Paruchuri Patalu: విజయ్ ‘వారసుడు’లో పరుచూరి చెప్పినవి ఉంటేనా..?
ABN, First Publish Date - 2023-03-11T19:55:26+05:30
తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay), దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘వారిసు’. తెలుగులో ఈ చిత్రం ‘వారసుడు’గా విడుదలైంది. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం.. మిక్స్‌డ్ టాక్‌ని
తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay), దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘వారిసు’. తెలుగులో ఈ చిత్రం ‘వారసుడు’గా విడుదలైంది. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం.. మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ చిత్రంపై సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) తన పరుచూరి పాఠాలులో రివ్యూ ఇచ్చారు. తనకి సినిమా ఎంతగానో నచ్చిందని, కానీ కొన్ని సన్నివేశాలను మార్చి రాసుకుని ఉంటే ఈ సినిమా ఇంకా బాగుండేదని ఆయన చెప్పుకొచ్చారు. ‘వారసుడు’ చిత్రంపై ఆయన చెప్పిన పాఠం ఇదే..
* సినిమాలో విజయ్ కనిపించే ఫస్ట్ షాట్ చూస్తే.. డైరెక్టర్‌ని అభినందించాలనిపిస్తుంది. ఎందుకంటే.. మీరు ఒక అద్భుతమైన, సాహసవంతుడైన కుర్రవాడి కథ చూడబోతున్నారనేది ఫస్ట్ షాట్‌లోని ఆడియన్స్‌కి తెలియజేశారు.
* ఇది ఉమ్మడి కుటుంబ కథా చిత్రం. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కనిపించడం కష్టం అవుతుంది కానీ.. నా చిన్నతనంలో రెండుమూడు తరాల వారు ఒకే ఇంట్లో కలిసి ఉండేవారు. కానీ మా తరం నుంచి ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో మార్పులు వచ్చాయి. నేను, మా అన్నయ్య కూడా పక్కపక్కన ఇళ్లలోనే ఉంటాం. అలాంటిది ఇప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గురించి చెప్పాలనుకోవడం సాహసంతో కూడుకున్న పని. ఆ సాహసం చేసిన దర్శకనిర్మాతలకు, హీరోకి అభినందనలు.
* ఉమ్మడి కుటుంబంలో ఇద్దరు అన్నయ్యలు వాళ్ల ఆలోచనలతో బయటికి వెళ్లిపోతే.. వారిని మళ్లీ కుటుంబంలోకి చేర్చిన తమ్ముడి కథే ఈ ‘వారసుడు’. సినిమాలో హీరో అమ్మచాటు బిడ్డ. నాన్న అంటే అంత ఇష్టం ఉండదు. కానీ హీరో సినిమాలో చేసిన త్యాగం అంతా నాన్నకోసమే. ఈ కథాంశంలో ఉన్న గొప్పతనం అదే. (Paruchuri Gopala Krishna Varasudu Review)
* 2 గంటల 49 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమాలో ప్రేమ తక్కువగా ఉంది. పాటల కోసమే హీరోయిన్‌ని ఉపయోగించుకున్నారు కానీ.. హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ ఎపిసోడ్స్ మాత్రం లేవు. ఉమ్మడి కుటుంబ వ్యవస్త, కుట్రలు, కుయుక్తులు అంటూ కథని నడిపించారు కానీ.. కాస్త ప్రేమ డోస్ పెంచి.. హీరో, హీరోయిన్ల మధ్య కథని నడిపి ఉంటే ఇంకాస్త ఆసక్తికరంగా ఈ సినిమా నడిచేది.
* సీటులో తను కూర్చొవడానికి ఒక అన్నయ్యని వ్యతిరేకించడం, దాని కోసం ఓ యాక్షన్ సీన్.. ఇంకో అన్నయ్యతో కూడా సేమ్ సీన్స్. అయితే ‘వారసుడి’గా విజయ్ ఛైర్‌లో కూర్చోవడానికి జరిగే మీటింగ్ సీన్ నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ మాత్రం ఇది విజయ్ మార్క్ సినిమా అని అనిపించింది.
* తండ్రికి ఉన్న సమస్యను తల్లికి, అన్నయ్యలకు తెలియనీయకుండా.. చివరికి తండ్రికి కూడా తెలియకుండా హీరో కథని నడిపిస్తాడు. అన్నయ్యలని మార్చి.. తండ్రి కలలు కన్న సామ్రాజ్యాన్ని దుర్మార్గుల చేతిలో పడకుండా ఎలా రక్షించాడు? అనే ఉత్కంఠని దర్శకుడు కలిగించాడు. టెండర్ సీన్‌లో హీరో ఫ్రెండ్ అనే లైన్‌ని కూడా చాలా బాగా తీసుకున్నాడు. ముందే ఆ విషయం తెలిస్తే.. అక్కడ డ్రామా పండేది కాదు.
* ఇక క్లైమాక్స్‌లో తన రెండో అన్నయ్యని కాపాడుకున్న తర్వాత.. ప్రకాశ్ రాజ్‌ని కూడా కొట్టేయవచ్చు. కానీ నువ్వు మా నాన్న ఎంత గొప్పవాడో.. నువ్వు కూడా అంత గొప్పవాడివి అని చెప్పే డైలాగ్‌తో ప్రకాశ్ రాజ్‌ని మార్చేసి.. ఆ పాత్రని అక్కడితో ముగించేశాడు.
* లెవన్త్ అవర్ గురించి చెప్పుకుంటే.. సినిమా చివర్లో కల్యాణం తర్వాత ముగ్గురు కొడుకులు కలిసి తండ్రి అస్థికలు నదిలో కలిపినట్లు చూపించారు. ఆ షాట్ చూపించకుండా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. దాని ప్లేస్‌లో హీరోహీరోయిన్లకు పెళ్లి చేసినట్లు చూపించి ఉంటే బాగుండేదని నా భావన. అలాగే శ్రీకాంత్‌తో ఎటాచ్ అయిన అమ్మాయి పాత్ర కూడా ఎక్కడ ముగించారో నాకు అర్థం కాలేదు. అయితే తండ్రి అస్థికలు కలిపే సీన్‌ని ఆకాశమే హద్దు అని చెప్పుకోవచ్చు. అందుకే దర్శకనిర్మాతలు దానిని ఇష్టపడి ఉంటారు. కానీ.. తండ్రిని కాపాడలేకపోయాడనే విషయాన్ని చూస్తున్న ప్రేక్షకుల మైండ్‌లోకి వెళ్లకుండా.. అన్నీ సెట్ చేశాను నాన్న.. నీ పెద్ద కొడుకుని ఛైర్‌లో కూర్చోబెట్టి అన్నీ చూసుకో.. నేను అమెరికా వెళ్తున్నా అంటే బాగుండేది. (Paruchuri Gopala Krishna Talks about Varasudu Movie)
* ఇంకా హీరోయిన్ పాత్రని ఇంకాస్త పెంచి ఉంటే బాగుండేది. ఇంకా ఓ 15 నిమిషాల నిడివితో వారి మధ్య సీన్స్ ఉంటే బాగుండేది. ఇప్పుడైనా సినిమా బాగానే ఉంది.. చూడదగ్గ చిత్రమే. లెవన్త్ అవర్ చెప్పిన చిన్న చిన్న విషయాలు చేసి ఉంటే ఇంకా బాగుండేది.
ఇవి కూడా చదవండి:
*********************************
*Ram Charan: తన కో-స్టార్ ఈవెంట్‌లో సతీమణి ఉపాసనతో సందడి చేసిన గ్లోబల్ స్టార్
* Harish Shankar: పెరుగన్నం, బిర్యానీ.. దర్శకుడు మహాకు కౌంటర్
*Pavitra Naresh: బ్యాచ్‌లర్స్ ఫీల్ కాకండి.. ఈ మీమ్స్ ఏంటి సామి?
*Ram Charan: మా నాన్న పెంపకం అలాంటిది.. ఆసక్తికర విషయాలు చెప్పిన చరణ్
*Radha Nair: తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసమో.. మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసమో?
*Nagababu: ‘ఆర్ఆర్ఆర్’ మీద కామెంట్‌కు వైసీపీ వారి భాషలో సమాధానం
*Jr NTR: ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ సైడ్ యాక్టరా? ఇలా అవమానించారేంటి?
*Lakshmi Manchu: రక్తం మరిగిపోతోంది.. మంచు లక్ష్మికి కోపం తెప్పించిన వైరల్ వీడియో..
*Star Producer: పాపం.. దీన స్థితిలో స్టార్ నిర్మాత.. ఆదుకున్న స్టార్ హీరో
*Poonam Kaur: మళ్లీ చెబుతున్నా అర్థం చేసుకోండి.. వేదికపైనే కంటతడి పెట్టిన పూనమ్ కౌర్..