Mistake: ఓటీటీలో ‘మిస్టేక్’కు మెరుపులాంటి స్పందన..

ABN , First Publish Date - 2023-10-16T20:19:42+05:30 IST

‘రామ్ అసుర్‌’ త‌ర్వాత అభిన‌వ్ స‌ర్దార్ చేసిన సినిమా ‘మిస్టేక్‌’. ఆగస్ట్ 4న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందననే రాబట్టుకుంది. కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి (సన్నీ) దర్శకత్వంలో.. ASP మీడియా హౌస్ బ్యానర్‌పై రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఆహా ఓటీటీలోనూ మంచి స్పందనను రాబట్టుకుంటుండటంతో చిత్రబృందం సంతోషాన్ని వ్యక్తం చేసింది.

Mistake: ఓటీటీలో ‘మిస్టేక్’కు మెరుపులాంటి స్పందన..
Abhinav Sardhar in Mistake Movie

‘రామ్ అసుర్‌’ త‌ర్వాత అభిన‌వ్ స‌ర్దార్ (Abhinav Sardhar) చేసిన సినిమా ‘మిస్టేక్‌’ (Mistake). ఆగస్ట్ 4న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందననే రాబట్టుకుంది. థియేటర్లలో విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గానూ సినిమా మంచి ఫలితాలను సాధించినట్లుగా మేకర్స్ ఆ మధ్య చెప్పుకొచ్చారు. కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి (Bharrath komalapati) (సన్నీ) దర్శకత్వంలో.. ASP మీడియా హౌస్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోనూ సందడి చేస్తోంది. ఓటీటీలో ఈ చిత్రానికి వస్తున్న స్పందన చూసి చిత్రయూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేసింది.

‘ఆహా’ ఓటీటీ (Aha OTT)లో ‘మిస్టేక్’ చిత్రం విడుదలైంది. ఈ మూవీలోని విజువల్స్, డైలాగ్స్, కథ కథనాలు ఓటీటీ ఆడియెన్స్‌ను సైతం మెప్పిస్తున్నందుకు హ్యాపీ. అభినవ్ సర్దార్ నటనతో పాటు అజయ్ క‌తుర్‌వ‌ర్‌, సుజిత్, తేజ ఐనంపూడి, క‌రిష్మా కుమార్‌, తానియా క‌ల్రా, ప్రియా పాల్ నటన కూడా అందరినీ కట్టిపడేస్తోంది. థియేటర్లలోనే కాకుండా.. ఓటీటీలోనూ ఈ సినిమాకు ఇంత మంచి ఆదరణ లభిస్తుండటంతో చాలా సంతోషంగా ఉందని మేకర్స్ తెలిపారు.


Mistake.jpg

ఈ చిత్ర కథ విషయానికి వస్తే (Mistake Movie Story).. హెయిర్‌ స్టైలీస్ట్ ఆగస్త్య(అజయ్‌ కతుర్‌వర్‌), పూజారి మహదేవ్‌ శర్మ అలియాస్‌ దేవ్‌(సుజిత్‌ కుమార్‌), కార్తీక్‌(తేజ ఐనంపూడి) ముగ్గురు స్నేహితులు. ఈ ముగ్గురికీ లవర్స్‌ ఉంటారు. ఈ ముగ్గురికీ వేరు వేరు కారణాల వల్ల ప్రాణహాని ఉంటుంది. ఈ ముగ్గురు తమ లవర్స్‌తో ఓ ట్రిప్‌ ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో జరిగే నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఓ రౌడీ(అభినవ్‌ సర్దార్‌) వీరిపై అటాక్‌ చేస్తాడు? అతని నుంచి తప్పించుకోవడానికి ఈ మూడు జంటలు ఏం చేశాయి? ఇంతకీ.. ఆ రౌడీ వీరిపై ఎందుకు ఎటాక్ చేశాడు? చివరకు ఏం జరిగింది? అనేదే ఈ చిత్ర కథ. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా, విజువల్ ట్రీట్ ఇచ్చేలా తెరకెక్కిన ఈ ‘మిస్టేక్’ చిత్రం ఓటీటీ ప్రియులను ఆకర్షిస్తోంది.


ఇవి కూడా చదవండి:

============================

*Extra Ordinary Man: ‘ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్‌’లో యాంగ్రీమ్యాన్.. లుక్ చూశారా?

**********************************

*Milan: ‘విడాముయర్చి’ షూటింగ్‌లో విషాదం.. అజిత్‌ ఫేవరేట్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ మృతి

************************************

*Siddu Jonnalagadda: నీరజ కోన దర్శకత్వంలో సిద్దు హీరోగా.. సినిమా టైటిల్ తెలుసు కదా!

*************************************

*Nayanthara: నయనతార గ్లామర్‌ షో.. ఇలా కనబడి చాలా కాలమే అవుతోంది

***********************************

Updated Date - 2023-10-16T20:19:42+05:30 IST