Trisha: అసలు ‘పొన్నియిన్ సెల్వన్’లో త్రిష ఏ రోల్ కోరిందో తెలుసా..?

ABN , First Publish Date - 2023-04-29T13:54:17+05:30 IST

‘పొన్నియిన్ సెల్వన్’లో కుందవై (Kundavai)గా నటించిన అందాల రాశి త్రిషకు ఆ పాత్ర (కుందవై)లో నటించడం ఇష్టం లేదనేలా తాజాగా కోలీవుడ్ సర్కిల్స్‌లో

Trisha: అసలు ‘పొన్నియిన్ సెల్వన్’లో త్రిష ఏ రోల్ కోరిందో తెలుసా..?
Mani Ratnam and Trisha

తమిళ సంచలన దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ (Ponniyin Selvan) రెండు భాగాలుగా రూపుదిద్దుకుని.. గత సంవత్సరం ఒక భాగం.. తాజాగా మరో భాగం విడుదలైన విషయం తెలిసిందే. ‘బాహుబలి, కెజియఫ్’ (Bahubali and KGF) తరహాలోనే రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం.. ఆ సినిమాల మాదిరిగా అన్ని భాషల ప్రేక్షకులని అలరించడంలో సక్సెస్ కాలేకపోయింది. కేవలం కోలీవుడ్‌ (Kollywood)లో మాత్రమే మొదటి భాగం భారీగా కలెక్షన్స్‌ను రాబట్టింది. ఇప్పుడు విడుదలైన రెండో భాగం కూడా సక్సెస్‌ఫుల్ టాక్‌ని సొంతం చేసుకుని.. అక్కడ కనకవర్షం కురిపిస్తోంది. అయితే ఇతర భాషల్లో మాత్రం ఈ భాగానికి కూడా అంతంత మాత్రంగానే టాక్, కలెక్షన్స్ ఉండటం విశేషం. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai) రెండు రకాల పాత్రలలో కనిపించిన విషయం తెలిసిందే. ఆమెది ఇందులో నెగిటివ్ రోల్. మొదటి భాగంలో కంటే కూడా.. రెండో భాగంలో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉన్నట్లుగా తెలుస్తోంది.

Trisha-pic.jpg

అయితే ఈ సినిమాలో కుందవై (Kundavai)గా నటించిన అందాల రాశి త్రిషకు ఆ పాత్ర (కుందవై)లో నటించడం ఇష్టం లేదనేలా తాజాగా కోలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు మణిరత్నం ఈ కథ చెప్పినప్పుడు ఐశ్వర్యరాయ్ పోషించిన నందిని (Nandini) పాత్రను త్రిష కృష్ణన్ (Trisha Krishnan) కోరిందట. కానీ.. మణిరత్నం మాత్రం అందుకు అంగీకరించలేదట. ఆ పాత్రకి తన స్కూల్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌ని తీసుకున్నట్లుగా మణిరత్నం చెప్పడంతో.. తప్పక కుందవై పాత్రలో త్రిష నటించిందని అంటున్నారు. అయితే కుందవై పాత్రలో కూడా త్రిష చాలా చక్కగా ఒదిగిపోయింది. మొదటి భాగంలో.. అందంలో ఐశ్వర్యరాయ్ కంటే కూడా త్రిషకే ఎక్కువ మార్కులు పడ్డాయనేది తెలియని విషయం కాదు.

Aishwarya-Rai.jpg

త్రిషకి మొదటి నుంచి నెగిటివ్ రోల్స్ (Negative Role) అంటే పిచ్చి. ఆ విషయం.. తను హీరోయిన్‌గా చక్రం తిప్పే రోజులలో కూడా పలు ఇంటర్వ్యూలలో తెలిపింది. ధనుష్ (Dhanush) డబుల్ రోల్ చేసిన ఓ చిత్రంలో ఆమె నెగిటివ్ రోల్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాలోని నటనకుగానూ ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి. ఇప్పుడు కూడా ఛాన్స్ వస్తే నెగిటివ్ రోల్స్ చేయడానికి సిద్ధం అనేలా.. రీసెంట్‌గా కూడా త్రిష (Trisha) ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Read Also:

************************************************

*RRR Side Dancer: ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో సైడ్ డ్యాన్సర్‌గా చేసిన వ్యక్తి అరెస్ట్.. ఎందుకంటే?

Updated Date - 2023-04-29T13:54:17+05:30 IST