Memories: సుధాకర్ కోమాకుల నెక్ట్స్ స్టెప్ ఇదే..

ABN , First Publish Date - 2023-07-15T18:07:43+05:30 IST

‘నారాయణ అండ్ కో’ చిత్రం తర్వాత యంగ్ హీరో సుధాకర్ కోమాకుల ‘మెమొరీస్’ అనే మ్యూజిక్ వీడియోతో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సాంగ్‌ని సుధాకర్ తన సొంత బ్యానర్ సుఖ మీడియాలో నిర్మిస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఈ పాటని రియల్ వరల్డ్ ఫుటేజ్, 2డి యానిమేషన్‌తో కలిపి చిత్రీకరించినట్లుగానూ, పాన్ ఇండియా భాషల్లో ఈ పాటని విడుదల చేయబోతున్నట్లుగా ఈ హీరో చెప్పుకొచ్చారు.

Memories: సుధాకర్ కోమాకుల నెక్ట్స్ స్టెప్ ఇదే..
Hero Sudhakar Komakula

‘నారాయణ అండ్ కో’ (Narayana and Co) చిత్రం తర్వాత యంగ్ హీరో సుధాకర్ కోమాకుల (Sudhakar Komakula) ‘మెమొరీస్’ (Memories) అనే మ్యూజిక్ వీడియోతో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సాంగ్‌ని సుధాకర్ తన సొంత బ్యానర్ సుఖ మీడియాలో నిర్మిస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఈ పాటని రియల్ వరల్డ్ ఫుటేజ్, 2డి యానిమేషన్‌తో కలిపి చిత్రీకరించినట్లుగా ఆయన తెలుపుతున్నారు. అతి త్వరలో ఈ వీడియో సాంగ్‌ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో యూట్యూబ్ వేదికపై విడుదల చేయనున్నట్లుగా సుధాకర్ కోమాకుల చెప్పుకొచ్చారు.


వర్ధమాన ఫిలిం మేకర్ అన్వేష్ భాష్యం దర్శకత్వంలో ఈ సాంగ్ తెరకెక్కింది. గతంలో అన్వేష్ సైమా అవార్డ్స్‌లో నామినేట్ అయిన ‘చోటు’ అనే షార్ట్ ఫిలింకి కాన్సెప్ట్ రైటర్‌గా.. సోని మ్యూజిక్‌లో విడుదలైన మరో షార్ట్ ఫిలిం ‘మనోహరం’కి రైటర్‌గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. ఇప్పుడు మెమొరీస్ సాంగ్ వరుణ్ అనే యువకుడి కథని తెలియజేసే విధంగా ఉంటుందని అంటున్నారు. మెమొరీస్ సాంగ్ కాన్సెప్ట్ విషయానికి వస్తే.. వరుణ్ అనే యువకుడు తన జర్నీలో ఫీలింగ్స్ కోల్పోయే స్థితి నుంచి తన గమ్యం ఏంటి అని తెలుసుకునే వాడిగా ఎలా మారాడు అనేది చూపించినట్లుగా యూనిట్ చెబుతోంది.

Sudhakar-Komakula-2.jpg

ఈ పాటని వరుణ్ కంపోజ్ చేశారు. తెలుగులో ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) పాడగా.. కన్నడలో వాసుకి వైభవ్ పాడారు. ఈ వీడియో సాంగ్ దృశ్యం పరంగా ఆకట్టుకుంటూ సింపుల్ హుక్ స్టెప్ కూడా కలిగి ఉంటుందని. ప్రతి ఒక్కరూ డ్యాన్స్ చేయాలనిపించే విధంగా ఆ స్టెప్ ఉంటుందని యూనిట్ చెబుతోంది. ఈ సాంగ్‌ అందరినీ ఆకట్టుకుంటూ.. జీవితంలో చోటు చేసుకునే మార్పులని హైలైట్ చేసే విధంగా ఉంటుందని.. త్వరలోనే విడుదల చేయనున్నామని హీరో సుధాకర్ కోమాకుల తెలిపారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*SSMB29: మహేష్ కుమార్తె, ఎన్టీఆర్ కుమారుడు.. ఇరు హీరోల ఫ్యాన్స్‌కి ట్రీటే ట్రీటు!

**************************************

*Namrata Shirodkar: గౌతమ్ ఎంట్రీకి టైముంది.. సితార ఇంట్రెస్ట్‌గా ఉంది

**************************************

*Anasuya: మళ్లీ ఏమైంది అనసూయ.. ‘బేబీ’ మూవీ గురించేనా..!

**************************************

*Keerthi Suresh: మీ షర్టు వేసుకుంటానని హీరోని అడిగేశా..

**************************************

*Sai Dharam Tej: పవన్ మామయ్య.. నన్ను కూడా రాజకీయాల్లోకి రమ్మన్నారు

**************************************

*Honey Rose: మాములుగా చూస్తేనే తట్టుకోలేరు.. హనీ రోజ్ ఇలా కనిపిస్తే కష్టమే!

**************************************

Updated Date - 2023-07-15T18:07:43+05:30 IST