Siddu Jonnalagadda: నీరజ కోన దర్శకత్వంలో సిద్దు హీరోగా.. సినిమా టైటిల్ తెలుసు కదా!

ABN , First Publish Date - 2023-10-16T15:34:30+05:30 IST

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా మరో సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా మారుతుందనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ వార్తలపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. సిద్దు, నీరజల కాంబినేషన్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్న చిత్రానికి ‘తెలుసు కదా’ అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ మూవీని అధికారికంగా ప్రకటించారు.

Siddu Jonnalagadda: నీరజ కోన దర్శకత్వంలో సిద్దు హీరోగా.. సినిమా టైటిల్ తెలుసు కదా!
Star Boy Siddu Jonnalagadda

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా మరో సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన (Neeraja Kona) దర్శకురాలిగా మారుతుందనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ వార్తలపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. నీరజ కోన మెగా ఫోన్ పట్టబోతోంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా ఆమె ఓ మూవీని డైరెక్ట్ చేయబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌తో పాటు చిత్ర టైటిల్‌ను కూడా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) అధికారికంగా ప్రకటించింది.

వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌లో సమంత (Samantha) హీరోయిన్‌గా చేస్తుందనేలా ఇప్పటి వరకు వార్తలు వినిపించాయి. కానీ సమంత తన అనారోగ్యం కారణంగా కొంతకాలం పాటు షూటింగ్స్‌కు విరామం ఇచ్చింది. దీంతో సిద్దు జొన్నలగడ్డ సరసన ఈ సినిమాలో రాశీ ఖన్నా (Raashi Khanna), శ్రీనిధి శెట్టి (కెజియఫ్ ఫేమ్) (Srinidhi Shetty) హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శక, నిర్మాతలకు ఇది చాలా ప్రత్యేకమైన సినిమా కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇది 30వ చిత్రం కానుంది. భారీ బడ్జెట్‌తో టిజి విశ్వప్రసాద్‌ (TG Vishwa Prasad) నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ చిత్రానికి ‘తెలుసు కదా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.


Siddhu-Jonnalagadda.jpg

ఈ చిత్రం పూర్తి విందు భోజనం అందించబోతుందని అనౌన్స్‌మెంట్ వీడియో సూచిస్తోంది. విజువల్స్ గ్రాండ్‌గా వున్నాయి, టాప్ క్లాస్ ప్రొడక్షన్, సాంకేతిక ప్రమాణాలతో అనౌన్స్‌మెంట్ కాన్సెప్ట్ యూనిక్‌గా వుంది. సోల్‌ఫుల్ లవ్ స్టోరీగా రూపొందనున్న ఈ సినిమా సిద్దుని కొత్త అవతార్‌లో ప్రెజెంట్ చేస్తుంది. ఇందులో అందమైన భావోద్వేగాలతో పాటు సోషల్ ఎలిమెంట్స్, రిలేషన్స్ వుంటాయి. ఒక అబ్బాయి, అమ్మాయి కథతో పాటు స్నేహం, కుటుంబం, త్యాగం, సెల్ఫ్ లవ్‌కి సంబధించిన కథ ఇదని మేకర్స్ చెబుతున్నారు. స్టార్ కంపోజర్ థమన్ ఎస్ (S Thaman) సంగీతం అందిస్తుండగా, ప్రముఖ డీవోపీ యువరాజ్ జె ఛాయాగ్రహణం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి అర్చనరావు కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. రిఫ్రెష్ కథాంశంతో, టాప్ క్లాస్ సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కబోతోన్న ఈ చిత్ర షూటింగ్‌ని త్వరలోనే మేకర్స్ ప్రారంభించనున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Nayanthara: నయనతార గ్లామర్‌ షో.. ఇలా కనబడి చాలా కాలమే అవుతోంది

***********************************

*Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా రీ రిలీజ్‌కు రెడీ.. విడుదల ఎప్పుడంటే?

**************************************

*Joju George: ‘ఇరట్ట’ హీరో జోజు జార్జి నటించిన ‘పులిమేద’ ట్రైలర్ విడుదల.. మూవీ విడుదల తేదీ ఫిక్స్

**********************************

*Leo: ‘లియో’ ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో టిక్కెట్‌ ధర రూ.5 వేలా?

***********************************

*Salaar Vs Dunki: రెబల్‌ స్టార్‌తో పోటీకి తగ్గేదే లే అంటోన్న బాద్‌షా..

**********************************

*Salman Khan: ఆయుధం లేకుండానే.. ‘టైగర్’ వారి అంతు చూస్తాడు

***********************************

Updated Date - 2023-10-16T15:34:30+05:30 IST