Nani 30: ‘నాని 30’లో చిరు, బాలయ్య సినిమాల్లో చేసిన హీరోయిన్

ABN , First Publish Date - 2023-04-29T19:22:31+05:30 IST

నాని30 చిత్రంలో సంక్రాంతికి వచ్చిన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ (Chiranjeevi Waltair Veerayya), బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ (Balakrishna Veera Simha Reddy) చిత్రాలలో నటించిన

Nani 30: ‘నాని 30’లో చిరు, బాలయ్య సినిమాల్లో చేసిన హీరోయిన్
Nani 30 Movie Update

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) ల్యాండ్‌మార్క్ ఫిల్మ్‌గా రూపొందుతోన్న అతని 30వ (Nani30) చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం గోవాలో ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నూతన దర్శకుడు శౌర్యువ్‌ (Shouryuv) ఈ చిత్రానికి దర్శకుడు. ‘సీతా రామం’ (Sita Ramam) ఫేమ్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఈ చిత్రంలో కథానాయిక నటిస్తున్నట్లుగా చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడీ చిత్రంలో సంక్రాంతికి వచ్చిన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ (Chiranjeevi Waltair Veerayya), బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ (Balakrishna Veera Simha Reddy) చిత్రాలలో నటించిన శృతిహాసన్ (Shruti Haasan) ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా మేకర్స్ అధికారికంగా తెలియజేశారు.

‘ఈ యేడాది ఆరంభంలో బ్లాక్‌బస్టర్ అయిన చిత్రాలలో నటించిన శృతిహాసన్ శనివారం గోవాలో షూటింగ్‌ జరుపుకుంటున్న ‘Nani30’లో జాయిన్ అయింది. ఈ లెంతీ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరణజరుపుతున్నాము’ అని మేకర్స్ తెలియజేశారు (Nani 30 Shooting Update). శృతిహాసన్ కూడా ఈ సినిమాలో నటిస్తుండటంతో.. ఆమె పాత్ర ఎలా ఉంటుంది? ఇందులో కూడా ఆమెకు ఏమైనా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయా? అనేలా ఆమె అభిమానులు సోషల్ మీడియాలో చిత్రయూనిట్‌కు ప్రశ్నలు సంధిస్తున్నారు.

Shruti-Haasan.jpg

కాగా.. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ (Vyra Entertainments) పతాకంపై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తుండగా, కోటి పరుచూరి సిఒఒగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి సాను జాన్ వర్గీస్ ISC డీవోపీగా బాధ్యతలు నిర్వహిస్తుండగా.. హృదయం ఫేమ్‌ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. (Shruti Haasan in Nani 30 Movie)

ఇవి కూడా చదవండి:

************************************************

*Bichagadu 2 Trailer Talk: మరో బ్లాక్‌బస్టర్.. ఆన్ ద వే!

*Ravanasura: రవితేజ.. చెప్పా పెట్టకుండా వచ్చేశాడేంటి?

*Trisha: అసలు ‘పొన్నియిన్ సెల్వన్’లో త్రిష ఏ రోల్ కోరిందో తెలుసా..?

*RRR Side Dancer: ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో సైడ్ డ్యాన్సర్‌గా చేసిన వ్యక్తి అరెస్ట్.. ఎందుకంటే?

Updated Date - 2023-04-29T19:22:31+05:30 IST