Srikanth Addala: ‘అఖండ’ బ్యానర్‌లో శ్రీకాంత్ అడ్డాల సినిమా.. ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2023-05-30T20:36:09+05:30 IST

‘నారప్ప’ తర్వాత శ్రీకాంత్ అడ్డాల.. ‘అఖండ’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన ద్వారకా క్రియేషన్స్‌లో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను జూన్ 2వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రక్తం గుర్తులతో ఉన్న చేతిని చూపించారు.

Srikanth Addala: ‘అఖండ’ బ్యానర్‌లో శ్రీకాంత్ అడ్డాల సినిమా.. ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?
Srikanth Addala Film Update

‘కొత్త బంగారులోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి చిత్రాలతో దర్శకుడిగా తన మార్క్ ప్రదర్శించిన శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala).. సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu)తో చేసిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రంతో భారీ పరాజయాన్ని చవిచూశారు. ఆ తర్వాత ఆయన కొన్నాళ్లు కామ్‌గా ఉండిపోయారు. మళ్లీ ‘నారప్ప’ (Naarappa)తో కాస్త హడావుడి చేశారు కానీ.. ఆ సినిమా ఓటీటీలో విడుదల కావడంతో శ్రీకాంత్ అడ్డాలకు సరైన కమ్ బ్యాక్ ఫిల్మ్‌గా నిలవలేకపోయింది. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల ‘అఖండ’ (Akhanda) వంటి చిత్రాన్ని నిర్మించిన ‘ద్వారకా క్రియేషన్స్’ (Dwaraka Creations)లో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ని మేకర్స్ తాజాగా విడుదల చేశారు.

మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మిర్యాల రవీందర్ రెడ్డి (Miryala Ravinder Reddy) నిర్మిస్తోన్న చిత్ర ఫస్ట్ లుక్‌ని జూన్ 2వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. ఈ విషయం తెలుపుతూ ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ని వారు విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రక్తం గుర్తులతో ఉన్న చేతిని చూపించారు. ఇదొక మాస్ యాక్షన్ చిత్రమనే హింట్‌ని ఈ లుక్ తెలియజేస్తోంది. జూన్ 2న చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ రానుంది.

Srikanth-addala-and-MR.jpg

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ విషయానికి వస్తే.. నటసింహం బాలయ్యతో బోయపాటి (Boyapati) రూపొందించిన ‘అఖండ’ చిత్రం ఈ బ్యానర్ వేల్యూని మరింతగా పెంచింది. ఇప్పుడీ బ్యానర్ నుంచి రాబోతున్న ఈ ప్రాజెక్ట్స్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే శ్రీకాంత్ అడ్డాల న్యూ ఏజ్ సినిమాతో రాబోతున్నట్లుగా అర్థమవుతోంది. ఎందుకంటే.. ఈ సినిమా ఆయనకి ఎంతో కీలకం. రాబోయే టైటిల్, ఫస్ట్ లుక్‌తో ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది (Srikanth Addala Next Film Update).


ఇవి కూడా చదవండి:

************************************************

*RRR: చరణ్, ఎన్టీఆర్ కాదు.. అసలు సిసలైన ‘RRR’ కాంబినేషన్ ఇదే.. వీడియో వైరల్

*Bholaa Shankar: ‘భోళా’ మానియా మొదలవ్వబోతోంది

*Allu Sirish: ‘టెడ్డీ’ కాదు.. ఆసక్తికర టైటిల్‌తో అల్లు శిరీష్ తదుపరి చిత్రం

*Shaitan: రెడ్ అలెర్ట్!.. బోల్డ్ అండ్ డిస్టర్బ్ చేసే కంటెంట్‌తో..

*Adivi Sesh: అడివి శేష్ ట్వీట్‌కు అర్థం తెలియక బుర్రలు బద్దలు కొట్టుకుంటోన్న నెటిజన్లు

Updated Date - 2023-05-30T20:36:09+05:30 IST