Ravanasura: రవితేజ.. చెప్పా పెట్టకుండా వచ్చేశాడేంటి?

ABN , First Publish Date - 2023-04-29T15:50:40+05:30 IST

రీసెంట్‌గా నాని ‘దసరా’ (Dasara) చిత్రం నాలుగు వారాలు కాకుండానే ఓటీటీలోకి వచ్చి ఆశ్చర్యపరిస్తే.. విడుదలై మూడు వారాలు కూడా ముగియకుండానే

Ravanasura: రవితేజ.. చెప్పా పెట్టకుండా వచ్చేశాడేంటి?
Ravanasura Poster

సినిమా ఇండస్ట్రీలో ఎంతగా నిర్మాతలు ప్రయత్నించినా.. ఓటీటీ హవాని ఎదుర్కొలేకపోతున్నారు. కాస్త పేరున్న హీరోల సినిమాలైతే 8 వారాల తర్వాత ఓటీటీ (OTT)లోకి రావాలనే రూల్‌ని ఎవరూ లెక్కచేయడం లేదు. సినిమా టాక్ కొద్దిగా తేడా వస్తే చాలు.. ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా వెంటనే ఓటీటీలో దర్శనమిస్తోంది. టాక్ తేడా అనే కాదు.. హిట్ టాక్ వచ్చిన సినిమాలు కూడా 4 వారాల లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ముందే ఈ డీల్ కుదుర్చుకుంటున్నారో.. లేదంటే థియేటర్లలో సినిమా స్పాన్ కేవలం వారం, రెండు వారాలే అని ఫిక్స్ అయిపోయారో తెలియదు కానీ.. నిర్మాతలు కూడా ఈ విషయంలో కామ్‌గానే వ్యవహరిస్తున్నారు. (Ravanasura Released in OTT)

వాస్తవానికి ఏ నిర్మాత అయినా నాలుగు డబ్బులు సంపాదించుకోవడానికే సినిమాలు చేస్తారు. థియేటర్లకి ప్రేక్షకులు రాకపోతే.. వాళ్లు మాత్రం ఏం చేస్తారు. ప్రేక్షకులు రాని, లేని థియేటర్లకు రెంట్, ఇతరత్రా ఖర్చులు భరించే బదులు.. ఓటీటీకి ఇచ్చిపడేస్తే, ఎంతో కొంత రికవరీ చేసుకోవచ్చు అనే ధోరణిలో నిర్మాతలు ఆలోచిస్తున్నారు. అందుకే 4 వారాలు కూడా కాకుండానే హిట్ అయినా, ఫ్లాప్ అయినా.. ఓటీటీకి సై అంటున్నారు. రీసెంట్‌గా నాని ‘దసరా’ (Dasara) చిత్రం నాలుగు వారాలు కాకుండానే ఓటీటీలోకి వచ్చి ఆశ్చర్యపరిస్తే.. విడుదలై మూడు వారాలు కూడా ముగియకుండానే రవితేజ (Ravi Teja) సినిమా ఓటీటీలో దర్శనమిచ్చి షాకిచ్చింది.

Ravanasura-Movie.jpg

మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వంలో వచ్చిన ‘రావణాసుర’ (Ravanasura) చిత్రం చడీచప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. అనుకున్నంతగా విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత విడుదలైన ‘శాకుంతలం’ (Shaakuntalam) చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయినా కూడా ‘రావణాసుర’కు కలెక్షన్స్ పెరగలేదు. దీంతో.. ఎటువంటి సమాచారం లేకుండానే.. అంటే చెప్పా పెట్టకుండానే ‘రావణాసుర’ ఓటీటీలోకి దిగిపోయాడు. మే 5 తేదీన ఓటీటీలో విడుదల అనేలా టాక్ వచ్చినప్పటికీ.. ఒక వారం ముందే.. అంటే ఏప్రిల్ 28నే ఈ చిత్రం ఓటీటీ‌లో సందడి చేయడం స్టార్ట్ చేసింది. అయితే.. థియేటర్లలో ఫెయిల్ అయిన ఈ చిత్రాన్ని.. ఓటీటీలో విడుదల చేసే ముందైనా మేకర్స్ కాస్త హడావుడి చేయాల్సింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చిన విషయం కూడా ఎవరికీ తెలియదు. అలా ఉంది ‘రావణాసుర’ పరిస్థితి. కాగా.. రవితేజ సరసన ఓ ఐదారుగురు హీరోయిన్లు నటించిన ఈ సినిమా ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

************************************************

*Trisha: అసలు ‘పొన్నియిన్ సెల్వన్’లో త్రిష ఏ రోల్ కోరిందో తెలుసా..?

*RRR Side Dancer: ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో సైడ్ డ్యాన్సర్‌గా చేసిన వ్యక్తి అరెస్ట్.. ఎందుకంటే?

Updated Date - 2023-04-29T15:50:40+05:30 IST