Shazam!: ‘దేవుడి కుమార్తెలతో పోరాటానికి సిద్ధం’.. మొదటి భాగాన్ని మించేలా..

ABN , First Publish Date - 2023-03-15T14:23:20+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా డీసీ సూపర్ హీరోలకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Shazam!: ‘దేవుడి కుమార్తెలతో పోరాటానికి సిద్ధం’.. మొదటి భాగాన్ని మించేలా..
Shazam

ప్రపంచవ్యాప్తంగా డీసీ సూపర్ హీరోలకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డీసీ కామిక్స్‌లోని సూపర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్ వంటి పలువురు సూపర్ హీరో పాత్రలకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ కోవాలోనే మరో సూపర్ హీరో చేశారు. అతనే ‘షాజమ్!’ (Shazam!). 2019తో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. అప్పటి నుంచి ఈ మూవీ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆ ఎదురు చూపులకి తెరదించుతూ.. ‘షాజమ్‌ : ప్యూరీ ఆఫ్‌ ది గాడ్స్‌’ (Shazam! Fury of the Gods) మూవీ ఈ నెల 17న తమిళం, తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమైంది. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని నిర్మాణ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ వాయిదా వేసింది. దీనికి కారణం.. 2019లో డేవిద్‌ ఎఫ్‌ శాండ్‌బెర్గ్‌ దర్శకత్వం వహించిన ‘షాజమ్‌’ సూపర్‌ హిట్‌ సాధించింది. అయితే తర్వాత వచ్చిన ‘బ్యాట్‌మ్యాన్‌’, ‘సూపర్‌మాన్‌’లు ప్రేక్షకులను నిరాశపరిచాయి.

ఇదే విషయంపై డేవిడ్‌ స్పందిస్తూ.. ‘తొలి భాగం ‘షాజమ్‌’ కంటే సీక్వెల్‌ను మరింత భారీ హంగులతో తెరకెక్కించాం. ‘షాజమ్‌’ మూవీ ఆఖరులో ఫ్యామిలీలోని వారందరినీ సూపర్‌ హీరోలుగా చూపించగా, రెండో భాగంలో మాత్రం యుక్తవయసులో వారంతా ఏ విధంగా జీవించారు? వారు ఏ విధంగా సూపర్‌ హీరోలు అయ్యారు? ఎలా కలిసి ముందుకు సాగారు? అనే అంశాలను ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా చూపించామని, గ్రాఫిక్స్‌ సన్నివేశాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయని’ వివరించారు. ఇందులో జచరీ లెవీ, ఆషెర్‌ ఏంజెల్‌, జాక్‌ డేనల్‌ గ్రాజెర్‌, ఆడమ్‌ బ్రాడీ, హెలెన్‌ మిర్రెన్‌ కీలకపాత్రల్లో నటించారు.

ఇవి కూడా చదవండి:

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ

Naatu Naatu: ‘నాటు నాటు’కి అవార్డు సరే.. ఆ వీడియో చూసి ఆస్కార్స్ మేనేజ్‌మేంట్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఆగ్రహం.. అందులో ఏముందంటే..

Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..

SIR OTT Streaming: ఓటీటీలో క్లాస్ తీసుకోడానికి సిద్ధమైన ధనుష్..

Rana Naidu Webseries: ఛీఛీ.. ఇలా చేశారేంటి?.. దగ్గుబాటి హీరోలని ఆడేసుకుంటున్న నెటిజన్లు

NTR: ఏ హీరో ఇష్టపడని పాత్రలో అదరగొట్టిన ఎన్‌టీఆర్.. ఏం చేసినా అంతే..

Updated Date - 2023-03-15T14:23:20+05:30 IST