Ram Charan: స్టార్ వార్స్ డైరెక్టర్‌తో మెగా పవర్ స్టార్

ABN , First Publish Date - 2023-03-10T17:40:31+05:30 IST

టాలీవుడ్‌లోని టాప్ హీరోల్లో రామ్ చరణ్ (Ram Charan) ఒకరు. ‘మగధీర’, ‘రంగస్థలం’ వంటి చిత్రాలతో తనలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) తో వరల్డ్ వైడ్‌గా ఫేమ్‌ను సంపాదించుకున్నారు.

Ram Charan: స్టార్ వార్స్ డైరెక్టర్‌తో మెగా పవర్ స్టార్

టాలీవుడ్‌లోని టాప్ హీరోల్లో రామ్ చరణ్ (Ram Charan) ఒకరు. ‘మగధీర’, ‘రంగస్థలం’ వంటి చిత్రాలతో తనలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) తో వరల్డ్ వైడ్‌గా ఫేమ్‌ను సంపాదించుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1200కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఈ చిత్రం ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లోను సత్తా చాటింది. గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ఆస్కార్ నామినేషన్‌ను కూడా సాధించింది. ఈ అవార్డ్స్‌ను మార్చి 13న ప్రదానం చేయనున్నారు. ఈ నేపథ్యంలో చెర్రీ.. ఆస్కార్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా టాప్ టాలీవుడ్ డైరెక్టర్‌ను కలుసుకున్నారు. తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్‌లో భాగంగా స్టార్ వార్స్ డైరెక్టర్ జెజె. అబ్రామ్స్ (JJ. Abrams)ను కలుసుకున్నారు. ఆయనతో కలసి ఓ పార్టీలో పాల్గొన్నారు. అనంతరం ఇద్దరు కలసి ఫొటోలకు ఫోజులిచ్చారు. అందుకు సంబంధించిన పిక్స్‌ను రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘నేడు జెజె. అబ్రామ్స్‌ను కలుసుకున్నాను. ఈ పార్టీకి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. నేను మీకు పెద్ద అభిమానిని’’ అని రామ్ చరణ్ తెలిపారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రామ్ చరణ్ అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు.

రామ్ చరణ్ అంతకు ముందు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘చాలా మంది హాలీవుడ్ డైరెక్టర్స్‌తో పనిచేయాలని ఉంది. జెజె. అబ్రామ్స్, క్వింటన్ టొరెంటినో అంటే నాకు ఇష్టం. వారి చిత్రాలను చూస్తూ నేను పెరిగాను. హాలీవుడ్ సినిమాను త్వరలోనే చేస్తాను. ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి’’ అని రామ్ చరణ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

Pawan Kalyan: ఒక్క రోజుకు రూ.3కోట్ల రెమ్యునరేషన్!

Ileana D’Cruz: నిషేధంపై స్పందించిన కోలీవుడ్ నిర్మాతలు

Ram Charan: ‘ఆర్‌సీ15’ కోసం పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించిన మేకర్స్..!

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-10T17:41:42+05:30 IST