Adivi Sesh: సైన్స్‌ అంటే ఎంత ఇష్టమో.. గణితం అంటే అంత భయం

ABN , First Publish Date - 2023-03-23T22:35:20+05:30 IST

సైన్స్‌ (Science) అంటే ఎంత ఇష్టమో గణితం (Maths) అంటే అంత భయమని అన్నారు యంగ్ హీరో అడవి శేష్ (Adivi Sesh). హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో

Adivi Sesh: సైన్స్‌ అంటే ఎంత ఇష్టమో.. గణితం అంటే అంత భయం
Hero Adivi Sesh

సైన్స్‌ (Science) అంటే ఎంత ఇష్టమో గణితం (Maths) అంటే అంత భయమని అన్నారు యంగ్ హీరో అడవి శేష్ (Adivi Sesh). హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో గుడ్‌ స్కూల్‌ యాప్‌ (Good School App)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదవడం ఎంత ముఖ్యమో.. చదవి అంశాన్ని గుర్తు పెట్టుకోవడం అంతే ముఖ్యం. పరీక్షల (Exams) సయమంలో తీవ్ర ఒత్తిడికి గురి కాకుండా సులభమైన పద్ధతితో నేర్చుకోని గుర్తు పెట్టుకోవాలి. తెలుగు, ఆంగ్లంలో బోధన అందించడం ద్వారా గ్రామీణ ప్రాంత పిల్లలకు సైతం ఎంతో ఉపయోగంగా ఉంటుంది. తెలుగు వారికి కావాల్సిన రీతిలో విద్యను అందించేందుకు యాప్‌ను అందుబాటులోకి తీసుకరావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రస్తుతం గూఢచారి 2 (Gudachari 2) చిత్రం సెట్స్‌పై ఉందని.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని.. ఈ తర్వాత హాలీవుడ్‌ (Hollywood) తరహా చిత్రంలో నటిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. (Adivi Sesh Launches Good School App)

Sesh.jpg

విద్యార్థులకు నాణ్యత గల దృశ్యమాన కంటెంట్‌ను అందించడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన కొత్త-ఏజ్డ్-టెక్కో సిస్టమ్, గుడ్ స్కూల్ యాప్‌ అని ఛైర్మన్‌ వెంకట్‌రెడ్డి (Venkat Reddy) అన్నారు. శిక్షణతో పాటు, ఇది విశిష్టమైన విద్యా అనుభవాలను అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో సహకారం, సృజనాత్మకత, ఆట నేర్చుకునే విధంగా రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎండీ శ్రీనివాసరావు, సీఈవో విజయ్‌ భాస్కర్‌, విద్యారంగానికి సంబంధించిన ప్రముఖులు పున్నమి కృష్ణ, మేములపాటి శ్రీధర్‌, అజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*Brahmanandam: నాకు మోక్షం వద్దు.. మళ్లీ మళ్లీ జన్మించాలనే కోరుకుంటా!

*Trivikram Srinivas: ఆయన స్థాయి నుంచి ఎన్నో మెట్లు దిగి.. ఈ పాత్రను పోషిస్తున్నారు

*NTR30: ఈ టెక్నీషియన్స్ మాటలు వింటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు

*Madhav: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న రవితేజ వారసుడు.. ఎవరి డైరెక్షన్‌లో అంటే?

*Rangamarthanda: బ్రహ్మీ నటనకు మెగాస్టార్, గ్లోబల్ స్టార్ ఫిదా!.. ఇద్దరూ కలిసి ఏం చేశారంటే?

*Das Ka Dhamki: ఇదేందయ్యా ఇది.. ‘ధమ్కీ’నా? ‘ధమాకా’నా?

*RRR Naatu Naatu: అమెరికాలో టెస్లా కార్ లైట్ షో.. దర్శకధీరుడు ఫిదా..

*NBK108: బాలయ్య సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే.. సెట్ వీడియో వైరల్

*Hema: కోట శ్రీనివాసరావు మృతి అనే వార్తలపై హేమ ఫైర్.. ఫైనల్‌గా ఏం చేసిందంటే?

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

Updated Date - 2023-03-23T22:35:22+05:30 IST