SPY: నిఖిల్ ‘స్పై’ టీజర్‌ని ఎక్కడ విడుదల చేస్తున్నారో తెలుసా?

ABN , First Publish Date - 2023-05-12T22:49:51+05:30 IST

తుమ్ ముజే ఖూన్ దో, మై తుమ్హే ఆజాదీ దూంగా (మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను) అని నినాదం ఇచ్చిన సుభాష్ చంద్రబోస్ (Subhash Chandrabose) యొక్క రహస్యాల ఆధారంగా

SPY: నిఖిల్ ‘స్పై’ టీజర్‌ని ఎక్కడ విడుదల చేస్తున్నారో తెలుసా?
Nikhil Siddhartha in Spy

నిఖిల్ (Nikhil) పాన్-ఇండియన్ మూవీ, నేషనల్ థ్రిల్లర్ ‘స్పై’ (Spy). తుమ్ ముజే ఖూన్ దో, మై తుమ్హే ఆజాదీ దూంగా (మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను) అని నినాదం ఇచ్చిన సుభాష్ చంద్రబోస్ (Subhash Chandrabose) యొక్క రహస్యాల ఆధారంగా రూపొందించబడిందని మేకర్స్ ఇటీవల విడుదల చేసిన వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఢిల్లీ (Delhi)లో చారిత్రాత్మక ఈవెంట్ చోటు చేసుకోనుంది. ‘స్పై’ టీజర్ మే 15న కర్తవ్య పథ్(రాజ్ పాత్)లో (Spy teaser drops on 15th May at Kartavya Path(Raj Path)) విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ ఐకానిక్ ల్యాండ్‌ మార్క్‌‌లో మూవీ టీజర్ లాంచ్ కావడం ఇదే తొలిసారి. కౌంట్‌ డౌన్ ఇప్పుడు ప్రారంభమవుతున్నందున మీ క్యాలెండ‌లను మార్క్ చేసుకోండి.. అందరితో పంచుకోండి. అద్భుతమైన ఘట్టం ఒకటి తెరపైకి రాబోతోందని అందరికీ తెలియజేయండి.. అంటూ ‘స్పై’ మేకర్స్ (Spy Makers) హడావుడి మొదలెట్టారు. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ (Garry BH) దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఈడీ ఎంటర్‌‌టైన్‌‌మెంట్స్‌పై కె రాజశేఖర్ రెడ్డి, సిఇఓ గా చరణ్ తేజ్ ఉప్పలపాటి నిర్మించారు. (Spy Teaser Release Update)

నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) కథానాయికగా నటిస్తుండగా, సన్యా ఠాకూర్ (Sanya Thakur) సెకండ్ ఫిమేల్ లీడ్‌లో పవర్‌ఫుల్ రోల్ పోషిస్తోంది. ఆర్యన్ రాజేష్ (Aryan Rajesh) తన కమ్ బ్యాక్‌లో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి కథను అందించారు. ఈ కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ ‘స్పై’ థ్రిల్లర్‌‌ను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో జూన్ 29న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ‘కార్తికేయ2’ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తనకు మంచి పేరు తెచ్చే చిత్రంగా ఈ ‘స్పై’ ఉంటుందని హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddhartha) కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి చదవండి:

************************************************

*Ileana: బంప్ అలెర్ట్.. అంటూ ఇలియానా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

*Anandhi: ‘కయల్‌’ ఆనంది డబుల్‌ ధమకా

*Liger: ఆగని వివాదం.. ధర్నాకు దిగిన బాధితులు.. ఛార్మీ సమాధానమిదే!

*Shaakuntalam: చెప్పిన టైమ్ కంటే ఒక రోజు ముందే.. ఓటీటీలోకి వచ్చేసింది

*Naresh: ట్రైలర్.. జస్ట్ మచ్చు తునక మాత్రమే! నా బయోపిక్ కాదు

*Harish Shankar: అప్పుడు 10 ఏళ్ల ఆకలి.. ఇప్పుడు ఇది నా 11 ఏళ్ల ఆకలి

*Ustaad Bhagat Singh: ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది

*Poonam Kaur: ‘ఉస్తాద్’‌ని కెలికిన పూనమ్ కౌర్.. ఉగ్రరూపం ప్రదర్శిస్తోన్న ఫ్యాన్స్

Updated Date - 2023-05-12T22:49:51+05:30 IST