Devil: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ గురించి ఈ విషయం తెలుసా..

ABN , First Publish Date - 2023-09-04T17:25:14+05:30 IST

హీరో నందమూరి కళ్యాణ్ రామ్ పేరు వినగానే గుర్తొచ్చేది ఆయన చేసే వైవిధ్యమైన సినిమాలు. వాటితోనే తనదైన గుర్తింపు సంపాదించుకున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు మరో వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘డెవిల్’. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ గాంధీ 80 భారీ సెట్స్‌ని రూపొందించారట.

Devil: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ గురించి ఈ విషయం తెలుసా..
Devil Movie Sets

హీరో నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) పేరు వినగానే గుర్తొచ్చేది ఆయన చేసే వైవిధ్యమైన సినిమాలు. ఆ సినిమాలతోనే తనదైన గుర్తింపు సంపాదించుకున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు మరో వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘డెవిల్’ (Devil). బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ (The British Secret Agent) అనేది ట్యాగ్‌లైన్. స్వాతంత్ర్యానికి ముందు కథాంశంతో రూపొందుతోన్న ఈ పీరియాడిక్ మూవీ కోసం మేకర్స్ భారీ సెట్స్‌ను వేస్తున్నట్లుగా అధికారిక న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. ఈ సెట్స్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవడమే కాకుండా.. సినిమాపై మరింతగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.


‘డెవిల్’ మూవీ కోసం మొత్తంగా 80 సెట్స్ వేస్తున్నారట. 1940 బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో.. దానికి తగ్గట్లుగా సెట్స్‌ను రూపొందించారట ఆర్ట్ డైరెక్టర్ గాంధీ (Art Director Gandhi). బ్రిటీష్ పరిపాలనలో మన దేశం ఉన్నసయమానికి చెందిన సెట్స్ వేయటం తనకెంతో ఛాలెంజింగ్‌గా అనిపించిందని ఆర్ట్ డైరెక్టర్ గాంధీ పేర్కొన్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ వంటి పలు ప్రాంతాల నుంచి సెట్స్‌ను రూపొందించటానికి కావాల్సిన సామాగ్రిని తెప్పించామని.. నిర్మాత అభిషేక్ నామా (Abhishek Nama)గారి సపోర్ట్ లేకుండా ఈ రేంజ్‌లో భారీ సెట్స్ వేసి సినిమా రిచ్‌గా తెరకెక్కించటం సాధ్యమయ్యేది కాదని ఆర్ట్ డైరెక్టర్ తెలిపారు.

devil-1.jpg

‘డెవిల్’ మూవీ కోసం వేసిన సెట్స్‌కు సంబంధించిన కొన్ని విశేషాలు..

* 1940 మద్రాస్ ప్రాంతంలోని ఆంధ్రా క్లబ్

* బ్రిటీష్ కాలానికి తగ్గట్లు 10 వింటేజ్ సైకిల్స్, 1 వింటేజ్ కారు

* బ్రిటీష్ కవర్ డిజైన్‌తో ఉన్న 500 పుస్తకాలు

* 1940 కాలానికి చెందిన కార్గో షిప్

* 36 అడుగుల ఎత్తైన లైట్ హౌస్ సెట్ (వైజాగ్ సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో)

* ఈ సెట్స్ వేయటానికి 9 ట్రక్కుల కలపను తెప్పించారు. వెయ్యి టన్నులకు పైగా ఐరన్, ఫైబర్, 10వేల చదరపు అడుగుల వింటేజ్ వాల్ పేపర్‌ను ఉపయోగించారు.

Devil-2.jpg


ఇవి కూడా చదవండి:

============================

*Rules Ranjann: ‘సలార్’ డేట్‌కి ఫిక్సయిన ‘రూల్స్ రంజన్’.. క్లారిటీ కూడా ఇచ్చేశారు

************************************

*Alaya F: వారసత్వాన్ని నిలబెట్టాలనే ప్రయత్నంలో ఉన్నా..

***********************************

*Naveen Polishetty: ‘మిస్‌ శెట్టి’ సెట్‌లోకి రాగానే చేసే పనితో.. డైలాగ్స్ మరిచిపోయేవాడిని

***********************************

*Hi Nanna: ‘హాయ్ నాన్న’ మ్యూజికల్ ఫెస్ట్ మొదలవ్వబోతోంది.. మ్యూజిక్ ఎవరో తెలుసుగా..

************************************

Updated Date - 2023-09-04T17:25:14+05:30 IST