Miss Shetty Mr Polishetty Teaser Talk: మీ టైమింగ్ ఎప్పుడూ ఇంతేనా?

ABN , First Publish Date - 2023-04-29T23:14:33+05:30 IST

అనుష్కతో పాటు.. తక్కువ సినిమాలతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న ‘జాతిరత్నం’ ఫేమ్ నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ టీజర్ ఎలా ఉందంటే..

Miss Shetty Mr Polishetty Teaser Talk: మీ టైమింగ్ ఎప్పుడూ ఇంతేనా?
Anushka Shetty In Miss Shetty Mr Polishetty

బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న స్వీటీ అనుష్క శెట్టి (Sweetie Anushka Shetty) నటించిన సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. అయితే.. ఆమెపై ఇటీవల అనేక రకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. పెళ్లి చేసుకుంటుందనేలా కూడా కొందరు వార్తలు సృష్టించారు. కానీ.. అనుష్క మాత్రం ఎప్పటిలానే మౌనమే సమాధానంగా ఉండిపోయింది తప్ప ఎక్కడా రియాక్ట్ కాలేదు. ఇక అనుష్కతో పాటు.. తక్కువ సినిమాలతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న ‘జాతిరత్నం’ ఫేమ్ నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) చిత్రానికి సంబంధించి ఇటీవలే కాస్త మూమెంట్ వచ్చింది. ఆ మూమెంట్‌ ఇంకాస్త పటిష్టం చేసేలా తాజాగా మేకర్స్ చిత్ర టీజర్‌ని వదిలారు. శనివారం హైదరాబాద్‌లోని శ్రీనిధి ఇంజనీరింగ్ విద్యార్థుల సమక్షంలో ఈ టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్, లిరికల్ సాంగ్ తరహాలోనే.. ఈ టీజర్‌ కూడా మంచి స్పందనను రాబట్టుకుంటోంది. (Miss Shetty Mr Polishetty Teaser)

టీజర్ విషయానికి వస్తే.. ఈ మూవీ ఒక చెఫ్, ఒక స్టాండప్ కమెడియన్ మధ్య సాగే కథగా ఆల్రెడీ చెప్పారు. టీజర్‌లో దాన్ని మరింత స్పష్టంగా.. అలాగే ఎంటర్‌టైనింగ్‌గా చూపించారు. రవళి పాత్రలో నటించిన అనుష్క ప్రొఫెషనల్ చెఫ్. పెళ్లంటే ఇష్టం ఉండదు. ఆ విషయంలో ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుంది. మరోవైపు పేరెంట్స్‌కు ఇష్టం లేకపోయినా స్టాండప్ కమెడియన్‌గా రాణించాలని ప్రయత్నించే మరో కుర్రాడు. ఈ ఇద్దరికీ అనుకోకుండా పరిచయమై ఆ పరిచయం స్నేహంగా మారుతుంది. మరి ఆ స్నేహం ఏ తీరాలకు చేరింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే అన్నట్టుగా ఉందీ టీజర్. అయితే ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ముఖ్యంగా అనుష్క.. నవీన్‌ను ఇంటర్వ్యూ చేస్తూ.. నీ స్ట్రెంత్ ఏంటీ అని అడుగుతుంది.. అందుకు నవీన్ ‘అవకాశం ఉన్నప్పుడల్లా కామెడీ చేస్తుంటా’ అని చెబుతాడు.. వీక్ నెస్ గురించి అడిగితే.. ‘సిట్యుయేషన్‌కు సంబంధం లేకుండా కామెడీ చేస్తుంటా’ అని చెప్పే డైలాగ్ ఫన్నీగా ఉంది. చివర్లో ‘నీ టైమింగ్ ఎప్పుడూ ఇంతేనా?’ అని అడిగితే ‘కామెడీ టైమింగ్ మాత్రం పర్ఫెక్ట్‌గా ఉంటుంది’ మేడమ్ అని చెబుతాడు. వీరిద్దరి మధ్య సంభాషణ, నవీన్ టైమింగ్ హైలెట్ అనేలా ఉండటమే కాకుండా.. సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. (Miss Shetty Mr Polishetty Teaser Talk)

ఈ టీజర్‌ని చూస్తుంటే.. సినిమాలో బోలెడంత కామెడీ ఎక్స్‌‌పెక్ట్ చేయవచ్చనేలా ఇన్ డైరెక్ట్‌గా చెప్పారనుకోవచ్చు. ఓవరాల్‌గా టీజర్ చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. ఖచ్చితంగా ఓ మంచి ఎంటర్టైనింగ్ మూవీని ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు అనేలా టీజర్‌తో తెలియజేశారు. అయితే ఈ టీజర్ విడుదల విషయంలోనే నెటిజన్లు అందరూ ‘మీ టైమింగ్ ఎప్పుడూ ఇంతేనా?’ అనేలా అనుకునే చేశారు. ఎప్పుడే 6 గంటలకు టీజర్ విడుదల అని చెప్పి.. దాదాపు రెండు గంటల వరకు నెటిజన్లను వెయిట్ చేయించారు. అయితే వెయిట్ చేయించినా.. ఓ కొత్త అనుభూతిని మాత్రం ఈ టీజర్‌తో కలిగించారని మాత్రం చెప్పుకోవచ్చు. యూవీ క్రియేషన్స్ (UV Creations) బ్యానర్‌పై తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి పి. మహేష్ కుమార్ (P Mahesh Kumar) దర్శకుడు.


ఇవి కూడా చదవండి:

************************************************

*Director Teja: బాలీవుడ్ సినిమాని చంపింది.. టాలీవుడ్ సినిమాని చంపబోతోందీ అదే!

*Nani 30: ‘నాని 30’లో చిరు, బాలయ్య సినిమాల్లో చేసిన హీరోయిన్

*Bichagadu 2 Trailer Talk: మరో బ్లాక్‌బస్టర్.. ఆన్ ద వే!

*Ravanasura: రవితేజ.. చెప్పా పెట్టకుండా వచ్చేశాడేంటి?

*Trisha: అసలు ‘పొన్నియిన్ సెల్వన్’లో త్రిష ఏ రోల్ కోరిందో తెలుసా..?

*RRR Side Dancer: ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో సైడ్ డ్యాన్సర్‌గా చేసిన వ్యక్తి అరెస్ట్.. ఎందుకంటే?

Updated Date - 2023-04-29T23:14:33+05:30 IST