NTR vs Allu Arjun: ‘పుష్పరాజ్’ వర్సెస్ ‘దేవర’.. ఫిక్సయినట్టేనా?

ABN , First Publish Date - 2023-08-04T12:42:04+05:30 IST

‘2024 ఏప్రిల్’ ఊపిరి పీల్చుకో.. అసలు సిసలైన యుద్ధం మొదలవ్వబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ల చిత్రాలు రాబోయే వేసవికి పోటీ పడబోతున్నట్లుగా తాజాగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు చక్కర్లు కొడుతోన్న నేపథ్యంలో ఫ్యాన్స్ అనుకుంటున్న మాటలివి. ‘దేవర’, ‘పుష్ప 2’ చిత్రాలు రాబోయే వేసవి బరిలో ఉన్నట్లుగా టాక్ బయటికి రావడంతో.. ఫ్యాన్స్ ఈ రెండు సినిమాపై చర్చలు కొనసాగిస్తున్నారు.

NTR vs Allu Arjun: ‘పుష్పరాజ్’ వర్సెస్ ‘దేవర’.. ఫిక్సయినట్టేనా?
Allu Arjun and Jr NTR

‘2024 ఏప్రిల్’ ఊపిరి పీల్చుకో.. అసలు సిసలైన యుద్ధం మొదలవ్వబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Icon Star Allu Arjun)ల చిత్రాలు రాబోయే వేసవికి పోటీ పడబోతున్నట్లుగా తాజాగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు చక్కర్లు కొడుతోన్న నేపథ్యంలో ఫ్యాన్స్ అనుకుంటున్న మాటలివి. నిజంగా ఇదే నిజమైతే మాత్రం.. మెగా, నందమూరి ఫ్యాన్స్‌కి (Mega and Nandamuri Fans) బాగా పని దొరికేసినట్లే. అల్లు అర్జున్, సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ‘పుష్ప’ (Pushpa)కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘పుష్ప2’ (Pushpa 2 The Rule) ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. అలాగే ఎన్టీఆర్, కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘దేవర’ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సినిమా కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా మేకర్స్ తీసుకున్నారు. దీంతో ఈ రెండు చిత్రాలు ఒకే నెలలో వస్తున్నాయనే న్యూస్.. ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.


Allu-Arjun.jpg

‘పుష్ప 2’ విషయానికి వస్తే.. ‘పుష్ప’ సినిమా విడుదలైన రోజు నెగిటివ్ టాక్ వచ్చినా.. ఆ తర్వాత కలెక్షన్ల వర్షం కురిసింది. ముఖ్యంగా అల్లు అర్జున్‌కి ఇంటర్నేషనల్ క్రేజ్ వచ్చేలా చేసిందీ చిత్రం. దీంతో ఈ సీక్వెల్‌పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్టే.. ఈ సీక్వెల్‌ను సుకుమార్ అంతే భారీగా తెరకెక్కిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘వేర్ ఈజ్ పుష్ప’ వీడియో కూడా ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ను డబుల్ చేసింది. రష్మిక మందన్నను ఈసారి ఎలా చూపిస్తారో అనే క్యూరియాసిటీ, ఈ పార్ట్‌లో భన్వర్ సింగ్ షెకావత్ రోల్ ఎలా డిజైన్ చేస్తున్నారో అనే ఎగ్జయిట్‌మెంట్.. అన్నీ ఒకవైపు అయితే.. ‘పుష్పరాజ్’‌గా బన్నీ ఏ రేంజ్‌లో చెలరేగనున్నాడో అనేది.. ఈ సినిమా గురించి నిత్యం మాట్లాడుకునేలా చేస్తోంది. (Devara vs Pushpa 2)


Devara.jpg

ఇక ‘దేవర’ (Devara) సినిమా కోసం ఎన్టీఆర్ ఏ విధంగా కసరత్తులు చేస్తున్నారో.. కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తూనే ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన వీడియో గ్లింప్స్‌తో.. ఇందులో రాక్షసులను భయపెట్టే యోధుడిగా యంగ్ టైగర్ కనిపించబోతున్నారనే విషయం తెలుస్తోంది. దర్శకుడు కొరటాలకు కూడా ఈ సినిమా ఎంతో కీలకం. అలాగే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్న సినిమా కావడంతో పాటు.. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ‘ఆర్ఆర్ఆర్’తో వచ్చిన క్రేజ్‌ని అందుకునే విధంగా.. ఈ సినిమా రూపుదిద్దుకుంటుందనే వార్తలు.. నందమూరి ఫ్యాన్స్‌కి యమా కిక్కిస్తున్నాయి. 2024 ఏప్రిల్ 5న ‘దేవర’ ఆగమనం ఉంటుందని ఆల్రెడీ ప్రకటించేశారు కూడా. అల్లు అర్జున్ ‘పుష్ప2’ కూడా అదే టైమ్‌లో ఒకటి లేదా రెండు వారాల గ్యాప్‌తో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందనేలా ప్రస్తుతం టాక్ నడుస్తుండటంతో.. సోషల్ మీడియాలో ‘పుష్పరాజ్’ వర్సెస్ ‘దేవర’.. ‘చూసుకుందాం’.. అనేలా ఇరు హీరోల ఫ్యాన్స్ ఆసక్తికరంగా చర్చలు కొనసాగిస్తున్నారు. (Allu Arjun vs Jr NTR)


ఇవి కూడా చదవండి:

**************************************

*Deviyani Sharma: ఈ ‘సైతాన్’ భామ చూపు మారింది

**************************************

*Aditi Shankar: ఆ బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌లో శంకర్ తనయ..

**************************************

*Sushanth: మెగాస్టార్‌తో ‘భోళా శంకర్’ సినిమాలో చేస్తున్నానని.. చినమామయ్యకి చెప్పా..

**************************************

*Skanda: శ్రీలీల చుట్టూ రామ్.. ఇద్దరూ ఇరగేశారు

**************************************

*Jailer Trailer: ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవ్.. కోతలే!

**************************************

Updated Date - 2023-08-04T12:42:04+05:30 IST