Deviyani Sharma: ఈ ‘సైతాన్’ భామ చూపు మారింది

ABN , First Publish Date - 2023-08-04T11:06:01+05:30 IST

సౌత్‌ మూవీ బిగ్‌స్ర్కీన్‌కు పరిచయమైన కుర్రకారు హీరోయిన్లలో దేవియాని శర్మ ఒకరు. ఒకదాని తర్వాత ఒక చిత్రంలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ఇప్పుడామె చూపు కోలీవుడ్‌ వైపు మళ్లింది. తమిళ సినిమాలు చూడటమన్నా.. అందులో నటించడమన్నా తనకు ఎంతో ఇష్టమని ఆమె చెప్పుకొచ్చింది.

Deviyani Sharma: ఈ ‘సైతాన్’ భామ చూపు మారింది
Deviyani Sharma

సౌత్‌ మూవీ బిగ్‌స్ర్కీన్‌కు పరిచయమైన కుర్రకారు హీరోయిన్లలో దేవియాని శర్మ (Deviyani Sharma) ఒకరు. ఒకదాని తర్వాత ఒక చిత్రంలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ఇప్పుడామె చూపు కోలీవుడ్‌ వైపు మళ్లింది. ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ.. నవీన్‌చంద్ర నటించిన ‘భానుమతి రామకృష్ణ’ (Bhanumathi Ramakrishna)తో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ తర్వాత క్రమంగా వరుస అవకాశాలను దక్కించుకుంటున్నారు. హాట్‌స్టార్‌ ఓటీటీలో వచ్చిన ‘సైతాన్‌’ (Saithan), ‘సేవ్‌ ద టైగర్స్‌’ (Save The Tigers) వంటి విజయవంతమైన షోలలో ప్రధాన పాత్రల్లో కనిపించారు. అదేసమయంలో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తూ తన కెరీర్‌ను సాగిస్తున్నారు.


Deviyani-Sharma-1.jpg

మరోవైపు పెద్ద హీరోల చిత్రాల్లో అవకాశాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దేవియాని శర్మ ఒక డ్రామా ఆర్టిస్ట్‌. శ్రీరామ్‌ భారతీయ కళా కేంద్ర అకాడమీలో శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించారు. సినిమా రంగంలో రాణించేందుకు అవసరమైన అన్ని మెలకులను చేర్చుకున్నారు. అర్హతలు పొందారు. చిత్రపరిశ్రమలో కమర్షియల్‌ హీరోయిన్‌ కావాలన్నదే తన లక్ష్యం కాదంటున్నారు. బలమైన పాత్రలు, విభిన్నమైన క్యారెక్టర్స్‌లో నటించాలన్నదే తన కల అంటున్నారు. త్వరలోనే తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టనున్నట్టు తెలిపారు. (Deviyani Sharma about Kollywood)

Deviyani-Sharma-2.jpg

ఇదే విషయంపై ఆమె స్పందిస్తూ.. ‘తమిళ సినిమాలు చూడటం నాకు ఎంతో ఇష్టం. ఇక్కడ కళ, వాణిజ్య అంశాలకు సమ ప్రాధ్యానం ఉంటుంది. కోలీవుడ్‌లోని ప్రతి ఒక్కరినీ ఇష్టపడతాను. దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ సినిమాలో పనిచేయాలని ఉంది’ అని దేవయాని శర్మ అని తెలిపారు. ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్‌లతో పాటు.. రెండు సినిమాలకు ఓకే చెప్పినట్లుగా ఆమె చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Aditi Shankar: ఆ బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌లో శంకర్ తనయ..

**************************************

*Sushanth: మెగాస్టార్‌తో ‘భోళా శంకర్’ సినిమాలో చేస్తున్నానని.. చినమామయ్యకి చెప్పా..

**************************************

*Skanda: శ్రీలీల చుట్టూ రామ్.. ఇద్దరూ ఇరగేశారు

**************************************

*Jailer Trailer: ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవ్.. కోతలే!

**************************************

*Poonam Kaur: పాలిటిక్స్, వినోదానికి లింక్ చేస్తూ ట్వీట్.. ‘బ్రో’ గురించేనా?

**************************************

Updated Date - 2023-08-04T11:06:01+05:30 IST