What The Fish: ఊహించని అవతార్‌లో వెన్నెల కిశోర్.. ఫస్ట్ లుక్ కేక!

ABN , First Publish Date - 2023-10-16T23:49:38+05:30 IST

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చాలా కాలం తర్వాత క్రేజీ ప్రాజెక్ట్ ‘వాట్ ది ఫిష్’తో కమ్ బ్యాక్ ఇస్తున్నారు. నూతన దర్శకుడు వరుణ్ కోరుకొండ దర్శకత్వంతో పాటు ఈ చిత్రానికి కథ , స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ‘మనం మనం బరంపురం’ అనేది సినిమా ట్యాగ్‌లైన్. తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న వెన్నెల కిశోర్ ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.

What The Fish: ఊహించని అవతార్‌లో వెన్నెల కిశోర్.. ఫస్ట్ లుక్ కేక!
Vennela Kishore in What the Fish

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ (Manchu Manoj) చాలా కాలం తర్వాత క్రేజీ ప్రాజెక్ట్ ‘వాట్ ది ఫిష్’ (What The Fish)తో కమ్ బ్యాక్ ఇస్తున్నారు. నూతన దర్శకుడు వరుణ్ కోరుకొండ (Varun Korukonda) దర్శకత్వంతో పాటు ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ‘మనం మనం బరంపురం’ అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఈ సినిమా హై ప్రొడక్షన్ వేల్యూస్, అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతోంది. పాన్-ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని 6ix సినిమాస్‌ విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్నారు. మనోజ్‌ని విభిన్న గెటప్‌లలో ప్రజెంట్ చేస్తూ ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్‌ గ్లింప్స్‌ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న వెన్నెల కిశోర్ (Vennela Kishore) ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సీరియస్ లుక్‌లో చేతిలో ఓ పెద్ద రంపంతో వెన్నెల కిశోర్ క్రేజీగా కనిపించారు. బ్యాగ్ గ్రౌండ్‌లో కరెన్సీ నోట్లు గాల్లో ఎగరడం కూడా గమనించవచ్చు. ఇందులో వెన్నెల కిశోర్ పాత్ర చాలా క్రేజీగా ఉంటుందని ఈ ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమా అడ్వెంచర్ షూటింగ్ టొరంటో నగరం, కెనడాలోని వివిధ ప్రదేశాలలో జరిగిందని, ఈ చిత్రం కోసం ప్రతిభావంతులైన నటీనటులు, టెక్నికల్ టీం పని చేస్తుందని మేకర్స్ తెలిపారు. (Vennela Kishore First Look in What The Fish)


Vennela-Kishroe-WTF.jpg

వివిధ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో మంచు మనోజ్ (Manchu Manoj) మళ్లీ తన ప్రతాపం చూపిస్తాడని ఆయన అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ని వదులుతామని మేకర్స్ తెలిపారు.


ఇవి కూడా చదవండి:

============================

*Akira Nandan: ‘టైగర్ నాగేశ్వరరావు’ ఈవెంట్‌లో ఈ పేరే హాట్ టాపిక్..

***********************************

*Mistake: ఓటీటీలో ‘మిస్టేక్’కు మెరుపులాంటి స్పందన..

***********************************

*Extra Ordinary Man: ‘ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్‌’లో యాంగ్రీమ్యాన్.. లుక్ చూశారా?

**********************************

*Milan: ‘విడాముయర్చి’ షూటింగ్‌లో విషాదం.. అజిత్‌ ఫేవరేట్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ మృతి

************************************

*Siddu Jonnalagadda: నీరజ కోన దర్శకత్వంలో సిద్దు హీరోగా.. సినిమా టైటిల్ తెలుసు కదా!

*************************************

Updated Date - 2023-10-16T23:53:07+05:30 IST