Extra Ordinary Man: ‘ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్‌’లో యాంగ్రీమ్యాన్.. లుక్ చూశారా?

ABN , First Publish Date - 2023-10-16T18:18:53+05:30 IST

టాలెంటెడ్ యాక్ట‌ర్ నితిన్, బ్యూటీ డాల్ శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మేన్‌’. రైట‌ర్ - డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 8న ఈ సినిమాలో యాంగ్రీమ్యాన్ రాజశేఖర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన తాజాగా షూట్‌లో జాయిన్ అయినట్లుగా మేకర్స్ ఓ వీడియో వదిలారు.

Extra Ordinary Man: ‘ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్‌’లో యాంగ్రీమ్యాన్.. లుక్ చూశారా?
Rajasekhar in Nithiin Extra Ordinary Man FILM

టాలెంటెడ్ యాక్ట‌ర్ నితిన్ (Nithiin), బ్యూటీ డాల్ శ్రీలీల (Sreeleela) హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మేన్‌’ (Extra Ordinary Man). రైట‌ర్ - డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 8న ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ మూవీ షూట్‌లోకి యాంగ్రీమ్యాన్ రాజశేఖర్ (Angry Man Rajasekhar) జాయిన్ అయినట్లుగా మేకర్స్ ఓ వీడియోను అధికారికంగా విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో రాజశేఖర్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు. విడుదల చేసిన వీడియోలో కూడా అదే తెలుస్తోంది. ఆయన పాత్ర ఏంటి? ఎలా ఉండబోతుందనేది క్లారిటీ లేదు కానీ.. ఈ వీడియో చూస్తుంటే మాత్రం.. వక్కంతం వంశీ (Vakkantham Vamsi) ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లుగా అయితే తెలుస్తోంది. మ్యూజికల్ జీనియస్ హారిస్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. (Rajasekhar in Nithiin Extra Ordinary Man)


rajasekhar.jpg

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడులైన ‘డేంజర్ పిల్లా..’ సాంగ్‌, నితిన్ లుక్స్‌ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. నితిన్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి పాత్ర‌లో ఆకట్టుకోబోతున్నార‌ని, క‌చ్చితంగా ఆయ‌న అభిమానుల‌నే కాదు, ప్రేక్ష‌కుల‌ను కూడా నితిన్ త‌న బ్రిలియంట్ పెర్ఫామెన్స్‌తో మెప్పించ‌నున్నారని మేకర్స్ చెబుతున్నారు. క్యారెక్ట‌ర్ బేస్డ్ స్క్రిప్ట్‌తో.. ‘కిక్’ (Kick) త‌ర్వాత ఆ రేంజ్ జోన్‌లో ఈ సినిమా తెర‌కెక్కుతోందని.. ఆడియెన్స్‌కి రోల‌ర్ కోస్ట‌ర్‌లాంటి ఎక్స్‌పీరియెన్స్‌నిస్తూ.. న‌వ్విస్తూనే స‌ర్‌ప్రైజ్‌ల‌తో సినిమా మెప్పించ‌నుందని డైరెక్టర్ వక్కంతం వంశీ అన్నారు. శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య‌మూవీస్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్లపై సుధాక‌ర్ రెడ్డి (Sudhakar Reddy), నికితా రెడ్డి (Nikitha Reddy) ఈ మూవీని నిర్మిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Milan: ‘విడాముయర్చి’ షూటింగ్‌లో విషాదం.. అజిత్‌ ఫేవరేట్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ మృతి

************************************

*Siddu Jonnalagadda: నీరజ కోన దర్శకత్వంలో సిద్దు హీరోగా.. సినిమా టైటిల్ తెలుసు కదా!

*************************************

*Nayanthara: నయనతార గ్లామర్‌ షో.. ఇలా కనబడి చాలా కాలమే అవుతోంది

***********************************

*Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా రీ రిలీజ్‌కు రెడీ.. విడుదల ఎప్పుడంటే?

**************************************

Updated Date - 2023-10-16T18:18:53+05:30 IST