Tammreddy Bharadwaja: మీ ఫ్యామిలీస్‌‌ని తిట్టినప్పుడు.. ఏమైంది మీ మగతనం? ఇండస్ట్రీ హీరోలకి సూటి ప్రశ్న?

ABN , First Publish Date - 2023-04-15T18:15:45+05:30 IST

తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ మరోసారి తెలుగు సినిమా ఇండస్ట్రీలోని స్టార్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచి చెప్పినా కూడా.. తనని తప్పుగా అర్థం చేసుకునే వారందరినీ ఒక్కటే అడుగుతున్నానంటూ..

Tammreddy Bharadwaja: మీ ఫ్యామిలీస్‌‌ని తిట్టినప్పుడు.. ఏమైంది మీ మగతనం? ఇండస్ట్రీ హీరోలకి సూటి ప్రశ్న?
Tammreddy Bharadwaja

దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammreddy Bharadwaja) ఈ మధ్య ఏం మాట్లాడినా అది కాంట్రవర్సీనే అవుతుంది. ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’ (RRR) ఆస్కార్ అవార్డు (Oscar Award) నిమిత్తం రూ. 80 కోట్లు ఖర్చు అయిందనే దానిపై ఆయన క్యాజువల్‌గా అన్న మాటను తీసుకుని అంతా వైరల్ చేశారు. ఆస్కార్ అవార్డు వస్తుంటే.. ఓర్వలేక ఆయన అలా కామెంట్స్ చేశారంటూ కొందరూ ఆరోపణలు చేశారు. అలాంటి వారందరికీ తమ్మారెడ్డి గట్టిగానే కౌంటర్ వేశారు. తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ మరోసారి తెలుగు సినిమా ఇండస్ట్రీలోని స్టార్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచి చెప్పినా కూడా.. తనని తప్పుగా అర్థం చేసుకునే వారందరినీ ఒక్కటే అడుగుతున్నానంటూ.. (Tammreddy Bharadwaja Comments)

Read Also- Rudrudu film review: రాఘవ లారెన్స్ సినిమా ఎలా ఉందంటే...

‘‘ఆ మధ్య ఎంపీనో, ఎమ్మెల్యేనో.. సినిమా వాళ్ల ఫ్యామిలీస్‌లోని (Celebrities Families) ఆడవాళ్లందరూ చెడిపోయినోళ్లు అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ప్రెస్ మీట్‌లో నేను దీనిపై మాట్లాడుతున్నాను. నేనొక్కడినే ఈ విషయంపై సీరియస్‌గా మాట్లాడతా. మరి ఈ మగాళ్లంతా ఏమి పీ* తున్నారు. ఒక్కడు కూడా మాట్లాడలేకపోయారుగా. మొన్న నేనేదో ఆర్ఆర్ఆర్ గురించి అన్నాను అని ఓ.. మగాళ్లంతా పోగేసుకుని వచ్చారుగా. అప్పుడేమయ్యారు. వాళ్ల పెళ్లాల గురించే కదా మాట్లాడింది. వాళ్ల కూతుళ్లు, తల్లుల గురించే కదా మాట్లాడింది. అప్పుడది పొలిటికల్ పార్టీ కాబట్టి వీరంతా భయపడ్డారా?

Reddy.jpg

ఈ మధ్య కాలంలో ఇంకో ఎమ్మెల్యే (MLA) అంటాడు.. సినిమా వాళ్లంతా ఆస్తులు దోచుకున్నారు అని. అప్పుడు కూడా నేనే మాట్లాడా? దమ్ముంటే రా? నిరూపించు అని ఛాలెంజ్ విసిరా. అప్పుడు కూడా ఈ మగాళ్లంతా ఏమైపోయారు. నన్ను ఛాలెంజ్ చేసిన మగాళ్లంతా ఏమయ్యారు? ఆ రోజు వీరికి మగతనం లేదా? అసలు ఆడవాళ్లని అనడం ఏమిటి? నేను ఆర్ఎస్ఎస్‌‌కి చెందిన మోహన్ భగవత్‌‌ని కూడా ఈ విషయం అడిగాను. ఆయన కూడా ఇది చాలా తప్పు అని అన్నారు. మరి ఇలాంటి ఇష్యూస్‌పై నేను మాట్లాడినప్పుడు నా లైఫ్ కూడా రిస్క్‌లో పడుతుంది కదా. అయినా నేనేం భయపడలేదే? నన్ను చాలా మంది అంటుంటారు.. నువ్వెవడివిరా అడగడానికి.. నీకేం స్థోమత ఉంది అని. నాకు స్థోమత లేదు.. కానీ అడిగే ధైర్యం ఉంది. మీ ఫ్యామిలీస్‌ని కాపాడుకునే ధైర్యం లేదు మీకు.. మీ ఫ్యామిలీ లేడీస్‌ని (Family Ladies) తిడితే పట్టించుకునే పరిస్థితి లేదు మీకు. మీరంతా పిరికివాళ్లు. మనల్ని, మన వాళ్లను కాపాడుకోగలిగినప్పుడే.. రాష్ట్రానికి, దేశానికి ఏమైనా చేయగలం. ఎదుటివాడు మనల్ని తిడుతుంటే.. ఎదురు మాట్లాడగలిగే ధైర్యం ముందు కావాలి. అంతేకానీ, ప్రతిదానికీ భయపడిపోయి, స్వార్థంగా ఆలోచించేవారు కూడా నా గురించి మాట్లాడుతున్నారు..’’ అంటూ తమ్మారెడ్డి ఫైర్ (Tammareddy Fire) అయ్యారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*Actress Prema: రెండో పెళ్లి విషయమై ఫుల్ క్లారిటీ ఇచ్చిన ప్రేమ..!

*Radhika Apte: నన్ను ఆ సర్జరీ చేయించుకోమన్నారు.. ఇప్పుడలా అంటేనా?

*Allu Arha: ‘రుద్రమదేవి’కి అల్లు అర్జున్.. ‘శాకుంతలం’కి అల్లు అర్హ

*Namitha: అది మన సంస్కృతి కాదు. మనకంటూ ఒక సంస్కృతి ఉంది

*KGF Actress: ‘కెజియఫ్‌’లో వణికించిన నటి.. ఇప్పుడు హాస్పిటల్‌లో ఉంది

Updated Date - 2023-04-15T18:15:51+05:30 IST