Allu Sirish: ‘టెడ్డీ’ కాదు.. ఆసక్తికర టైటిల్‌తో అల్లు శిరీష్ తదుపరి చిత్రం

ABN , First Publish Date - 2023-05-30T17:44:56+05:30 IST

‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న అల్లు హీరో అల్లు శిరీష్ తన తదుపరి చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌‌ని విడుదల చేశారు. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్‌లో ఆయన తదుపరి చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘బడ్డీ’ అనే పేరును ఖరారు చేసి.. తాజాగా ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేశారు.

Allu Sirish: ‘టెడ్డీ’ కాదు.. ఆసక్తికర టైటిల్‌తో అల్లు శిరీష్ తదుపరి చిత్రం
Allu Sirish New Movie First Look

అల్లు శిరీష్ (Allu Sirish) తదుపరి చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) ‘బన్నీ’ (Bunny) సినిమాతో మంచి మాస్ హిట్‌ని అందుకున్నారు. ఇప్పుడాయన తమ్ముడు అల్లు శిరీష్ ‘బడ్డీ’ (Buddy)గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రొటీన్ చిత్రాలు కాకుండా.. కాస్త వైవిధ్యమైన పాత్రలలో నటించే హీరోలలో అల్లు శిరీష్ ఒకరు. రీసెంట్‌గా ఆయన నుంచి వచ్చిన ‘ఊర్వశివో రాక్షసివో’ (Urvasivo Rakshasivo) చిత్రం మంచి విజయాన్నే అందుకుంది. ఈ సినిమా తర్వాత అల్లు శిరీష్ చేస్తున్న చిత్రానికి ‘బడ్డీ’ అనే టైటిల్‌‌ని ఖరారు చేయడమే కాకుండా.. తాజాగా ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు.

టాప్ ప్రొడక్షన్ బ్యానర్ స్టూడియో గ్రీన్‌ (Studio Green)పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ (Buddy First Look) పోస్టర్ విషయానికి వస్తే.. అల్లు శిరీష్ తుపాకీతో కనిపిస్తుండగా, టెడ్డీ బేర్ అతని పక్కన ఫైటింగ్ పొజిషన్‌లో నిలబడి ఉంది. బడ్డీ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. అల్లు శిరీష్ తన బడ్డీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ లుక్ చూస్తుంటే.. ఇంతకు ముందు తమిళ హీరో ఆర్య నటించిన ‘టెడ్డీ’ (Teddy) సినిమా గుర్తుకు రాకమానదు. ఇది ఆ సినిమాకి సీక్వెలా? అనేలా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఉంది.

Allu.jpg

‘బడ్డీ’ చిత్రాన్ని నిర్మాత కెఇ జ్ఞానవేల్ రాజా (KE Gnanavel Raja) నిర్మిస్తున్నారు. గాయత్రి భరద్వాజ్ (Gayathri Bharadwaj), గోకుల్ (Gokul) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ (Sam Anton) దర్శకుడు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిజా సంగీతం అందించగా, రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు. ప్రస్తుతం విడుదలైన ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

************************************************

*Shaitan: రెడ్ అలెర్ట్!.. బోల్డ్ అండ్ డిస్టర్బ్ చేసే కంటెంట్‌తో..

*Adivi Sesh: అడివి శేష్ ట్వీట్‌కు అర్థం తెలియక బుర్రలు బద్దలు కొట్టుకుంటోన్న నెటిజన్లు

*Adipurush: ‘రామ్ సీతా రామ్’ పాట ఓకే కానీ.. చూస్తుంటే ఏదో తేడా కొడుతోంది

*Bro: పవన్-సాయితేజ్ ద్వయం పోస్టర్.. ఫ్యాన్స్‌కి ఈ భరోసా చాలు!

Updated Date - 2023-05-30T17:49:22+05:30 IST