RRR: చరణ్, ఎన్టీఆర్ కాదు.. అసలు సిసలైన ‘RRR’ కాంబినేషన్ ఇదే.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2023-05-30T19:24:43+05:30 IST

అసలు సిసలైన ‘ఆర్ఆర్ఆర్’ కాంబినేషన్ అంటే ఇదేనంటూ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తాజాగా తన ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ‘ఆర్’ లెటర్ పేరు గలిగిన రామానాయుడు, రాఘవేంద్రరావులతో కలిసి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు భోజనం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

RRR: చరణ్, ఎన్టీఆర్ కాదు.. అసలు సిసలైన ‘RRR’ కాంబినేషన్ ఇదే.. వీడియో వైరల్
Ram Charan, Rajamouli and Jr NTR

RRR.. అంటే దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన సినిమానే గుర్తొస్తుంది. అందులో నటించిన హీరోలు, ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా సాధించిన విజయం, కొల్లగొట్టిన అవార్డులు.. ఒక్కటేమిటీ ప్రతీది ఇప్పటికీ హాట్ టాపిక్కే. ఇప్పటికీ ‘ఆర్ఆర్ఆర్’ (RRR) మానియా నడుస్తుందంటే.. సినిమా ఇండస్ట్రీపై ఆ సినిమా ఎంత ఇంపాక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ అంటే రామ్ చరణ్ (Ram Charan), రామారావు (Jr NTR), రాజమౌళి (Rajamouli) కాదు.. అసలు సిసలైన ‘ఆర్ఆర్ఆర్’ కాంబినేషన్ అంటే ఇది అంటూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఓ వీడియోని తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

‘‘ఆ రోజుల్లోనే RRR కాంబినేషన్.. అరుదైన వీడియో... రామారావు గారు, రామానాయుడుగారితో మీ రాఘవేంద్ర రావు’’ అంటూ దర్శకేంద్రుడు షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మూవీ మొఘల్ రామానాయుడు (Ramanaidu), దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు (K Raghavendra Rao)లతో కలిసి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు (NT Ramarao) భోజనం చేస్తున్నారు. ‘R’ పేరు గలిగిన ఈ ముగ్గురు కలిసి ఉన్న ఈ రేర్ వీడియోని చూడగానే దర్శకేంద్రుడు సంతోషిస్తూ.. ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. అంతే కాదు, సోషల్ మీడియాకు ఆయన థ్యాంక్స్ కూడా చెప్పారు.

NTR.jpg

సోషల్ మీడియాకు ఆయన థ్యాంక్స్ చెప్పడానికి కారణం.. ఈ వీడియో ఆయనకు సోషల్ మీడియాలోనే లభించి ఉంటుంది. అందుకే అలా తన కృతజ్ఞతను తెలిపారు. ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్లు (Netizens) ఆనందం వ్యక్తం చేస్తూ.. ‘ది రియల్ ఆర్ఆర్ఆర్’ (The Real RRR) అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోని షేర్ చేసిన దర్శకేంద్రుడికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకు రీ ట్వీట్స్, లైక్స్ భారీ స్థాయిలో వస్తున్నాయి.


ఇవి కూడా చదవండి:

************************************************

*Bholaa Shankar: ‘భోళా’ మానియా మొదలవ్వబోతోంది

*Allu Sirish: ‘టెడ్డీ’ కాదు.. ఆసక్తికర టైటిల్‌తో అల్లు శిరీష్ తదుపరి చిత్రం

*Shaitan: రెడ్ అలెర్ట్!.. బోల్డ్ అండ్ డిస్టర్బ్ చేసే కంటెంట్‌తో..

*Adivi Sesh: అడివి శేష్ ట్వీట్‌కు అర్థం తెలియక బుర్రలు బద్దలు కొట్టుకుంటోన్న నెటిజన్లు

*Adipurush: ‘రామ్ సీతా రామ్’ పాట ఓకే కానీ.. చూస్తుంటే ఏదో తేడా కొడుతోంది

Updated Date - 2023-05-30T19:24:43+05:30 IST