Naveen Polishetty: ‘మిస్‌ శెట్టి’ సెట్‌లోకి రాగానే చేసే పనితో.. డైలాగ్స్ మరిచిపోయేవాడిని

ABN , First Publish Date - 2023-09-03T09:50:14+05:30 IST

థియేటర్‌ ఆర్టిస్టుగా ప్రయాణాన్ని ప్రారంభించి.. యూట్యూబర్‌గా యూటర్న్‌ తీసుకుని.. ఇప్పుడు హీరోగా యమ స్పీడుతో దూసుకుపోతున్నాడు నవీన్‌ పొలిశెట్టి. చేసింది రెండు సినిమాలైనా.. తన పంచులు, కామెడీ టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడీ ‘జాతిరత్నం’. తాజాగా ‘మిస్‌ శెట్టి’తో జతకట్టిన ఈ ‘మిస్టర్‌ పొలిశెట్టి’ తన మనసులోని విషయాలను ఆంధ్రజ్యోతికి చెప్పుకొచ్చారు.

Naveen Polishetty: ‘మిస్‌ శెట్టి’ సెట్‌లోకి రాగానే చేసే పనితో.. డైలాగ్స్ మరిచిపోయేవాడిని
Naveen Polishetty and Anushka Shetty

థియేటర్‌ ఆర్టిస్టుగా ప్రయాణాన్ని ప్రారంభించి.. యూట్యూబర్‌గా యూటర్న్‌ తీసుకుని.. ఇప్పుడు హీరోగా యమ స్పీడుతో దూసుకుపోతున్నాడు నవీన్‌ పొలిశెట్టి. చేసింది రెండు సినిమాలైనా.. తన పంచులు, కామెడీ టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడీ ‘జాతిరత్నం’. తాజాగా ‘మిస్‌ శెట్టి’తో జతకట్టిన ఈ ‘మిస్టర్‌ పొలిశెట్టి’ తన మనసులోని విషయాలను ఇలా పంచుకున్నాడు..

అమ్మాయి పాత్రలకు నేనే ఛాయిస్‌

నా పాఠశాల విద్యాభ్యాసం అంతా బాయ్స్‌ స్కూల్‌లోనే జరిగింది. పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ఏటా మాతో రకరకాల నాటకాలు వేయించేవారు. ఏ నాటకంలో అమ్మాయి వేషం ఉన్నా అది నేనే వెయ్యాల్సి వచ్చేది. నిజానికి నాకు ఇష్టం లేకపోయినా.. సొట్టబుగ్గలున్నాయనే కారణంతో బలవంతంగా నాతో వేయించేది మా స్కూల్‌ టీచర్‌. (Naveen Polishetty Special Interview)

ఇంటిపేరు పాడు చేస్తున్నానన్నారు

నేను ఎన్‌ఐటీ భోపాల్‌ నుంచి డిగ్రీ పట్టా పొందా. ఆ తర్వాత లండన్‌లో కొంతకాలం ఉద్యోగం చేశా. లక్షల్లో జీతం, లగ్జరీ లైఫ్‌.. కానీ సినిమాలపై ఉన్న పిచ్చితో ఇంట్లోవాళ్లకి చెప్పకుండా ఉద్యోగం మానేసి ముంబై వచ్చేశా. అక్కడ కొంతకాలం థియేటర్‌ ఆర్టిస్టుగా నటించాను. ఆ తర్వాత అమ్మానాన్నలకు అసలు విషయం తెలియడంతో ‘మన ఇంటిపేరు పాడు చేస్తున్నావ్‌ కదరా’ని తిట్టేవారు. కానీ ఇప్పుడు ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’ టైటిల్‌లో మా ఇంటిపేరు చూసి నాన్న చాలా ఆనందపడుతున్నారు.


Naveen-1.jpg

ఆమెను చూస్తూ డైలాగ్స్‌ మర్చిపోయా

అనుష్క (Anushka)తో సినిమా అనగానే మొదట కాస్త భయపడ్డా. ఆమె సెట్‌లో అడుగుపెట్టగానే అందరికీ ఓ వామ్‌ హగ్‌ ఇస్తుంది. ఆమెలో ఉన్న మంచి లక్షణాల్లో ఇదొకటి. అనుష్క నుంచి నేను కూడా అందరికీ అభిమానపూర్వకంగా హగ్‌ ఇవ్వడం నేర్చుకున్నా. చాలాసార్లు ఆమెను చూస్తూ నేను చెప్పాల్సిన డైలాగ్స్‌ కూడా మరిచిపోయేవాడిని.

హీరో కాబోయి..

ఓ థియేటర్‌ ఆర్ట్స్‌ వర్క్‌షాపులో నేను, విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) కలిశాం. ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ (Life Is Beautiful) ఆడిషన్‌ జరుగుతుందని తెలిసి వెళ్లాం. లీడ్‌ క్యారెక్టర్‌ కోసం ఆడిషన్‌ ఇస్తే.. మా ముఖాల్లో రిచ్‌ లుక్‌ కనిపిస్తుందని చెప్పి విలన్‌ గ్యాంగ్‌కి ఎంపిక చేశారు శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) గారు.

బెస్ట్‌ ఫ్యాన్‌ మూమెంట్‌

ఒక రోజు వేరే పనిమీద ఆసుపత్రికి వెళ్లా. నేను అక్కడికి వచ్చానని తెలుసుకున్న ఓ మహిళా అభిమాని నాతో మాట్లాడాలని కబురు పంపించింది. సరేనని కలవడానికి వెళ్లా. అగ్నిప్రమాదంలో గాయాలపాలై చికిత్స పొందుతున్న ఆమెను చూడగానే ఒక్కసారిగా మనసు చలించిపోయింది. తాను అనుభవిస్తున్న శారీరక, మానసిక బాధ నుంచి బయటపడేందుకు రోజూ మా ‘జాతిరత్నాలు’ సినిమా చూస్తున్నట్లు ఆమె చెప్పింది. ఆ మాట వినగానే నా కళ్లు చెమ్మగిల్లాయి. ఒక నటుడిగా ఇంతకంటే ఇంకేం కావాలి.


తన కోసం బ్రాంచ్‌ మారాను

కాలేజీ రోజుల్లో.. తొలిచూపులోనే ఒక అమ్మాయి తెగ నచ్చేసింది. తన కోసమని ఏకంగా మెకానికల్‌ నుంచి సివిల్‌ బ్రాంచ్‌కి మారిపోయా. నా మనసులోని మాటను ఆమెకు చెప్పాలనే ఉత్సుకతతో ఆ తరువాత రోజు క్లాస్‌కి వెళ్లా. నాలుగు రోజులు గడిచినా ఆమె కనిపించకపోయేసరికి.. సెలవులో ఉందేమోననుకన్నా. కానీ ఓ రోజు అనుకోకుండా కాలేజీ క్యాంపస్‌లోనే తారసపడింది. అప్పుడు తెలిసింది అసలు నిజం. తాను నాలాగే బ్రాంచ్‌ మారిందని. ఆఖరికి ఆమె దక్కకపోయినా, ఆమె కోసం మారిన బ్రాంచ్‌ నుంచి మాత్రం డిగ్రీ పట్టా దక్కింది.

క్రెడిట్‌ అంతా యూట్యూబ్‌ (Youtube)దే

టాలీవుడ్‌ కన్నా ముందు బాలీవుడ్‌ (Bollywood)లోనే సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టా. అవకాశాల కోసం తిరగని ఆఫీసు లేదు. ఎన్ని ఆడిషన్స్‌ ఇచ్చానో లెక్కేలేదు. ఎక్కడికి వెళ్లినా అందరి నోటా ఒకటే మాట.. ‘తరువాత చెబుతామ’ని. కానీ వాళ్ల నుంచి తిరిగి పిలుపొచ్చేది కాదు. పాకెట్‌ మనీ కోసం షాపింగ్‌ మాల్స్‌లో జరిగే చిన్న చిన్న కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా మారా. అంతేకాదు.. స్టాండప్‌ కమెడియన్‌‌గా కూడా కొన్ని షోలు చేశా. ఎంతకీ గుర్తింపు రాకపోవడంతో యూట్యూబ్‌ ద్వారా నా టాలెంట్‌ నిరూపించుకోవాలనుకున్నా. హాస్యానికి పెద్దపీట వేస్తూ కొత్త కొత్త స్టోరీలైన్‌లతో వీడియోలు తీయడం మొదలుపెట్టా. అవి కాస్త వైరల్‌గా మారాయి. వాటి కారణంగానే అవకాశాలు రావడం మొదలయ్యాయి.


ఇవి కూడా చదవండి:

============================

*Hi Nanna: ‘హాయ్ నాన్న’ మ్యూజికల్ ఫెస్ట్ మొదలవ్వబోతోంది.. మ్యూజిక్ ఎవరో తెలుసుగా..

************************************

*RS Shivaji: ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ నటుడు ‘మాలోకం’ ఇక లేరు

************************************

*Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రీట్ కూడా వచ్చేసింది.. ఇక్కడా కత్తే..

*************************************

*Kushi: తొలిరోజు బాక్సాఫీస్ కొల్లగొట్టిన ‘ఖుషి’.. ఎన్ని కోట్లు రాబట్టిందంటే..

************************************

*Hari Hara Veera Mallu: పవర్‌ఫుల్ పోస్టర్‌తో ఫ్యాన్స్‌కి ట్రీట్..

*************************************

Updated Date - 2023-09-03T10:38:10+05:30 IST