Agent: ఓటీటీలో.. అందుకే విడుదల కాలేదా?

ABN , First Publish Date - 2023-05-30T22:21:46+05:30 IST

అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’. ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదలై.. బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమా విడుదలైన నెలరోజుల లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ అనేలా డేట్ ప్రకటించారు కానీ.. ఆ డేట్‌కి రాలేదు. అందుకు కారణం కొన్ని సీన్లు ఎడిట్ చేసి విడుదల చేయాలని దర్శకుడు భావిస్తున్నట్లుగా టాక్.

Agent: ఓటీటీలో.. అందుకే విడుదల కాలేదా?
Akhil Akkineni in Agent Movie

అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’ (Agent). ఈ సినిమా ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదలై.. బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూసింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనుకున్న ఈ సినిమా.. మొదటి రోజు మొదటి ఆటకే నెగిటివ్ టాక్‌కి గురికావడంతో.. మేకర్స్ ఆ సాహసం చేయలేదు. కేవలం వారం రోజులు కూడా థియేటర్లలో సందడి చేయలేకపోయిన ఈ చిత్రాన్ని.. నెల రోజులకు ముందే ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఓటీటీలో విడుదల తేదీని కూడా ప్రకటించారు. కానీ చెప్పిన డేట్‌కి.. ఈ సినిమా ఓటీటీలో విడుదల కాలేదు. అందుకు కారణం ఏమై ఉంటుందా అని అంతా అనుకుంటున్నారు.

అయితే అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ సినిమా ఓటీటీలోకి రాకపోవడానికి ఓ భారీ కారణమే ఉన్నట్లుగా కొన్ని గాసిప్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. మే 20వ తేదీన సోనీ లివ్‌ (SonyLIV)లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. సోనీ లివ్ ఓటీటీ సంస్థ స్ట్రీమింగ్‌కు అన్నీ రెడీ చేసుకుంటున్న టైమ్‌లో.. దర్శకుడు సురేందర్ రెడ్డి కలగజేసుకుని ఆపేసినట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. అంతకు ముందు ఈ సినిమా పరాజయానికి సారీ చెబుతూ.. అభిమానులకు, ప్రేక్షకులకు నిర్మాత, హీరో ఓ లేఖను విడుదల చేశారు. అందులో దర్శకుడి పేరు ఎక్కడా కనిపించలేదు. దీంతో ఈ సినిమా పరాజయానికి కారణం అంతా సురేందర్ రెడ్డి అనేలా టాక్ మొదలైంది.

AGENT.jpg

అందుకే.. ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేస్తే తనకు మరింత డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని భావించిన సురేందర్ రెడ్డి.. కొన్ని సీన్లు ఎడిట్ చేసి.. సరికొత్తగా ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయాలని భావించినందుకే.. ప్రకటించిన డేట్‌కి స్ట్రీమింగ్ కాలేదని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఈ రూమర్ మాత్రం బాగా వైరల్ అవుతోంది. అలాగే ఈ సినిమాని చాలా వరకు కథ అందించిన వక్కంతం వంశీనే డైరెక్ట్ చేశాడనేలా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సినిమాలో ఉన్న పనికిరాని సన్నివేశాలన్నింటిని తొలగించి.. అతి త్వరలోనే స్ట్రీమింగ్‌కు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా అయితే టాక్ నడుస్తోంది. ఇలాంటి చిత్రాలను వెంటనే ఓటీటీలోకి తెచ్చేస్తే.. మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది. గతంలో కూడా వెండితెరపై పరాజయం పాలైన చిత్రాలను ఓటీటీ ప్రేక్షకులు బాగా ఆదరించిన సందర్భాలు ఉన్నాయి. ‘ఏజెంట్’ కూడా ఆ జాబితాలోకి చేరేదనేలా కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా ఆలస్యం చేసే కొద్ది.. రైట్స్ కొనుక్కున్న ‘సోనీలివ్’కి కూడా భారీ నష్టం సంభవించే అవకాశం ఉందనేలా కూడా వినిపిస్తోంది. చూద్దాం.. ఎప్పటికీ ఈ ‘ఏజెంట్’ (Agent OTT Release) ఓటీటీలో కనిపిస్తాడో..!

ఇవి కూడా చదవండి:

************************************************

*Srikanth Addala: ‘అఖండ’ బ్యానర్‌లో శ్రీకాంత్ అడ్డాల సినిమా.. ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

*RRR: చరణ్, ఎన్టీఆర్ కాదు.. అసలు సిసలైన ‘RRR’ కాంబినేషన్ ఇదే.. వీడియో వైరల్

*Bholaa Shankar: ‘భోళా’ మానియా మొదలవ్వబోతోంది

*Allu Sirish: ‘టెడ్డీ’ కాదు.. ఆసక్తికర టైటిల్‌తో అల్లు శిరీష్ తదుపరి చిత్రం

*Shaitan: రెడ్ అలెర్ట్!.. బోల్డ్ అండ్ డిస్టర్బ్ చేసే కంటెంట్‌తో..

Updated Date - 2023-05-30T22:21:46+05:30 IST