Meter Teaser: నా మీటర్‌లో నేనెళ్తా.. నన్ను కెలకొద్దు.. నాకు అడ్డు రావద్దు

ABN , First Publish Date - 2023-03-07T18:22:25+05:30 IST

వావ్ వాట్ ఏ ఫర్ఫార్మెన్స్ అంటూ సప్తగిరి (Saptagiri) వాయిస్‌తో టీజర్ మొదలైంది. కిరణ్ అబ్బవరం ఎంట్రీ ‘గబ్బర్‌సింగ్’ (Gabbar Singh) తరహాలో చూపించారు. ‘టెంపర్’ (Temper)లోని

Meter Teaser: నా మీటర్‌లో నేనెళ్తా.. నన్ను కెలకొద్దు.. నాకు అడ్డు రావద్దు
Kiran Abbavaram In Meter Movie

వైవిధ్యమైన కథలు, విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్‌ చేసుకున్న టాలెంటెడ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram). రీసెంట్‌గా వచ్చిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఈ యంగ్ హీరో.. ఇప్పుడు తన ‘మీటర్’ (Meter) ఏంటో చూపించేందుకు మరోసారి సిద్ధమవుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సమర్పణలో క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (Clap Entertainment) పతాకంపై చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు నిర్మిస్తున్న చిత్రం ‘మీటర్’. రమేష్ కాదూరి (Ramesh Kaduri) దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం ‘మీటర్’ టీజర్‌ (Meter Teaser)ని మేకర్స్ విడుదల చేశారు. ఎప్పటిలానే ఈ చిత్రంలో కూడా కిరణ్.. తన వైవిధ్యతను కనబరుస్తున్నాడు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కిరణ్ నటించారు.

టీజర్ విషయానికి వస్తే.. వావ్ వాట్ ఏ ఫర్ఫార్మెన్స్ అంటూ సప్తగిరి (Saptagiri) వాయిస్‌తో టీజర్ మొదలైంది. కిరణ్ అబ్బవరం ఎంట్రీ ‘గబ్బర్‌సింగ్’ (Gabbar Singh) తరహాలో చూపించారు. ‘టెంపర్’ (Temper)లోని పోసాని (Posani) పాత్రని కంటిన్యూ చేసినట్లుగా.. కిరణ్ పాత్రని పోసానితో తిట్టించిన తీరు చూస్తుంటే.. సినిమా కూడా అదే ఫ్లోలో నడిచినట్లుగా అనిపిస్తుంది. హీరోయిన్ ఎంట్రీ, ఆమెను ఆటపట్టిస్తూ హీరో చెప్పే డైలాగ్స్, డ్యాన్స్ ఆసక్తికరంగా ఉంటే.. ఆ తర్వాత టీజర్ స్వరూపమే మారిపోయింది. ‘గబ్బర్‌సింగ్’ పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)ని ఇమిటేట్ చేసినట్లుగా.. దాదాపు అదే తరహా బాడీ లాంగ్వేజ్‌ని హీరో కంటిన్యూ చేశారు. ‘నా మీటర్‌లో నేనెళ్తా.. నన్ను కెలకొద్దు.. నాకు అడ్డు రావద్దు’ అంటూ తన పై ఆఫీసర్‌కి చెప్పే డైలాగ్ అనంతరం పవర్‌ఫుల్‌గా విలన్ ఎంట్రీని చూపించారు. (Kiran Abbavaram Meter Teaser)

ఇక విలన్‌తో కిరణ్ చెప్పే డైలాగ్.. హైలెట్‌గా ఉంది. ‘బ్లాస్ట్ అయిపోవడానికి ఇది పవర్‌తో నడిచే మాములు మీటర్ అనుకున్నావా? పొగరుతో నడిచే మాస్ మీటర్.. ఆన్ అవడమే 100 మీద ఉంటది.. తొక్కు, తొక్కు, తొక్కుకుంటూ పోవడమే..’ అంటూ కిరణ్ చెప్పే డైలాగ్ ఈ టీజర్‌ని ఓ రేంజ్‌కి తీసుకెళ్లింది. మొత్తంగా అయితే పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్‌తో, యాక్షన్ సన్నివేశాలతో ఎంటర్‌టైనింగ్‌గా టీజర్‌ని కట్ చేశారు. సినిమాపై క్రేజ్ పెంచేలానే ఈ టీజర్ ఉంది. కిరణ్ అబ్బవరం కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. టీజర్‌కి ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ అనేలానే ఉంది. (Meter Teaser Report)


ఇవి కూడా చదవండి:

*********************************

*Star Producer: పాపం.. దీన స్థితిలో స్టార్ నిర్మాత.. ఆదుకున్న స్టార్ హీరో

*NBK: ఏదైనా బాలయ్య దిగనంత వరకే.. వన్స్ హి స్టెప్ ఇన్..

*Poonam Kaur: మళ్లీ చెబుతున్నా అర్థం చేసుకోండి.. వేదికపైనే కంటతడి పెట్టిన పూనమ్ కౌర్..

*Allu Sneha Reddy: ‘క్యూటీ’ అంటూ అల్లు అర్జున్ పోస్ట్.. వైరల్ అవుతోన్న పిక్

*Manchu Manoj: ఏ జన్మ పుణ్యమో నాది.. పెళ్లి తర్వాత మంచు మనోజ్ ఎవరి గురించి ఈ మాటన్నాడంటే..

Updated Date - 2023-03-07T18:22:26+05:30 IST