Allu Sneha Reddy: ‘క్యూటీ’ అంటూ అల్లు అర్జున్ పోస్ట్.. వైరల్ అవుతోన్న పిక్

ABN , First Publish Date - 2023-03-06T20:22:08+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) తన సోషల్ మీడియా వేదికగా.. తన సతీమణి అల్లు స్నేహారెడ్డి (Allu Sneha Reddy)తో ఉన్న పిక్‌ని షేర్ చేశారు. ఈ పిక్, ఆమె పేరు ప్రస్తుతం నెట్ ప్రపంచంలో

Allu Sneha Reddy: ‘క్యూటీ’ అంటూ అల్లు అర్జున్ పోస్ట్.. వైరల్ అవుతోన్న పిక్
Allu Sneha Reddy and Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) తన సోషల్ మీడియా వేదికగా.. తన సతీమణి అల్లు స్నేహారెడ్డి (Allu Sneha Reddy)తో ఉన్న పిక్‌ని షేర్ చేశారు. ఈ పిక్, ఆమె పేరు ప్రస్తుతం నెట్ ప్రపంచంలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అల్లు అర్జున్ ఎందుకీ పోస్ట్ చేశారంటే.. ఈ దంపతులిద్దరికీ మార్చి 6 చాలా ప్రత్యేకమైన రోజు. ఏంటా ప్రత్యేకమని అనుకుంటున్నారా? ఈ రోజు వారి పెళ్లి రోజు. తన 12వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ‘హ్యాపీ యానివర్సరీ క్యూటీ’ (Happy Anniversary Cutieee) అంటూ భార్యతో సెల్ఫీ దిగుతోన్న ఫొటోని బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో సెలబ్రిటీలు, ఫ్యాన్స్ ఈ జంటకు తెలుపుతున్న శుభాకాంక్షలతో.. అల్లు స్నేహా రెడ్డి పేరు ట్రెండ్ అవుతోంది.

అల్లు అర్జున్ విషయానికి వస్తే.. సినిమా షూటింగ్స్ లేకపోతే.. అల్లు అర్జున్ ఎక్కువగా ఫ్యామిలీకే టైమ్ కేటాయిస్తుంటారు. భార్య, పిల్లలతో సరదాగా గడిపే క్షణాలను ఆయన ఫొటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్‌ని కూడా ఖుషీ చేస్తుంటారు. అలాగే సినిమా అప్‌డేట్స్ కూడా ఆయన సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కి తెలియజేస్తుంటారు. అల్లు అర్జున్ కంటే కూడా స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంటారు. సోషల్ మీడియాలో ఆమెకు మాములు ఫాలోయింగ్ లేదు. ఆమె షేర్ చేసే కొన్ని ఫొటోలు అయితే.. హీరోయిన్లకు సైతం చెమటలు పట్టించేలా ఉంటాయి. అల్లు అర్జున్ ఓ ఫ్రెండ్ పెళ్లిలో స్నేహారెడ్డిని చూడటం, ఆ తర్వాత ఇష్టపడటం, ప్రేమ, పెళ్లి, ఇద్దరు పిల్లలు.. ఇలా వారి జీవితం సాగిపోతూ ఉంది. (Allu Arjun and Sneha Reddy Wedding Anniversary)

సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ‘పుష్ప’ పార్ట్ 1తో రికార్డులు క్రియేట్ చేసిన బన్నీ.. ‘పుష్ప 2’ సెట్స్‌పై ఉండగానే సరికొత్త రికార్డులకు కేంద్రబిందువు అవుతున్నారు. సుకుమార్ (Sukumar) ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా కాకుండా ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ వంగా (Sundeep Vanga)తో ఇటీవలే ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను బన్నీ ప్రకటించారు. త్వరలోనే ఆ చిత్ర వివరాలు తెలియనున్నాయి.

ఇవి కూడా చదవండి:

*********************************

*Manchu Manoj: ఏ జన్మ పుణ్యమో నాది.. పెళ్లి తర్వాత మంచు మనోజ్ ఎవరి గురించి ఈ మాటన్నాడంటే..

*Amigos: ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు, ఎక్కడంటే?

* Waltair Veerayya: చిరంజీవి పేరు మీదే మరో రికార్డ్

* Veera Simha Reddy: 50 రోజులు.. ఎన్ని సెంటర్లలోనో తెలుసా?

* Sir: రియల్ ‘సార్’కు ‘సార్’ టీమ్ సహకారం

* Virupaksha Teaser: ప్ర‌మాదాన్ని దాట‌డానికే ఈ ప్రయాణం.. ఎక్కడో కనెక్ట్ అవుతున్నట్లుందే!

* Allu Arjun: ఇక్కడా తగ్గేదే లే.. ఐకాన్ స్టార్ ఖాతాలో మరో రికార్డ్

* Poorna: ఏడో నెల గర్భిణీ.. ‘కానూర్’ తంతు వీడియో వైరల్

* Mega Power Star Ram Charan: నా జీవితంలో అద్భుత‌మైన క్ష‌ణాలివి

* Actress: అరుదైన వ్యాధి బారిన మరో నటి.. బాబోయ్ పగవారికి కూడా ఈ వ్యాధి రాకూడదు

Updated Date - 2023-03-06T20:22:12+05:30 IST