Akira Nandan: ‘టైగర్ నాగేశ్వరరావు’ ఈవెంట్‌లో ఈ పేరే హాట్ టాపిక్..

ABN , First Publish Date - 2023-10-16T22:09:47+05:30 IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. ఇప్పుడు రవితేజ హీరోగా నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వి. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. అకీరా నందన్‌ని హీరోగా పరిచయం చేయాలని రేణు దేశాయ్‌ని కోరారు.

Akira Nandan: ‘టైగర్ నాగేశ్వరరావు’ ఈవెంట్‌లో ఈ పేరే హాట్ టాపిక్..
Akira Nandan and Renu Desai

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai).. ఇప్పుడు రవితేజ హీరోగా నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి జరిగిన ఇంటర్వ్యూలలో రేణు దేశాయ్ తన కుమారుడు అకీరా నందన్ (Akira Nandan) గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇక తాజాగా జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో ప్రముఖ రచయిత వి. విజయేంద్ర ప్రసాద్.. అకీరా నందన్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రేణు దేశాయ్‌ని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడుతూ.. ‘మీరు సినిమాలకు దూరంగా ఉన్నారు కానీ.. మాకు దగ్గరగానే ఉన్నారు. మీ అబ్బాయి అకీరాని హీరోని చేయండి. ఆ సినిమాలో అకీరాకు తల్లిగా మీరే చేయాలి’ అంటూ విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఆ మాటలకు రేణు దేశాయ్ ఉప్పొంగిపోయింది. తన ఆనందాన్ని ఆయనకు నమస్కరిస్తూ తెలియజేసింది.

TNR.jpg

అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంతకు ముందు జరిగిన ఇంటర్వ్యూలో అకీరా నందన్ (Akira Nandan) ఎంట్రీ గురించి రేణు మాట్లాడిన తీరు చూస్తే.. ఇప్పుడప్పుడే అకీరా ఎంట్రీ ఉండకపోవచ్చని, అసలు అకీరా హీరోగా చేయడు అనేలా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అసలు రేణు దేశాయ్ ఏమందంటే.. ‘‘హీరోగా చేయాలనే ఆసక్తి అకీరాకి (AkiraNandan) ఈ క్షణం వరకూ లేదు. అకీరాది చాలా భిన్నమైన వ్యక్తిత్వం. పియానో నేర్చుకున్నాడు. అలాగే ఫిల్మ్ ప్రొడక్షన్ గురించి కూడా నేర్చుకున్నాడు. యోగా, మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ ఇవన్నీ నేర్చుకున్నాడు. తనకి రైటింగ్ ఇష్టం. ఒక స్క్రిప్ట్ కూడా రాశాడు. అయితే ఇప్పటి వరకు నటుడిని అవుతానని మాత్రం చెప్పలేదు. తను హీరో అవ్వాలని డిసైడ్ అయితే అందరికంటే ముందు నేనే ప్రకటిస్తా. కొడుకుని బిగ్ స్క్రీన్‌పై చూడాలని ప్రతి తల్లికి వుంటుంది. నాకు కూడా వుంది. అయితే హీరో కావాలని ముందు తనకి అనిపించాలి. తను చూడటానికి అందంగా ఉంటాడు. ఒక నటుడికి కావాల్సిన అన్ని క్వాలిటీస్ తనలో వున్నాయి. నేను ఒక నటిని. వాళ్ళ నాన్న, పెదనాన్న (Chiranjeevi) యాక్టర్స్. తను తెరపై ఎలా కనిపిస్తాడో చూడాలని తల్లిగా నాకూ వుంటుంది..’’ అని చెప్పుకొచ్చింది. ఆమె మాటలని బట్టి చూస్తే అకీరా నందన్ ఎంట్రీ ఏ విధంగా ఉండబోతోందో చెప్పడం కష్టమే. తన రచనలతో ఎనలేని కీర్తిని గడించిన వి. విజయేంద్రప్రసాద్ ఇలా పబ్లిగ్గా అడిగారు కాబట్టి.. ఇప్పుడు అకీరాలోనూ థింకింగ్ మొదలయ్యే అవకాశం అయితే లేకపోలేదు. ఏమో త్వరలోనే ఆ న్యూస్ కూడా రావచ్చేమో? చూడాలి.


VVP.jpg

ఇంకా ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రీ రిలీజ్ వేడుకలో వి. విజయేంద్ర ప్రసాద్ (V Vijayendra Prasad) మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్ చూశాను. ప్రతి ఫ్రేమ్ నన్ను ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళింది. నాగేశ్వరరావు చనిపోయాడు టైగర్ పుట్టాడు అనే మాట నన్ను చాలా కదిలించింది. దర్శకుడు వంశీకి కాల్ చేసి అభినందించాను. వంశీకి చాలా మంచి భవిష్యత్ వుంటుంది. రవితేజ గారికి ఒక విన్నపం. విక్రమార్కుడు సినిమాని హిందీ, తమిళం, కన్నడలో చేశారు. కానీ రవితేజ గారిని ఎవరూ మ్యాచ్ చేయలేదు. రవితేజ‌గారు కేవలం తెలుగు సినిమాకే పరిమితం కాకూడదు. భారతదేశ కీర్తి పతాకాలు ఎగరేయాలని కోరుకుంటున్నాను. అభిషేక్ అగర్వాల్‌కి ఇది బంగారు కాలం. వస్తున్నది దసరా. దుర్గమ్మ తల్లి ముందు ఎవరూ నిలబడలేరు. ఆ తల్లి వాహనం టైగర్ ముందు కూడా ఎవడూ నిలబడలేదు. దసరా మీదే.. అని అన్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Mistake: ఓటీటీలో ‘మిస్టేక్’కు మెరుపులాంటి స్పందన..

***********************************

*Extra Ordinary Man: ‘ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్‌’లో యాంగ్రీమ్యాన్.. లుక్ చూశారా?

**********************************

*Milan: ‘విడాముయర్చి’ షూటింగ్‌లో విషాదం.. అజిత్‌ ఫేవరేట్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ మృతి

************************************

*Siddu Jonnalagadda: నీరజ కోన దర్శకత్వంలో సిద్దు హీరోగా.. సినిమా టైటిల్ తెలుసు కదా!

*************************************

*Nayanthara: నయనతార గ్లామర్‌ షో.. ఇలా కనబడి చాలా కాలమే అవుతోంది

***********************************

Updated Date - 2023-10-16T22:09:47+05:30 IST