Ileana: బంప్ అలెర్ట్.. అంటూ ఇలియానా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ

ABN , First Publish Date - 2023-05-12T22:25:45+05:30 IST

ఇప్పటి వరకు ప్రెగ్నెన్నీ (Pregnancy) అని చెప్పడం.. ఆ తర్వాత బేబీ బంప్ అంటూ ప్రీ లుక్ తప్పితే.. క్లారిటీగా మాత్రం ఇలియానా కనిపించలేదు. తాజా ఫొటోలతో మాత్రం ఇలియానా

Ileana: బంప్ అలెర్ట్.. అంటూ ఇలియానా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ
Ileana Baby Bump Photos

గోవా బ్యూటీ ఇలియానా (Ileana) పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ మధ్య బాయ్‌ ఫ్రెండ్ (Boy Friend) విషయంలో.. ఇప్పుడు బేబీ బంప్‌ (Baby Bump)తో ఇలియానా సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తోంది. తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా బేబీ బంప్‌తో ఉన్న కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇప్పటి వరకు ప్రెగ్నెన్నీ (Pregnancy) అని చెప్పడం.. ఆ తర్వాత బేబీ బంప్ అంటూ ప్రీ లుక్ తప్పితే.. క్లారిటీగా మాత్రం ఇలియానా కనిపించలేదు. తాజా ఫొటోలతో మాత్రం ఇలియానా ఫుల్‌ క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Ileana Baby Bump Photos)

అయితే అందరిలానే ఇలియానా కూడా ప్రెగ్నెన్సీ పొంది ఉంటే.. ఇంత రచ్చ అయ్యేదే కాదు. ఆమెకు ఇంకా పెళ్లి కాలేదనే విషయం అందరికీ తెలిసిందే. పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ అని చెప్పడంతో.. అంతా షాకయ్యారు. ఏదో జోక్ చేస్తుందేమోలే అని ముందంతా అనుకున్నారు. కట్ చేస్తే.. బేబీ బంప్ అంటూ మరో షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా ఫుల్ పిక్చర్ చూపించేసింది. ఇక ఆమె ప్రెగ్నెన్సీపై డౌట్స్ అవసరం లేదు కానీ.. అందుకు కారణం ఎవరనేదే.. ఆమె నుంచి తెలుసుకోవాల్సిన ప్రశ్న. మరి దీనిపై ఇల్లీ బేబీ ఎప్పటికి క్లారిటీ ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది. (Ileana DCruz)

Illi-Baby.jpg

ఇలియానా విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె టాలీవుడ్‌ (Tollywood)కి దూరంగా ఉన్నప్పటికీ.. ఒకప్పుడు మాత్రం టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా, టాప్ హీరోయిన్‌గా చక్రం తిప్పింది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరి హీరోలతో ఆడిపాడింది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగా.. బాలీవుడ్ బాట పట్టి చేతులు కాల్చుకుంది. ఆ తర్వాత ఓ ఫొటో గ్రాఫర్ ప్రేమలో పడి.. అదే ప్రపంచం అన్నట్లుగా విహరించింది. ఇప్పుడా ఫొటోగ్రాఫర్ కూడా ఆమె పక్కన లేడు. బాలీవుడ్‌కి చెందిన ఓ స్టార్ హీరోయిన్ సోదరుడితో ప్రస్తుతం ఆమె ప్రేమలో ఉందని, ప్రస్తుతం ఆమె ప్రెగ్నెన్సీకి కూడా కారణం అతనే అనేలా వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి కానీ.. సరైన క్లారిటీ మాత్రం లేదు. (Ileana Pregnancy)


ఇవి చదవండి:

************************************************

*Anandhi: ‘కయల్‌’ ఆనంది డబుల్‌ ధమకా

*Liger: ఆగని వివాదం.. ధర్నాకు దిగిన బాధితులు.. ఛార్మీ సమాధానమిదే!

*Shaakuntalam: చెప్పిన టైమ్ కంటే ఒక రోజు ముందే.. ఓటీటీలోకి వచ్చేసింది

*Naresh: ట్రైలర్.. జస్ట్ మచ్చు తునక మాత్రమే! నా బయోపిక్ కాదు

*Harish Shankar: అప్పుడు 10 ఏళ్ల ఆకలి.. ఇప్పుడు ఇది నా 11 ఏళ్ల ఆకలి

*Ustaad Bhagat Singh: ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది

*Poonam Kaur: ‘ఉస్తాద్’‌ని కెలికిన పూనమ్ కౌర్.. ఉగ్రరూపం ప్రదర్శిస్తోన్న ఫ్యాన్స్

*Allu Arjun: 30 ఏళ్ల తర్వాత సడెన్‌గా ఆమెని చూసి షాకైన బన్నీ.. ఆమె ఎవరో తెలుసా?

Updated Date - 2023-05-12T22:25:45+05:30 IST