Peddha Kapu-1: ‘పెదకాపు-1’ కూడా ఫిక్సయ్యాడు

ABN , First Publish Date - 2023-09-04T19:52:54+05:30 IST

సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’ విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంతో విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నారు.

Peddha Kapu-1: ‘పెదకాపు-1’ కూడా ఫిక్సయ్యాడు
Peddha Kapu 1 Movie Still

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘సలార్’ (Salaar) చిత్ర విడుదల విషయంలో రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా నవంబర్‌కి వాయిదా పడిందని ఒకసారి, లేదు వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలోకి దిగనుందని మరోసారి.. ఇలా ప్రస్తుతం సోషల్ మాధ్యమాలలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వార్త తెలిసినప్పటి నుంచి కొన్ని సినిమాలు ధైర్యంగా ‘సలార్’ విడుదలకావాల్సిన సెప్టెంబర్ 28 టార్గెట్ చేస్తున్నాయి. ఇప్పటికే కిరణ్ అబ్బవరం నటించిన ‘రూల్స్ రంజన్’ సినిమా సెప్టెంబర్ 28 విడుదల కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’ (Peddha Kapu-1) విడుదల తేదీని కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.


‘అఖండ’ (Akhanda) లాంటి మాసీవ్ బ్లాక్ బస్టర్‌ని అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ ‘పెదకాపు-1’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో విరాట్ కర్ణ (Virat Karrna) హీరోగా పరిచయం అవుతున్నారు. ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్. దసరా పండుగ సందర్భంగా భారీ పోటీ వుండటంతో ఇది పర్ఫెక్ట్ డేట్ అని భావించిన మేకర్స్.. ‘సలార్’ వాయిదాని వాడుకునే ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన టీజర్, పాటలకు మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో ప్రమోషన్స్ మరింత ముమ్మరం చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. (Peddha Kapu-1 Movie Release Date)

PK.jpg

టీజర్‌ విడుదల తర్వాత ఈ సినిమా అణచివేత, ఘర్షణల నేపథ్యంలో రూపొందిన చిత్రమనే క్లారిటీ వచ్చింది. టీజర్‌లో హీరో క్యారెక్టర్‌ని కూడా బాగా ఎలివేట్ చేశారు. ఒక సామాన్యుడు.. ఇద్దరు శక్తివంతమైన వ్యక్తులకు వ్యతిరేకంగా చేసిన పోరాటమే ‘పెదకాపు-1’ చిత్రం. ఈ చిత్రానికి ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. రావు రమేష్, నాగబాబు, తనికెళ్ల భరణి, బ్రిగడ సాగ, రాజీవ్ కనకాల, అనసూయ, ఈశ్వరి రావు తదితరులు ఇతర పాత్రలలో కనిపించనున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Devil: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ గురించి ఈ విషయం తెలుసా..

*************************************

*Rules Ranjann: ‘సలార్’ డేట్‌కి ఫిక్సయిన ‘రూల్స్ రంజన్’.. క్లారిటీ కూడా ఇచ్చేశారు

************************************

*Alaya F: వారసత్వాన్ని నిలబెట్టాలనే ప్రయత్నంలో ఉన్నా..

***********************************

*Naveen Polishetty: ‘మిస్‌ శెట్టి’ సెట్‌లోకి రాగానే చేసే పనితో.. డైలాగ్స్ మరిచిపోయేవాడిని

***********************************

Updated Date - 2023-09-04T19:52:54+05:30 IST