Shaitan: రెడ్ అలెర్ట్!.. బోల్డ్ అండ్ డిస్టర్బ్ చేసే కంటెంట్‌తో..

ABN , First Publish Date - 2023-05-30T15:53:55+05:30 IST

‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్‌తో సక్సెస్‌ను సొంతం చేసుకున్న ‘యాత్ర’ దర్శకుడు మహి వి రాఘవ్ ఈసారి క్రైమ్ వరల్డ్‌లోకి తీసుకెళ్లబోతున్నారు. ఆయన రూపొందించిన ‘సైతాన్’ వెబ్ సిరీస్ జూన్ 15 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందులో వెన్నులో వణుకు పుట్టించే విధంగా కొన్ని సీన్స్ ఉంటాయని.. చూసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని యూనిట్ హెచ్చరిస్తోంది.

Shaitan: రెడ్ అలెర్ట్!.. బోల్డ్ అండ్ డిస్టర్బ్ చేసే కంటెంట్‌తో..
Shaitan Movie Still

ఈ సినిమా చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు దర్శకుడు మహి వి రాఘవ్. ‘యాత్ర’ (Yatra) చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు పొందిన మహి వి రాఘవ్ (Mahi V Raghav).. ఇప్పుడు క్రైమ్‌లోకి దిగారు. ఆయన క్రియేట్ చేసిన ‘సైతాన్’ (Shaitan) సిరీస్‌తో డీప్‌గా క్రైమ్ వరల్డ్‌లోకి తీసుకువెళ్లబోతున్నారు. ఎంత డీప్‌గా అంటే.. ‘మీరు దాన్ని క్రైమ్ అని అంటే.. వాళ్ళు మనుగడ కోసం అని అంటున్నారు’.. ఈ లైన్ ఒక్కటి చాలు.. ఇందులో ఎంత వయలెన్స్ ఉందో చెప్పడానికి. అందుకే ఈ సినిమా చూసే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ముందే యూనిట్ హింట్ ఇస్తోంది. (Shaitan Web Series Update)

రిషి, షెల్లీ, దేవియాని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ‘సైతాన్’ సిరీస్‌ను వెన్నులో వణుకు పుట్టించే రివేంజ్ డ్రామాగా దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. సామాజిక రాజకీయ అంశాలతో ముడిపడి ఉండే కథ ‘సైతాన్’. బాలి (Baali) అనే వ్యక్తి ఫ్యామిలీ ఎలాంటి అలజడికి గురైంది.. ఆ తర్వాత ఆ ఫ్యామిలీ క్రైమ్ (Crime) మార్గాన్ని ఎందుకు ఎంచుకుంది? అనేది కథలో కీలకంగా ఉంటుంది. ఈ సిరీస్‌కు సంబంధించి విడుదల చేసిన పోస్టర్స్ చూస్తుంటే.. ఒక తెలుగు వెబ్ సిరీస్‌ (Telugu Web Series)లో క్రైమ్ సన్నివేశాలని ఈ తరహాలో ఇంత భయంకరంగా చూపించడం ఇదే తొలిసారి అని చెప్పక తప్పదు.

ఈ వెబ్ సిరీస్ మేకర్స్ కూడా వెన్నులో వణుకు పుట్టించే విధంగా కొన్ని సీన్స్ ఉంటాయని.. ఇందులో ఉండే వయలెన్స్.. బోల్డ్ కంటెంట్ చాలా డిస్టర్బ్ చేసే విధంగా ఉంటాయని అంటున్నారు. అందుకే ఈ వెబ్ సిరీస్‌ని తగిన జాగ్రత్తలతో చూడమని ముందే వారు హెచ్చరిస్తున్నారు. కాగా ఈ వెబ్ సిరీస్ 2023, జూన్ 15 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ (Disney Plus Hotstar)లో స్ట్రీమింగ్ కానుంది. రీసెంట్‌గా మహి వి రాఘవ్ రూపొందించి.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైన ‘సేవ్ ద టైగర్స్’ (Save The Tigers) సిరీస్ ఎటువంటి విజయాన్ని అందుకుందో తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

************************************************

*Adivi Sesh: అడివి శేష్ ట్వీట్‌కు అర్థం తెలియక బుర్రలు బద్దలు కొట్టుకుంటోన్న నెటిజన్లు

*Adipurush: ‘రామ్ సీతా రామ్’ పాట ఓకే కానీ.. చూస్తుంటే ఏదో తేడా కొడుతోంది

*Bro: పవన్-సాయితేజ్ ద్వయం పోస్టర్.. ఫ్యాన్స్‌కి ఈ భరోసా చాలు!

Updated Date - 2023-05-30T15:53:55+05:30 IST