Aditi Shankar: ఆ బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌లో శంకర్ తనయ..

ABN , First Publish Date - 2023-08-03T23:22:47+05:30 IST

ప్రముఖ డైరెక్టర్‌ ఎస్‌.శంకర్‌ కుమార్తెగా సినిమాల్లోకి అడుగుపెట్టిన అదితి శంకర్‌ ఇపుడు తన టాలెంట్‌తో వెండితెరపై రాణిస్తూ వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. పైగా ఆమె ఇప్పటివరకు నటించిన అన్ని చిత్రాలు విజయవంతం కావడంతో దర్శక, నిర్మాతలు అవకాశాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆమె 7జి రెయిన్ బో కాలనీ సీక్వెల్‌లో అవకాశం పొందినట్లుగా వార్తలు వస్తున్నాయి.

Aditi Shankar: ఆ బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌లో శంకర్ తనయ..
Aditi Shankar

ప్రముఖ డైరెక్టర్‌ ఎస్‌.శంకర్‌ కుమార్తెగా సినిమాల్లోకి అడుగుపెట్టిన అదితి శంకర్‌ ఇపుడు తన టాలెంట్‌తో వెండితెరపై రాణిస్తూ వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. పైగా ఆమె ఇప్పటివరకు నటించిన అన్ని చిత్రాలు విజయవంతం కావడంతో దర్శక, నిర్మాతలు అవకాశాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో అవకాశాన్ని దక్కించుకున్నారు. గతంలో రవి కృష్ణ, సోనియా అగర్వాల్‌ జంటగా ‘7జి రెయిన్‌బో కాలనీ’ పేరుతో ఓ సినిమా వచ్చింది. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం సమకూర్చగా, ఏ.ఎం.రత్నం నిర్మించారు. తొలి భాగం రిలీజై రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఇపుడు ఈ చిత్రం రెండో భాగం రూపొందనుంది.


Aditi-Shankar.jpg

ఇందులో రవికృష్ణ హీరోగా, సోనియా అగర్వాల్‌ స్థానంలో అదితి శంకర్‌ను ఎంపిక చేసి ఈ ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన సెల్వరాఘవన్‌ ఈ రెండో భాగాన్ని కూడా డైరెక్ట్‌ చేయనున్నారు. ఇందుకోసం చర్చలు జరుగుతున్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన ‘7జి రెయిన్‌బో కాలనీ’ చిత్రం తెలుగులో ‘7జి బృందావన కాలనీ’ పేరుతో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తెరకెక్కబోయే చిత్రాన్ని కూడా రెండు భాషల్లో రూపొందించాలనేలా ప్లాన్ చేస్తున్నట్లుగా కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఈ సినిమా అప్పట్లో కుర్రకారు తెగ ఎక్కేసింది.. ఎగబడి మరీ చూశారు. ఇప్పుడు రాబోయే సీక్వెల్ ప్రకటన కూడా రాలేదు.. అప్పుడే ఈ సినిమాకు సంబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయంటే.. అందులో ఉన్న విషయం అలాంటిది మరి.


ఇవి కూడా చదవండి:

**************************************

*Sushanth: మెగాస్టార్‌తో ‘భోళా శంకర్’ సినిమాలో చేస్తున్నానని.. చినమామయ్యకి చెప్పా..

**************************************

*Skanda: శ్రీలీల చుట్టూ రామ్.. ఇద్దరూ ఇరగేశారు

**************************************

*Jailer Trailer: ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవ్.. కోతలే!

**************************************

*Poonam Kaur: పాలిటిక్స్, వినోదానికి లింక్ చేస్తూ ట్వీట్.. ‘బ్రో’ గురించేనా?

**************************************

*Malavika Mohanan: కఠిన నిర్ణయం తీసుకున్నా.. ఇకపై ప్రాధాన్యం ఉండాల్సిందే

**************************************

Updated Date - 2023-08-03T23:22:47+05:30 IST