Bichagadu 2 Trailer Talk: మరో బ్లాక్‌బస్టర్.. ఆన్ ద వే!

ABN , First Publish Date - 2023-04-29T17:27:49+05:30 IST

ఫస్ట్ పార్ట్‌లో విజయ్ ఆంటోని ఒక్కడే రెండు భిన్నమైన నేపథ్యాల్లో కనిపిస్తే.. ఈ సారి ఇద్దరులా కనిపిస్తూ ఆడియన్స్‌లో ఓ క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. మొత్తంగా ఈ ట్రైలర్‌ మరో..

Bichagadu 2 Trailer Talk: మరో బ్లాక్‌బస్టర్.. ఆన్ ద వే!
Vijay Antony in Bichagadu 2 Movie

మల్టీ టాలెంటెడ్ నటులలో విజయ్ ఆంటోనీ (Vijay Antony) ఒకరు. ఆయన హీరోగా 2016లో వచ్చిన ‘బిచ్చగాడు’ (Bichagadu) సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మూవీతో తెలుగులోనూ ఆయన తిరుగులేని మార్కెట్‌ని సొంతం చేసుకున్నారు. ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించినప్పుడు తమిళ్‌తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సీక్వెల్‌కి సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన అప్‌డేట్స్ అన్నీ.. ఈ సినిమాపై క్రేజ్‌ని పెంచుతూనే ఉన్నాయి. ఆ క్రేజ్‌ని డబుల్ చేసేలా.. ఇప్పుడు మేకర్స్ ‘బిచ్చగాడు 2’ (Bichagadu 2) చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని వదిలారు. ఈ ట్రైలర్ చూస్తుంటే కంప్లీట్ కమర్షియల్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ఈ పార్ట్ కూడా తెరకెక్కినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా విజయ్ ఆంటోనీ యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫస్ట్ పార్ట్‌లో ఒక్కడే రెండు భిన్నమైన నేపథ్యాల్లో కనిపిస్తే.. ఈ సారి ఇద్దరులా కనిపిస్తూ ఆడియన్స్‌లో ఓ క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. మొత్తంగా ఈ ట్రైలర్‌ మరో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ఆన్ ద వే అనేలా.. ఆడియెన్స్‌ను మెప్పిస్తోంది. (Bichagadu 2 Trailer Talk)

Vijay-2.jpg

ట్రైలర్ విషయానికి వస్తే.. భారతదేశంలోనే 7వ అత్యంత సంపన్నుడైన విజయ్ గురుమూర్తిగా విజయ్ ఆంటోనీ కనిపిస్తున్నారు. అందుకు సంబంధించిన ఎస్టాబ్లిష్‌మెంట్ షాట్స్ అన్నీ హైరేంజ్‌లో ఉన్నాయి. ఓ రేంజ్‌లో పరిచయమైన విజయ్ తర్వాత విమాన ప్రమాదానికి గురవుతాడు. అందుకు కారణం యాంటీ బికిలీ అంటూ మళ్లీ విజయ్ ఆంటోనీనే పరిచయం చేయడం సినిమాపై అంచనాలను పెంచుతోంది. విజయ్ గురుమూర్తి మరణానికి సంబంధించిన సన్నివేశాలు.. యాంటీ బికిలీ ఎంట్రీ, కోర్ట్ డ్రామా ఇవన్నీ భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. దీంతో పాటు ఇద్దరు చిన్నారుల ఎపిసోడ్ ప్రేక్షకుల హృదయాలను మరోసారి కట్టిపడేసేలా ఈ సినిమా ఉండబోతుందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ సీక్వెల్ ట్రైలర్ చూస్తోంటే విజయ్ ఆంటోనీ మంచి కంటెంట్‌తోనే వస్తున్నట్లుగా అర్థమవుతోంది. (Bichagadu 2 Trailer Report)

Vijay-1.jpg

ఇంతకుముందు, సోషల్ మీడియాలో ‘యాంటీ-బికిలి’ (Anti-Bikili) అనే కొత్త పదాన్ని ఉపయోగించి 4 నిమిషాల టీజర్, థీమ్ సాంగ్‌ను విడుదల చేస్తూ సినిమా థీమ్‌ను మేకర్స్ తెలియజేశారు. ‘బికిలి’ అంటే పేదవారిని ఆర్థికంగా దోపిడీ చేసే అత్యాశపరుడు అని అర్థం. అయితే ‘బిచ్చగాడు2’లో విజయ్ ఆంటోని యాంటీ బికిలిగా కనిపించబోతున్నాడు. ఆయన సరసన కావ్యా థాపర్ (Kavya Thapar) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని మే 19‌న విడుదల చేయబోతున్నట్టు ట్రైలర్‌లో అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

************************************************

*Ravanasura: రవితేజ.. చెప్పా పెట్టకుండా వచ్చేశాడేంటి?

*Trisha: అసలు ‘పొన్నియిన్ సెల్వన్’లో త్రిష ఏ రోల్ కోరిందో తెలుసా..?

*RRR Side Dancer: ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో సైడ్ డ్యాన్సర్‌గా చేసిన వ్యక్తి అరెస్ట్.. ఎందుకంటే?

Updated Date - 2023-04-29T17:33:56+05:30 IST