Alaya F: వారసత్వాన్ని నిలబెట్టాలనే ప్రయత్నంలో ఉన్నా..

ABN , First Publish Date - 2023-09-03T14:17:09+05:30 IST

ట్వంటీస్ సినిమాలో నటించటం, విజయం సాధించటంతో గొప్ప అనుకున్నా. పైగా ‘మీరు నటి కదా!’ అంటుంటే కొత్త ఫీలింగ్‌ ఉండేది. ఆ తర్వాత కరోనాకాలం వచ్చింది. సెకండ్‌ వేవ్‌ తర్వాత ఒక రోజు హోటల్‌లో డిన్నర్‌ చేస్తున్నా. కొందరు అమ్మాయిలు ఏమి చేస్తారు? అని అడిగారు. అప్పుడు భూమి మీదకు దిగాను. అదో గుణపాఠంగా భావిస్తానని అన్నారు అలయా ఎఫ్

Alaya F: వారసత్వాన్ని నిలబెట్టాలనే ప్రయత్నంలో ఉన్నా..
Aalia Furniturewalla

ఈ బాలీవుడ్‌ బ్యూటీ పేరు అలయా ఫర్నిచర్‌వాలా (Aalia Furniturewalla). ‘అలయా ఎఫ్‌’ అంటూ పిలుస్తారు.

ఈ కుర్ర కథానాయిక తొలి సినిమాతోనే ఫిల్మ్‌ఫేర్‌ గెలుచుకుంది.

‘టైమ్స్‌ 50 మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమన్‌’ కేటగిరీలోనూ నిలిచింది. బాలీవుడ్‌ నటి

పూజా బేడి కూతురైన ఈ అలయా ఎఫ్‌ గురించి కొన్ని విశేషాలు..

‘‘నా తొలి చిత్రం ‘జవానీ జానేమన్‌’. సైఫ్‌ అలీఖాన్‌, టబు.. లాంటి సీనియర్స్‌తో కలిసి నటించే అవకాశం వచ్చింది. 2020 జనవరిలో ఈ చిత్రం విడుదలైంది. తొలి చిత్రంతోనే స్టార్‌ అన్నారు. అద్భుతమైన పర్ఫార్మెన్స్‌ అన్నారు. ట్వంటీస్ సినిమాలో నటించటం, విజయం సాధించటంతో గొప్ప అనుకున్నా. పైగా ‘మీరు నటి కదా!’ అంటుంటే కొత్త ఫీలింగ్‌ ఉండేది. ఆ తర్వాత కరోనాకాలం వచ్చింది. సెకండ్‌ వేవ్‌ తర్వాత ఒక రోజు హోటల్‌లో డిన్నర్‌ చేస్తున్నా. కొందరు అమ్మాయిలు ఏమి చేస్తారు? అని అడిగారు. అప్పుడు భూమి మీదకు దిగాను. అదో గుణపాఠంగా భావిస్తా. ఏదైనా మనం గొప్ప అనుకుంటాం. కానీ అవతలి వాళ్లు అనాలని లేదు కదా! ఇంకాస్త ఎదగాలి అనిపించిందప్పుడే.

సినిమా నేపథ్యం..

ముంబైలో పుట్టిపెరిగా. అమ్మ పంజాబీ, నాన్న పేరు ఫర్హాన్‌ ఇబ్రహీమ్‌. అమ్మ పూజా బేడీ నటి కావటంతో ఇటువైపు ప్రోత్సహించింది. ఇకపోతే తాతయ్య కూడా నటులే. పేరు కబీర్‌ బేడి. ఇకపోతే బాల్యంలో నుంచే చురుగ్గా ఉండేదాన్ని. స్కూలింగ్‌ తర్వాత సీరియ్‌సగా సినిమాల్లోకి రావాలనుకున్నా. అందుకే న్యూయార్క్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్‌ కోర్సులో డిప్లమో చేశా. 2011లో ఓ రియాలిటీ షోలో పాల్గొన్నా. కథక్‌లో శిక్షణ తీసుకున్నా. సినిమానే జీవితంగా వెళ్తున్నా. ఎవరి మెచ్చుకోలు అవసరం లేదు.. మంచి పాత్రలు చేసి నిలదొక్కుకోవాలని అనుకుంటున్నా. వారసత్వాన్ని నిలబెట్టాలనే ప్రయత్నంతో ముందడుగులేస్తున్నా.


Alaya-F.jpg

ఊరికే ఉండలేను అలా..

‘ఫెడ్డీ’, ‘ఆల్‌మోస్ట్‌ ప్యార్‌ విత్‌ డిజె మొహబ్బత్‌’, ‘యూ టర్న్‌’ సినిమాలతో మంచి పేరొచ్చింది. మరో నాలుగైదు చిత్రాలు చేతిలో ఉన్నాయి. ఒక నటిగా నాకు సామాజిక బాధ్యత ఉందనుకుంటా. చెప్పటం కాదు చేసి చూపించాలనే రకం నాది. సోషల్‌ మీడియాలో మాట్లాడితే ఏదైనా సమస్యలు వస్తాయేమోనని సహనంగా ఉంటా. అయితే కారులో వెళ్తున్నప్పుడు ఫోనులో నిమగ్నం కాకుండా.. బయట ప్రపంచాన్ని చూస్తూ వెళ్తాను. ఎవరైనా జంతువులను కొట్టడం చేస్తే.. కారులోంచి దిగి మరీ క్లాసులు తీసుకుంటా. ఇది నా నేచర్‌. ఇకపోతే ఫెమినిజం ఇష్టపడను. ఫెమినిజం వల్ల మహిళల్లో సమానత్వం రాదు కదా! అనుకుంటా. ఎవరైనా తన కింద పని చేసేవారిని గౌరవించకపోతే నచ్చదు. ఇలాంటప్పుడు వెంటనే స్పందిస్తుంటా. చూస్తూ ఊరికే అలా ఉండలేను.

ఎవరి మీదా ఆధారపడకూడదు..

కరోనా సమయంలో డబ్బుల విలువ ఏంటో తెలిసింది. కళ్లముందే వలసలు చూశాం. సోషల్‌ మీడియాలో చదవటం, వీడియోలు చూడటం చేసేదాన్ని. కరోనా తర్వాత కారు కొన్నా. నేను ప్లాన్‌గా ఉంటా. ఇండస్ర్టీని ఊహించలేం, ఒక స్ట్రక్చర్‌ ఉండదు. నేనేమో సిస్టమ్‌ ఫాలో అవుతా. తీవ్రమైన గందరగోళం ఉంటుంది. ఇక్కడ ఉండగలమా అనిపిస్తుంది. ఒకసారి ఇండస్ర్టీలో నిలబడాలని అనుకున్నప్పుడు ఏమీ పట్టించుకోలేదు. ఎవరి సలహాలు అడగలేదు. సొంతంగా ఎదగాలనే నిర్ణయానికి వచ్చా. కష్టపడటం అలవాటు చేసుకున్నా. యాడ్స్‌లో వర్క్‌ చేయటంతో పాటు ఇంకా ఫ్రీలాన్స్‌ వర్క్‌ కూడా చేయాలనుకుంటా. ఇక్కడ పని వల్లనే గుర్తింపు దొరుకుతుంది. మా అమ్మమ్మ ప్రొతిమా క్లాసికల్‌ డ్యాన్సర్‌, అమ్మ నటి.. వీరిద్దరూ ఇండిపెండెంట్‌గా ఎదిగారు. వీరి దారే నాది. స్ర్టాంగ్‌ ఉమన్‌గా ఎదగాలంటుంది మా అమ్మ. జోక్‌ ఏంటంటే.. ఈ దునియాలో మహిళలు బలమైన స్వరాన్ని, అభిప్రాయాలను వినిపించినా అవి మగాళ్ల ముందు తేలిపోతుంటాయి. అయినప్పటికీ స్ట్రాంగ్‌గా అంటే ఎవరి మీదా ఆధారపడకుండా ఆర్థిక స్వేచ్ఛ కలిగి ఉండటమే. రెండేళ్ల కితమే కొత్త ఇంటికి మారాను. నా పనులు నేనే చేసుకోగలుగుతున్నా. రేప్పొద్దున్న నా కూతురు ఉన్నా నాలానే పెరగాలనుకుంటా. నా ఫీల్డ్‌లోకే రావాలని ఆశిస్తా. ఎన్నో అవకాశాలున్నాయి. నేను అనుకున్నది సాధిస్తా. పాజిటివ్‌గా పయనిస్తాను. నాలో చాలా ఫైర్‌ ఉంది.. అది కచ్చితంగా రేప్పొద్దున చూస్తారు. అది ప్రూవ్‌ చేసుకుంటా.’’


ఇవి కూడా చదవండి:

============================

*Naveen Polishetty: ‘మిస్‌ శెట్టి’ సెట్‌లోకి రాగానే చేసే పనితో.. డైలాగ్స్ మరిచిపోయేవాడిని

***********************************

*Hi Nanna: ‘హాయ్ నాన్న’ మ్యూజికల్ ఫెస్ట్ మొదలవ్వబోతోంది.. మ్యూజిక్ ఎవరో తెలుసుగా..

************************************

*RS Shivaji: ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ నటుడు ‘మాలోకం’ ఇక లేరు

************************************

*Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రీట్ కూడా వచ్చేసింది.. ఇక్కడా కత్తే..

*************************************

Updated Date - 2023-09-03T14:21:43+05:30 IST