Tollywood Heroines: ఈ అందాల భామలు.. కాలక్షేపంలోనూ కాసులు సంపాదిస్తున్నారు

ABN , First Publish Date - 2023-03-26T12:23:14+05:30 IST

కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న కథానాయికలు... తమ సంపాదనను వ్యాపార రంగంలో పెట్టుబడిగా పెట్టి, అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు.

Tollywood Heroines: ఈ అందాల భామలు.. కాలక్షేపంలోనూ కాసులు సంపాదిస్తున్నారు

కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న కథానాయికలు... తమ సంపాదనను వ్యాపార రంగంలో పెట్టుబడిగా పెట్టి, అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ఇదంతా కాలక్షేపం కోసమే అయినా... ఈ రూపంలోనూ కాసుల వర్షం కురుస్తోంది. వెండితెరపై రాణిస్తూ.. వ్యాపార రంగంలోనూ విజృంభిస్తున్న ఆ కథానాయికలెవరంటే..?!

‘కిచెడ్‌’ ఫర్నీచర్‌

పెళ్లయ్యాక.. కొత్త బాధ్యతలొస్తాయి. ఆర్థికంగా మరింత నిలదొక్కు కోవాలని చూస్తారు. గౌతమ్‌ కిచ్లూని వివాహం చేసుకొన్న కాజల్‌ అగర్వాల్ (Kajal Aggarwal)... భర్త అడుగుజాడల్లో నడుస్తోంది. గౌతమ్‌ ఓ వ్యాపారవేత్త. ఫర్నీచర్‌ రంగంలో ఎన్నో ఏళ్లుగా రాణిస్తున్నారు. ఇప్పుడు కాజల్‌తో కలిసి ‘కిచెడ్‌’ అనే ఓ సంస్థని ప్రారంభించారు. ఓవైపు సినిమాలు చేస్తూనే ‘కిచెడ్‌’కి సంబంధించిన వ్యవహారాల్ని చక్కబెడుతోంది కాజల్‌. తొలి ఏడాదిలోనే ‘కిచెడ్‌’కి భారీ లాభాలొచ్చాయని, ఉద్యోగస్తులకు బోనస్‌లు అందించిందని సమాచారం. త్వరలోనే ‘కిచెడ్‌’ని మరిన్ని ప్రాంతాల్లో విస్తరించే ఆలోచనల్లో ఉన్నారు.

kajal1.jpg

‘వైట్‌ అండ్‌ గోల్డ్‌’ ఆభరణాలు

తమన్నా (Tamannaah)కు ఆభరణాలంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే జ్యువెలరీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘వైట్‌ అండ్‌ గోల్డ్‌’ పేరుతో ఓ జ్యువెలరీ సంస్థని ప్రారంభించింది తమన్నా. ఆన్‌‌లైన్‌ ద్వారానే విక్రయాలు సాగుతుంటాయి. ఈ జ్యువెలరీ డిజైన్లని తమన్నా స్వయంగా రూపొందిస్తుందట. తమన్నా బ్రాండ్‌ కావడంతో వీటికి మంచి ఆదరణ లభిస్తోంది. ‘‘చిన్నప్పటి నుంచీ నాకు ఈ రంగంపై ఆసక్తి ఉంది. సినిమాల్లోకి రాకపోయి ఉంటే.. జ్యువెలరీ బిజినెస్‌లోకి నేరుగా అడుగుపెట్టేదాన్ని. నా అభిరుచికి తగిన రంగాన్ని ఎంచుకొన్నందుకు ఆనందంగా ఉంద’’ని చెబుతోందీ మిల్కీ బ్యూటీ.

tamanna.jpg

‘వెడ్డింగ్‌ ఫ్యాక్టరీ’ ఈవెంట్లు

తెలుగునాట మెరిసిన తాప్సీ పన్ను (Taapsee pannu).. ప్రస్తుతం బాలీవుడ్‌లో యమా బిజీగా ఉంటోంది. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ బాగా సంపాదిస్తోంది. అందులో కొంతభాగాన్ని ‘ది వెడ్డింగ్‌ ఫ్యాక్టరీ’కి పెట్టుబడిగా తరలిస్తోంది. తాప్సి సోదరి షగుణ్‌ ఆధ్వర్యంలో ‘ది వెడ్డింగ్‌ ఫ్యాక్టరీ’ అనే ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ నడుస్తోంది. పేరుకి షగుణ్‌ యజమాని అయినా, దాని వెనుక అన్నీ తాప్సినే. ‘‘ఈ రోజుల్లో ఏ చిన్న కార్యక్రమమైనా ఘనంగా చేసుకోవాలని భావిస్తున్నారు. ఈవెంట్‌ కంపెనీల అవసరం ఉందని భావించా. ప్రస్తుతం లాభాల బాటలో నడుస్తోంది. దానికంటే నా వల్ల ఎంత మందికి ఉపాధి దొరుకుతోందనేదే నాకు ప్రధానం’’ అంటోంది తాప్సి.

tapsee.jpg

‘శ్రీ స్పందన’ స్పా

పిన్న వయసులోనే చిత్రసీమలో అడుగుపెట్టింది శ్రియా శరణ్ (Shriya saran). ఇప్పటికీ సినిమాలు చేస్తోంది. మరోవైపు ‘శ్రీ స్పందన’ అనే పేరుతో ‘స్పా’ బిజినెస్‌లో రాణిస్తోంది. ఈ కంపెనీ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో పని చేసేవాళ్లంతా కంటి చూపు సమస్యతో బాధ పడుతున్నవాళ్లే. ‘‘లాభాల కోసం ఈ వ్యాపారం చేయడం లేదు. సమాజానికి నా వంతు సేవ చేయాలనే ఈ స్పాని ప్రారంభించా. సినిమా నాకెంతో ఇచ్చింది. సంపాదించింది ఏదో ఓ రూపంలో తిరిగి ఇవ్వాలని అనుకొంటున్నా’’ అంటోంది.

Shriya.jpg

‘ఎఫ్‌ 45’ ఫిట్‌నెస్‌

సినిమాలూ, ఫిట్‌నెస్‌.. ఇదే రకుల్‌ ప్రీత్‌సింగ్‌ (Rakul preet singh) ప్రపంచం. ఉంటే సెట్లో.. లేదంటే జిమ్‌లో అన్నట్టు రకుల్‌ జీవన శైలి సాగుతుంది. ‘ఎఫ్‌ 45’ పేరుతో ఫిట్‌నెస్‌ స్టూడియోని ప్రారంభించింది. అనతి కాలంలోనే ‘ఎఫ్‌ 45’ ఓ బ్రాండ్‌గా మారిపోయింది. ‘‘ఆరోగ్యం అందరికీ అవసరమే. ఇప్పుడు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెరుగుతోంది. మా సక్సెస్‌ సీక్రెట్‌ ఇంతకు మించి మరేం లేదు’’ అని చెప్పుకొచ్చింది రకుల్‌.

rakul.jpg

‘సాకీ’ బ్రాండ్‌

మధ్యతరగతి నుంచి వచ్చిన సమంత (Samantha)కు డబ్బు విలువ బాగా తెలుసు. అందుకే సినిమాల ద్వారా సంపాదిస్తున్న ప్రతీ పైసానూ జాగ్రత్తగా ఖర్చు పెట్టాలని భావిస్తుంటుంది. అందులో భాగంగా వ్యాపార రంగంపై దృష్టి నిలిపింది. ‘సాకీ’ అనే పేరుతో గార్మెంట్‌ బ్రాండ్‌ని మొదలెట్టింది సమంత. ‘సాకీ..’ అనే పేరులో సమంత, అక్కినేని అనే రెండు పేర్లు కలిసి ఉన్నాయి. నాగచైతన్యతో విడిపోయినప్పటికీ.. ఈ బ్రాండ్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘‘మధ్య తరగతి అమ్మాయిలు కూడా నాణ్యమైన దుస్తులు ధరించాలనేదే నా కోరిక. ఆ ఆశయంతోనే ‘సాకీ’ ప్రారంభించాను’’ అని ఈ బ్రాండ్‌ లక్ష్యాన్ని రెండు ముక్కల్లోనే చెప్పేసింది సమంత. ఇదే కాకుండా ఎడ్యుకేషనల్‌ ఫీల్డ్‌లో కూడా అడుగు పెట్టాలని భావిస్తోంది.

sam.jpg

ఇవి కూడా చదవండి:

NTR: ఆ భావోద్వేగం కలిసొచ్చింది.. వారిద్దరూ కలిస్తే అంతేమరి..

Dasara Movie: సుకుమార్‌పై కామెంట్స్.. కాంట్రవర్సీలపై నాని రియాక్షన్ ఏంటంటే..

LEO Video Viral: ఓ సినిమా కోసం ఇంత కష్టపడాలా?

Breaking: హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం

Samyuktha Menon: మాట ఇచ్చి ఎందుకు తప్పారు.. ‘విరూపాక్ష’ టీంపై నటి ఫైర్..

NTR30: భయం పుట్టించేందుకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్

Kota Srinivasa Rao: ఇలా చేస్తే గుండె ఆగిపోతుంది.. మరణ వార్తలపై స్పందించిన కోటా

Adipurush: ఓంరౌత్ మేలుకో.. ట్రెండింగ్‌లో ప్రభాస్ మూవీ..

Updated Date - 2023-03-26T12:27:39+05:30 IST