Mama Mascheendra: మూడో లుక్.. ‘డిజె టిల్లు’కి అన్నలా ఉన్నాడు

ABN , First Publish Date - 2023-03-07T19:00:22+05:30 IST

నైట్రో స్టార్ సుధీర్ బాబు (Nitro Star Sudheer Babu) కొన్ని రోజులుగా రకరకాలుగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ లుక్స్ చూసి అంతా సర్‌ప్రైజ్ అవుతున్నారు. తాజాగా ఆయన మరో లుక్‌లో దర్శనమిచ్చారు. ఈ లుక్‌లో

Mama Mascheendra: మూడో లుక్.. ‘డిజె టిల్లు’కి అన్నలా ఉన్నాడు
Sudheer Babu In Mama Mascheendra

నైట్రో స్టార్ సుధీర్ బాబు (Nitro Star Sudheer Babu) కొన్ని రోజులుగా రకరకాలుగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ లుక్స్ చూసి అంతా సర్‌ప్రైజ్ అవుతున్నారు. తాజాగా ఆయన మరో లుక్‌లో దర్శనమిచ్చారు. ఈ లుక్‌లో ఇటీవల వచ్చిన ‘డిజె టిల్లు’ (DJ Tillu)కి బ్రదర్‌లా అనిపిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తోన్న చిత్రం ‘మామా మశ్చీంద్ర’ (Mama Mascheendra). నటుడు-దర్శకుడు హర్షవర్ధన్ (Harshavardhan) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుధీర్ బాబు (Sudheer Babu) మూడు విభిన్న లుక్స్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు లుక్స్‌ని మేకర్స్ వదిలారు. తాజాగా డిజె క్యారెక్టర్ లుక్‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు.

ఊబకాయం ఉన్న దుర్గ (Durga), ఓల్డ్ డాన్ పరశురామ్ (Parasuram) క్యారెక్టర్ పోస్టర్‌లతో సర్‌ప్రైజ్ ఇచ్చిన మేకర్స్ ఈ డిజె క్యారెక్టర్ పోస్టర్‌‌తో మూడవ సర్‌ప్రైజ్ ఇచ్చారు. టీ-షర్ట్, రిప్డ్ జీన్స్ ధరించి, హెడ్‌సెట్‌తో పూర్తిగా పారవశ్యంలో సుధీర్ బాబు కనిపిస్తున్నారు. మొదటి రెండు గెటప్‌లలో డీ-గ్లామ్ లుక్స్‌లో కనిపించగా, మూడో లుక్‌ (Third Look)లో డీజేగా తన రిథమ్‌తో కనిపించాడు సుధీర్ బాబు. ఈ మూడు లుక్స్ కూడా వేటికవే స్పెషల్ అన్నట్లుగా ఉన్నాయి.

కాగా.. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్‌ సోనాలి నారంగ్, సృష్టి సమర్పిస్తున్నారు. వినూత్నమైన కాన్సెప్ట్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ నటీనటులు, అగ్రశ్రేణి సాంకేతిక బృందం పని చేస్తున్న ఈ చిత్రంతో సుధీర్ బాబు తనలోని విలక్షణతను చాటుకునేందుకు సిద్ధమవుతున్నారు. (Mama Mascheendra DJ Look)

ఇవి కూడా చదవండి:

*********************************

*Meter Teaser: నా మీటర్‌లో నేనెళ్తా.. నన్ను కెలకొద్దు.. నాకు అడ్డు రావద్దు

*Star Producer: పాపం.. దీన స్థితిలో స్టార్ నిర్మాత.. ఆదుకున్న స్టార్ హీరో

*NBK: ఏదైనా బాలయ్య దిగనంత వరకే.. వన్స్ హి స్టెప్ ఇన్..

*Poonam Kaur: మళ్లీ చెబుతున్నా అర్థం చేసుకోండి.. వేదికపైనే కంటతడి పెట్టిన పూనమ్ కౌర్..

*Allu Sneha Reddy: ‘క్యూటీ’ అంటూ అల్లు అర్జున్ పోస్ట్.. వైరల్ అవుతోన్న పిక్

*Manchu Manoj: ఏ జన్మ పుణ్యమో నాది.. పెళ్లి తర్వాత మంచు మనోజ్ ఎవరి గురించి ఈ మాటన్నాడంటే..

Updated Date - 2023-03-07T19:00:23+05:30 IST