Bholaa Shankar: ‘భోళా’ మానియా మొదలవ్వబోతోంది

ABN , First Publish Date - 2023-05-30T18:29:32+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి సంబంధించిన మాసివ్ అప్‌డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. అతి త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజికల్ జర్నీని ప్రారంభిస్తామని మేకర్స్ ఈ అప్‌డేట్‌లో తెలిపారు.

Bholaa Shankar: ‘భోళా’ మానియా మొదలవ్వబోతోంది
Mega Star Chiranjeevi in Bholaa Shankar

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్‌ (Meher Ramesh)ల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’ (Bholaa Shankar). రామబ్రహ్మం సుంకర (Ramabrahmam Sunkara) భారీ బడ్జెట్‌‌తో భారీ కాన్వాస్‌‌పై రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. మేకర్స్ ఇటీవల స్విట్జర్లాండ్‌‌లో చిరంజీవి, తమన్నా భాటియాపై ఓ పాట చిత్రీకరణను పూర్తి చేశారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మాసివ్ అప్‌డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్‌ను త్వరలోనే ప్రారంభించబోతున్నామని.. ముందుగా మ్యూజికల్ జర్నీ ప్రారంభిస్తామని మేకర్స్ తెలియజేశారు. దీనికి ‘భోళా మానియా త్వరలో ప్రారంభమవుతుంది’ అని మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. (Bholaa Shankar Update)

ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో చిరంజీవి స్టైలిష్ గెటప్‌‌లో రెండు చేతులను వెనుక జేబులో పెట్టుకొని చేసిన గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్‌ని చూడవచ్చు. ఇక్కడ డిఫరెంట్ గెటప్స్‌లో డ్యాన్సర్స్‌తో పండుగ వాతావరణం కనిపిస్తోంది. మహతి స్వర సాగర్ (Mahati Swara Sagar) ఈ చిత్రానికి చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌‌ని స్కోర్ చేసినట్లుగా మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కొంత టాకీ పార్ట్, క్లైమాక్స్ షూటింగ్, భారీ సెట్ సాంగ్ పెండింగ్‌‌లో ఉందని.. జూన్ నెలాఖరుకు సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని మేకర్స్ ఈ అప్‌డేట్‌లో వెల్లడించారు. అలాగే సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మరో వైపు శరవేగంగా జరుగుతున్నట్లుగా వారు తెలిపారు. (Bholaa Mania Starts Soon)

Chiranjeevi.jpg

అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ (AK Entertainments) బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా (Tamannaah) కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్ (Keerthy Suresh) ఆయనకు సిస్టర్‌గా కనిపించనుంది. టాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ (Sushanth) ఈ సినిమాలో లవర్ బాయ్ తరహా పాత్రలో కనిపించనున్నారు. ఇంకా భారీ తారాగణం ఈ చిత్రంలో భాగమవుతున్నారు. ఈ సినిమాని ఆగస్టు 11న (Bholaa Shankar Release Date) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌‌గా విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించి ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Allu Sirish: ‘టెడ్డీ’ కాదు.. ఆసక్తికర టైటిల్‌తో అల్లు శిరీష్ తదుపరి చిత్రం

*Shaitan: రెడ్ అలెర్ట్!.. బోల్డ్ అండ్ డిస్టర్బ్ చేసే కంటెంట్‌తో..

*Adivi Sesh: అడివి శేష్ ట్వీట్‌కు అర్థం తెలియక బుర్రలు బద్దలు కొట్టుకుంటోన్న నెటిజన్లు

*Adipurush: ‘రామ్ సీతా రామ్’ పాట ఓకే కానీ.. చూస్తుంటే ఏదో తేడా కొడుతోంది

*Bro: పవన్-సాయితేజ్ ద్వయం పోస్టర్.. ఫ్యాన్స్‌కి ఈ భరోసా చాలు!

Updated Date - 2023-05-30T18:29:32+05:30 IST