Radhika Apte: నన్ను ఆ సర్జరీ చేయించుకోమన్నారు.. ఇప్పుడలా అంటేనా?

ABN , First Publish Date - 2023-04-15T13:20:24+05:30 IST

బిగ్ బ్రెస్ట్, స్మార్ట్ నోస్ కోసం సర్జరీ చేయించుకోమన్నారు. ‘బద్లాపూర్‌’ సినిమాలో నటించేంత వరకు నేను గ్రామీణ యువతిగానే ఉంటానని భావించారు. ఆ తర్వాత కేవలం శృంగార పాత్రలకే

Radhika Apte: నన్ను ఆ సర్జరీ చేయించుకోమన్నారు.. ఇప్పుడలా అంటేనా?
Heroine Radhika Apte

పలువురు పురుషులు మహిళలను హేళన చేయడం వారి జన్మహక్కుగా భావిస్తున్నారని బాలీవుడ్‌ నటి రాధికా ఆప్టే (Radhika Apte) అన్నారు. ఈమె సౌత్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. రజనీకాంత్‌ - పా.రంజిత్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘కబాలి’ (Kabali), బాలయ్య-బోయపాటి ‘లెజెండ్’ (Legend) వంటి చిత్రాలలో ఆమె నటించారు. కొంతకాలంగా ఆమె సౌత్‌లో కనిపించడం లేదు. కారణం.. సినిమాల కంటే వెబ్‌ సిరీస్‌లలో నటించేందుకు అధిక అసక్తి చూపడమే. ఆమె నటించిన ‘మిసెస్ అండర్ కవర్’ (Mrs Undercover) చిత్రం ‘జీ5’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు గతంలో ఎదురైన సంఘటనలను ఆమె వివరించారు.

Also Read-Vidudala Part 1 film review: 'విడుదల'లో విషయం వుంది, చూడాల్సిన సినిమా

‘‘సమాజంలోని వ్యక్తుల భావాలు వింతగా ఉంటాయి. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పలువురు ఫిల్మ్ మేకర్స్ నా రూపాన్ని మార్చుకోమని సూచించారు. బిగ్ బ్రెస్ట్, స్మార్ట్ నోస్ కోసం సర్జరీ చేయించుకోమన్నారు. ‘బద్లాపూర్‌’ సినిమాలో నటించేంత వరకు నేను గ్రామీణ యువతిగానే ఉంటానని భావించారు. ఆ తర్వాత కేవలం శృంగార పాత్రలకే పరిమితమని అనుకున్నారు. అయితే ఇపుడు వక్షోజ సైజులపై ప్రతి ఒక్కరిలోనూ అవగాహన పెరిగింది. అప్పట్లో మూడు, నాలుగు కేజీల బరువు అధికంగా ఉండటం కారణంగా.. కొన్ని సినిమా అవకాశాలు కోల్పోయాను. ఇవన్నీ చూస్తే... కొందరు పురుషులు... ఆడవారిని ఎగతాళి చేయడం తమ హక్కుగా భావిస్తున్నారని అనిపిస్తుంటుంది. అప్పట్లో అవగాహన లేమి కారణంగా నేను మాట్లాడలేకపోయా. కానీ ఇప్పుడెవరైనా అలా చెబితే మాత్రం.. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా తప్పుకుంటాను..’’ అని రాధికా ఆప్టే అన్నారు. (Radhika Apte Interview)

Radhika.jpg

ఇదే ఇంటర్వ్యూలో ఎందుకు తన స్పీడ్ తగ్గిందనే విషయంపై స్పందిస్తూ.. ‘‘సినిమా రంగంలో పాపులారిటీ, రెమ్యూనరేషన్ కోసం మహిళలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇది అందరూ స్వాగతించాలి. హీరో, హీరోయిన్ల క్రేజ్ ఆధారంగానే రెమ్యూనరేషన్ అనేది ఫిక్సవుతుంది. ప్రస్తుతం నాకు లేడీ ఓరియెంటెడ్ (Lady Oriented Films) సినిమాల్లో అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. అందుకే కాస్త స్పీడ్ తగ్గింది. నటనకు ఆస్కారమున్న పాత్రలను ఎంచుకుంటూ ముందుక వెళుతున్నాను. త్వరలోనే మళ్లీ అన్ని రకాల సినిమాలలో కనిపిస్తాను..’’ అని రాధికా ఆప్టే (Heroine Radhika Apte Interview) చెప్పుకొచ్చింది. అయితే బయట మాత్రం ఆమె సినిమాకు 4 నుంచి 5 కోట్లు డిమాండ్ చేస్తుండటం వల్లే.. రాధికకు అవకాశాలు రావడం లేదనేలా టాక్ నడుస్తుంది. మొత్తంగా అయితే.. హీరోయిన్ల హృదయ ఆకారంపై ఆమె చేసిన కామెంట్స్ మాత్రం ప్రస్తుతం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారాయి.

ఇవి కూడా చదవండి:

*********************************

*Allu Arha: ‘రుద్రమదేవి’కి అల్లు అర్జున్.. ‘శాకుంతలం’కి అల్లు అర్హ

*Alia Bhatt- Ranbir Kapoor: ఏప్రిల్ 14, హ్యాపీ డే.. ఆలియా పోస్ట్ వైరల్

*Namitha: అది మన సంస్కృతి కాదు. మనకంటూ ఒక సంస్కృతి ఉంది

*Vijay Deverakonda: ‘శాకుంతలం’ విడుదల వేళ.. సమంతకు విజయ్ బూస్ట్

*KGF Actress: ‘కెజియఫ్‌’లో వణికించిన నటి.. ఇప్పుడు హాస్పిటల్‌లో ఉంది

*Shocking: యాంకర్ సుమ అరెస్ట్.. ఎందుకంటే?

Updated Date - 2023-04-15T13:20:26+05:30 IST