Bholaa Shankar: వింటేజ్ లుక్‌లో మెగాస్టార్.. సోషల్ మీడియా షేక్

ABN , First Publish Date - 2023-05-01T13:29:12+05:30 IST

‘మే డే’ (May Day)ని పురస్కరించుకుని చిరంజీవి (Chiranjeevi) వింటేజ్ మాస్ లుక్‌లో కనిపించే మూడు కొత్త పోస్టర్‌లను..

Bholaa Shankar: వింటేజ్ లుక్‌లో మెగాస్టార్.. సోషల్ మీడియా షేక్
Megastar Chiranjeevi in Bholaa Shankar

రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) చిత్రంలోని ఆయన లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా అయిన విషయం తెలిసిందే. మరోసారి అలాంటి లుక్‌లోనే దర్శనమిచ్చి సోషల్ మీడియాని షేక్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన హీరోగా.. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ (Meher Ramesh) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’ (Bholaa Shankar). రామబ్రహ్మం సుంకర భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఇటీవల హైదరాబాద్‌లో హై-ఆక్టేన్ ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను పూర్తి చేశారు. దీనితో 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందీ చిత్రం. తాజాగా ‘మే డే’ (May Day)ని పురస్కరించుకుని చిరంజీవి (Chiranjeevi) వింటేజ్ మాస్ లుక్‌లో కనిపించే మూడు కొత్త పోస్టర్‌లను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

Mega-3.jpg

ఈ పోస్టర్లలో మెగాస్టార్ గ్రే కలర్ యూనిఫాంలో టాక్సీ డ్రైవర్‌గా కనిపిస్తున్నారు. టాక్సీని పక్కకు ఆపి.. టీ టైమ్‌ని ఆస్వాదిస్తూ కనిపించారు. ఛార్మింగ్ స్మైల్‌తో యంగ్ అండ్ డైనమిక్‌గా ఇందులో చిరు కనిపిస్తున్నారు. ‘మే డే’కి పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యేలా ఉన్న ఈ పిక్స్‌తో.. మెగా ఫ్యాన్స్‌లో కూడా ఊపు కనిపిస్తోంది. ఇంతకు ముందు వరకు ఈ సినిమాపై అంతగా ఫ్యాన్స్ దృష్టి పెట్టిన దాఖలాలు కనిపించలేదు. కానీ.. వింటేజ్ మాస్ లుక్‌ (Vintage Mass Look)లో మెగాస్టార్ కనిపించడంతో.. మళ్లీ ‘వాల్తేరు వీరయ్య’లా మెగాస్టార్ మ్యాజిక్ చేయబోతున్నారంటూ.. ఈ లుక్స్‌పై ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Mega-2.jpg

ఈ సినిమాకు సంబంధించి తదుపరి షెడ్యూల్ కోల్‌కత్తాలో ప్రారంభం కాబోతోంది. ఇందులో చిరంజీవి, కీర్తి సురేష్ (Keerthy Suresh), తమన్నా (Tamannaah), వెన్నెల కిషోర్ (Vennela Kishore) ఇతరులతో కూడిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు. (MegaStar Chiranjeevi Bholaa Shankar Shooting Update) ఆ తర్వాత చిరంజీవి, తమన్నాలపై ఓ పాటను చిత్రీకరించేందుకు యూనిట్ యూరప్ వెళ్లనున్నారు. మహతి స్వర సాగర్ రాకింగ్ నెంబర్‌ని స్కోర్ చేశారు. యూరప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొంత టాకీ పార్ట్, క్లైమాక్స్ షూట్, భారీ సెట్ సాంగ్ చిత్రీకరిస్తాం. దాంతో జూన్ నెలాఖరుకు సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని మేకర్స్ తెలిపారు.

Mega-1.jpg

క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ మరియు యాక్షన్‌ సమపాళ్లలో వుండనున్నాయని తెలుస్తుంది. ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Miss Shetty Mr Polishetty Teaser Talk: మీ టైమింగ్ ఎప్పుడూ ఇంతేనా?

*Director Teja: బాలీవుడ్ సినిమాని చంపింది.. టాలీవుడ్ సినిమాని చంపబోతోందీ అదే!

*Nani 30: ‘నాని 30’లో చిరు, బాలయ్య సినిమాల్లో చేసిన హీరోయిన్

*Bichagadu 2 Trailer Talk: మరో బ్లాక్‌బస్టర్.. ఆన్ ద వే!

*Ravanasura: రవితేజ.. చెప్పా పెట్టకుండా వచ్చేశాడేంటి?

*Trisha: అసలు ‘పొన్నియిన్ సెల్వన్’లో త్రిష ఏ రోల్ కోరిందో తెలుసా..?

Updated Date - 2023-05-01T13:30:44+05:30 IST