక్షకులు ప్రేమగా దర్శకేంద్రుడు అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ స్టార్ దర్శకుడికి తాజాగా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అవార్డుని రాఘవేంద్రరావు ప్రదానం చేసింది. ఓ వేడుకని ఏర్పాటు చేసి అతిథుల సమక్షంలో ఆయనకి రోటరీ క్లబ్ ప్రతినిధులు అవార్డును అందజేశారు.

ఈ సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ‘విజయవాడ నగరం కళలకు కాణాచిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు (life time achievement award) అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడే పుట్టాను.. అలాగే ఎన్టీఆర్‌ వంటి మహానీయులు పుట్టిన నేల‌పై అవార్డు అందుకోవడం జీవితంలో మరచిపోలేను. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ వారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు.

అలాగే.. సినిమాల గురించి రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్తతరం దర్శకులు‌ చాలా మంచి సినిమాలు తీస్తున్నారు. వాళ్ల దగ్గరకి వెళ్లి ‌కొత్త సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకుంటున్నాను. ప్రస్తుతం నేను ఏ సినిమాకు దర్శకత్వం వహించడం‌ లేదు. కొత్తగా కె.ఆర్.ఆర్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టాను. దీని ద్వారా కొత్త దర్శకులు, నటీనటులను ప్రోత్సహిస్తున్నాం. ప్రతిభ ఉన్న వారిని గుర్తించి‌ వారితో కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేశాం. చాలా మంది అక్కడ పని‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు’ అని తెలిపారు.

అలాగే, ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్ రావడంపై దర్శకుడు స్పందిస్తూ.. ‘భారతదేశమే కాదు... ప్రపంచం మొత్తం మన‌ వైపు చూసేలా చేసిన ఆర్.ఆర్.ఆర్ టీం కృషికి హ్యాట్సాఫ్. శాంతి నివాసం ద్వారా రాజమౌళి‌ కెరీర్ ప్రారంభించారు. స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి నేటి వరకు రాజమౌళి హార్డ్‌‌వర్క్‌నే నమ్ముకున్నారు. మనకి ప్రతిష్టాత్మక ఆస్కార్ రావడానికి కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

Nawazuddin Siddiqui: ఆ ఇద్దరిపై 100 కోట్ల దావా.. తననే మోసం చేశారంటూ..

NTR: ఆ భావోద్వేగం కలిసొచ్చింది.. వారిద్దరూ కలిస్తే అంతేమరి..

Dasara Movie: సుకుమార్‌పై కామెంట్స్.. కాంట్రవర్సీలపై నాని రియాక్షన్ ఏంటంటే..

LEO Video Viral: ఓ సినిమా కోసం ఇంత కష్టపడాలా?

Breaking: హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం

Samyuktha Menon: మాట ఇచ్చి ఎందుకు తప్పారు.. ‘విరూపాక్ష’ టీంపై నటి ఫైర్..

NTR30: భయం పుట్టించేందుకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్

Kota Srinivasa Rao: ఇలా చేస్తే గుండె ఆగిపోతుంది.. మరణ వార్తలపై స్పందించిన కోటా

Adipurush: ఓంరౌత్ మేలుకో.. ట్రెండింగ్‌లో ప్రభాస్ మూవీ..

Updated Date - 2023-03-27T11:25:49+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!