Milan: ‘విడాముయర్చి’ షూటింగ్‌లో విషాదం.. అజిత్‌ ఫేవరేట్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ మృతి

ABN , First Publish Date - 2023-10-16T16:42:35+05:30 IST

కోలీవుడ్‌లో మరో విషాదకర ఘటన జరిగింది. అగ్రహీరో అజిత్‌ ఫేవరేట్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ మిలన్‌ (54) గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. అజిత్‌ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘విడాముయర్చి’ చిత్రానికి ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మిలన్‌.. ఈ సినిమా షూటింగ్‌ నిమిత్తం అజర్‌బైజాన్‌లో ఉన్నారు. అక్కడ ఆయన గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు.

Milan: ‘విడాముయర్చి’ షూటింగ్‌లో విషాదం.. అజిత్‌ ఫేవరేట్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ మృతి
Ajith Kumar and Art Director Milan

కోలీవుడ్‌ (Kollywood)లో మరో విషాదకర ఘటన జరిగింది. అగ్రహీరో అజిత్‌ (Ajith Kumar) ఫేవరేట్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ మిలన్‌ (54) (Milan) గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. అజిత్‌ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘విడాముయర్చి’ (Vidaamuyarchi) చిత్రానికి ఆర్ట్‌ డైరెక్టర్‌ (Art Director)గా పనిచేస్తున్న మిలన్‌.. ఈ సినిమా షూటింగ్‌ నిమిత్తం అజర్‌బైజాన్‌లో ఉన్నారు. అక్కడ ఆయన గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. ఆదివారం వేకువజామున గుండెల్లో నొప్పిగా ఉందని తన సహచరులతో చెప్పడంతో ఆయనను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే ఆయన కన్నుమూశారు. ఆయన మృతిపై తమిళ చిత్రపరిశ్రమ (Kollywood)కు చెందిన పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు.


2006లో వచ్చిన ‘గలాబా కాదలన్‌’ చిత్రం ద్వారా ఆర్ట్‌ డైరెక్టరుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మిలన్‌... ఆ తర్వాత అజిత్‌ హీరోగా వచ్చిన ‘వేలాయుధం’, ‘వీరమ్‌’, రజినీకాంత్‌ నటించిన ‘అన్నాత్త’ వంటి అనేక చిత్రాలకు కళా దర్శకుడిగా పనిచేశారు. ప్రస్తుతం అజిత్‌ హీరోగా మగిళ్‌ తిరుమేని (Magizh Thirumeni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విడాముయర్చి’ (Vidaamuyarchi Movie) చిత్రానికి కూడా ఆయన పనిచేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ‘విడాముయర్చి’ అప్‌డేట్ కావాలంటూ అజిత్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా హడావుడి చేస్తున్న సమయంలో.. ఇలాంటి విషాదకర వార్త వినాల్సి రావడం బాధాకరం.


ఇవి కూడా చదవండి:

============================

*Siddu Jonnalagadda: నీరజ కోన దర్శకత్వంలో సిద్దు హీరోగా.. సినిమా టైటిల్ తెలుసు కదా!

*************************************

*Nayanthara: నయనతార గ్లామర్‌ షో.. ఇలా కనబడి చాలా కాలమే అవుతోంది

***********************************

*Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా రీ రిలీజ్‌కు రెడీ.. విడుదల ఎప్పుడంటే?

**************************************

*Joju George: ‘ఇరట్ట’ హీరో జోజు జార్జి నటించిన ‘పులిమేద’ ట్రైలర్ విడుదల.. మూవీ విడుదల తేదీ ఫిక్స్

**********************************

*Leo: ‘లియో’ ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో టిక్కెట్‌ ధర రూ.5 వేలా?

***********************************

Updated Date - 2023-10-16T16:50:23+05:30 IST