Rules Ranjann: ‘సలార్’ డేట్‌కి ఫిక్సయిన ‘రూల్స్ రంజన్’.. క్లారిటీ కూడా ఇచ్చేశారు

ABN , First Publish Date - 2023-09-04T16:21:39+05:30 IST

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘రూల్స్ రంజన్’. ‘నీ మనసు నాకు తెలుసు’, ‘ఆక్సిజన్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. సీనియర్ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ‘సలార్’ విడుదలవ్వాల్సిన సెప్టెంబర్ 28న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

Rules Ranjann: ‘సలార్’ డేట్‌కి ఫిక్సయిన ‘రూల్స్ రంజన్’.. క్లారిటీ కూడా ఇచ్చేశారు
Salaar and Rules Ranjann Movie Posters

కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘రూల్స్ రంజన్’ (Rules Ranjann). ‘నీ మనసు నాకు తెలుసు’, ‘ఆక్సిజన్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న రత్నం కృష్ణ (Rathinam Krishna) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. సీనియర్ నిర్మాత ఏ.ఎం. రత్నం (AM Rathnam) సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మూడు పాటలకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాగా.. తాజాగా మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. ‘ఇంట్రడక్షన్ ఆఫ్ రూల్స్ రంజన్’ పేరుతో సోమవారం మీడియా సమావేశం నిర్వహించి.. మీడియా సమక్షంలో నాలుగో పాటని విడుదల చేయడమే కాకుండా.. విడుదల తేదీని కూడా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ (Salaar) చిత్రం సెప్టెంబర్ 28కి విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ‘రూల్స్ రంజన్’ మేకర్స్ ఆ డేట్‌కి ఫిక్సయ్యారు. సెప్టెంబర్ 28న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాత ఏఎం రత్నం ప్రకటించారు. (Rules Ranjann Release Date Announcement)


ఈ సందర్భంగా నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ.. కిరణ్ ముందుగా నేను నిర్మాతను అని భావించి కథ వినడానికి వచ్చారట. కానీ కథ విని, బాగా నచ్చడంతో వెంటనే ఈ సినిమా చేయడానికి అంగీకరించారట. ఇప్పుడు పాటలు బాలేకపోతే సినిమా మధ్యలో లేచి వెళ్లిపోతున్నారు. అందుకే సంగీతం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టమని చెప్పాను. నా అనుభవం ప్రకారం ఆడియో హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్లే. ‘రంగస్థలం’, ‘అల వైకుంఠపురములో’ వంటి సినిమాలు ఆడియో ఎంత హిట్టో, సినిమాలు అంతకుమించిన హిట్ అయ్యాయి. సినిమా విజయంలో సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాకి అమ్రిష్ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ కథని నమ్మి నిర్మించడానికి ముందు వచ్చిన నిర్మాతలు దివ్యాంగ్, మురళికి అభినందనలు. ఈ సినిమా క్రెడిట్ వారికే దక్కుతుంది. వినోదాత్మక సినిమాలకి విజయావకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పటికే ఈ సినిమా చూశాను. కుటుంబమంతా కలిసి చూడగలిగేలా ఉన్న ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. (Rules Ranjann Movie)

AM-Rathnam.jpg

హీరో కిరణ్ అబ్బవరం (Hero Kiran Abbavaram) మాట్లాడుతూ.. ఈ రూల్స్ రంజన్ ప్రయాణం ఏడాది క్రితం మొదలైంది. ఏ.ఎం. రత్నం గారి ద్వారా కృష్ణ గారిని కలిసి ఈ కథ విన్నాను. ఈ కథ వినేటప్పుడు రెండు గంటల పాటు నవ్వుతూనే ఉన్నాను. థియేటర్లలో చూసేటప్పుడు మీరు కూడా అలాగే నవ్వుకుంటారనే నమ్మకం ఉంది. నేను మనో రంజన్ అనే పాత్ర పోషించాను. మనో రంజన్ మనలో ఒకడిలా ఉంటాడు. అందరూ ఈ పాత్రకి కనెక్ట్ అవుతారు. ఇంత మంచి పాటలు ఇచ్చిన అమ్రిష్ గారికి ధన్యవాదాలు. నేపథ్య సంగీతం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఏ.ఎం. రత్నం గారి సినిమా చూస్తూ పెరిగాను. ఆయన నిర్మించిన సినిమాల్లో ‘ఖుషి’ ఎప్పటికీ నా అభిమాన చిత్రం. ఏ.ఎం. రత్నం గారు మా సినిమాని సమర్పించడం గర్వంగా ఉంది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారకులైన దర్శకనిర్మాతలకు, నేహా శెట్టి, ఇతర చిత్ర బృందానికి అందరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు అని అన్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Alaya F: వారసత్వాన్ని నిలబెట్టాలనే ప్రయత్నంలో ఉన్నా..

***********************************

*Naveen Polishetty: ‘మిస్‌ శెట్టి’ సెట్‌లోకి రాగానే చేసే పనితో.. డైలాగ్స్ మరిచిపోయేవాడిని

***********************************

*Hi Nanna: ‘హాయ్ నాన్న’ మ్యూజికల్ ఫెస్ట్ మొదలవ్వబోతోంది.. మ్యూజిక్ ఎవరో తెలుసుగా..

************************************

Updated Date - 2023-09-04T16:21:39+05:30 IST