Harish Shankar: అప్పుడు 10 ఏళ్ల ఆకలి.. ఇప్పుడు ఇది నా 11 ఏళ్ల ఆకలి

ABN , First Publish Date - 2023-05-11T19:34:47+05:30 IST

తాజాగా ఈ సినిమా నుంచి మాసివ్ ఫస్ట్ గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అభిమానుల సమక్షంలో హైదరాబాద్ సంధ్య 35 MM పండుగలా జరిగిన ఈ వేడుకలో

Harish Shankar: అప్పుడు 10 ఏళ్ల ఆకలి.. ఇప్పుడు ఇది నా 11 ఏళ్ల ఆకలి
Harish Shankar

‘ఈసారి కేవలం వినోదం మాత్రమే కాదు’ అంటూ ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh)ని మించిన సంచలన విజయాన్ని అందుకోవడానికి పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్‌ల ద్వయం సిద్ధమవుతోంది. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి కాగా.. రెండో షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కాబోతోంది. అలాగే మరోవైపు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి మాసివ్ ఫస్ట్ గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అభిమానుల సమక్షంలో హైదరాబాద్ సంధ్య 35 MM పండుగలా జరిగిన ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ వీరాభిమాని సతీష్ కోట (Satish Kota) చేతుల మీదుగా గ్లింప్స్‌ను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు హరీష్ శంకర్ (Director Harish Shankar) మాట్లాడుతూ.. ‘‘పవన్ కల్యాణ్‌తో చేసిన ‘గబ్బర్ సింగ్’ మన పదేళ్ల ఆకలి తీరిస్తే.. ఆ సినిమా నుంచి ఈ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వరకు ఇది నా 11 ఏళ్ల ఆకలి. ఈ క్షణం కోసం 11 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. అందుకే ఈ ఎగ్జైట్‌మెంట్‌ని ఫ్యాన్స్‌తో పంచుకోవాలని, మీ సమక్షంలో గ్లింప్స్‌ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత నవీన్ యెర్నేని, దర్శకులు దశరథ్, చంద్రమోహన్, నిర్మాత ఎస్.కె.ఎన్ తదితరులు పాల్గొన్నారు.

Ustaad-Bhagat-Singh.jpg

‘గబ్బర్ సింగ్’ విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ అభిమానులు (Pawan Kalyan Fans) మాత్రమే కాదు.. తెలుగు సినీ ప్రియులు సైతం ఆ సినిమా ప్రభంజనాన్ని అంత తేలికగా మర్చిపోలేరు. అందుకే వీరి కలయికలో రెండో సినిమాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రకటన రాగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. దానికితోడు ‘గబ్బర్ సింగ్’ సెంటిమెంట్‌ని పాటిస్తూ ఆ సినిమా విడుదలైన తేదీ మే 11‌కే ఉస్తాద్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల కావడం మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఇప్పుడీ గ్లింప్స్ భారీ స్పందనను రాబట్టుకుంటూ.. ఇప్పటి వరకు ఉన్న రికార్డులను ఊచకోత కోస్తోంది. ఈ గ్లింప్స్ విడుదల సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు పండగ వాతావరణాన్ని సృష్టించారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Ustaad Bhagat Singh: ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది

*Poonam Kaur: ‘ఉస్తాద్’‌ని కెలికిన పూనమ్ కౌర్.. ఉగ్రరూపం ప్రదర్శిస్తోన్న ఫ్యాన్స్

*Allu Arjun: 30 ఏళ్ల తర్వాత సడెన్‌గా ఆమెని చూసి షాకైన బన్నీ.. ఆమె ఎవరో తెలుసా?

*Kushboo: పెళ్ళి కోసం నేను మతం మారలేదు.. ‘కేరళ స్టోరీ’ విమర్శలపై ధీటైన సమాధానం

*NBK108: బ్రహ్మాజీకి కోపం వచ్చింది.. అందుకే డైరెక్టర్‌కి నమస్తే పెట్టేశాడు

*Aadi Saikumar: ఆది సినిమా.. ఒకటి కాదు.. రెండు ఓటీటీల్లో..

*Vijayashanthi: ఆ హక్కు ఎవరికుంది?.. ‘ది కేరళ స్టోరీ’ బ్యాన్‌పై సంచలన వ్యాఖ్యలు

Updated Date - 2023-05-11T19:34:47+05:30 IST