Nupur Sanon: సౌత్ సినీ ఎంట్రీ.. మా అక్క కృతి సనన్ ఏమని సలహా ఇచ్చిందంటే..

ABN , First Publish Date - 2023-10-11T20:54:26+05:30 IST

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ నిర్మాత అభిషేక్ అగర్వాల్‌ల క్రేజీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ సరసన నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 20న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ నూపుర్ సనన్ చిత్ర విశేషాలను మీడియాకు తెలిపారు.

Nupur Sanon: సౌత్ సినీ ఎంట్రీ.. మా అక్క కృతి సనన్ ఏమని సలహా ఇచ్చిందంటే..
Nupur Sanon

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), దర్శకుడు వంశీ (Vamsee), అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ (Abhishek Agarwal Arts) నిర్మాత అభిషేక్ అగర్వాల్‌ల క్రేజీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao). తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన నూపుర్ సనన్ (Nupur Sanon), గాయత్రి భరద్వాజ్ (Gayathri Bharadwaj) హీరోయిన్లుగా నటించారు. గ్రిప్పింగ్ టీజర్, మ్యాసివ్ ట్రైలర్, చార్ట్‌బస్టర్ పాటలతో టైగర్ ఇప్పటికే నేషనల్ వైడ్‌గా హ్యూజ్ బజ్‌ను క్రియేట్ చేస్తుంది. అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోన్న నేపధ్యంలో హీరోయిన్ నూపుర్ సనన్ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.

‘టైగర్ నాగేశ్వరరావు’లో మీ పాత్ర ఎలా ఉంటుంది?

‘టైగర్ నాగేశ్వరరావు’లో నా పాత్ర పేరు సార. మార్వాడీ అమ్మాయి. తనది సోల్ ఫుల్ క్యారెక్టర్. తను ఎవరినైనా ప్రేమిస్తే వారి కోసం ఏదైనా చేసే అమ్మాయి. ఇది నా మొదటి సినిమా. నా పాత్ర కమర్షియల్‌గా ఉంటూనే పెర్ఫార్మెన్స్ కూడా స్కోప్ ఉన్న రోల్. మొదటి సినిమాకే ఇలాంటి ఛాలెంజింగ్ పాత్ర దొరకడం ఆనందంగా వుంది.

ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.. ఈ సినిమా చేయడానికి కారణం?

మొదటిది.. మాస్ మహారాజా రవితేజ‌గారు. ఆయన సినిమాలో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. రెండోది.. అభిషేక్ అగర్వాల్ ప్రొడక్షన్. ఇప్పటికే ది కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ2 వంటి పాన్ ఇండియా విజయాలు ఇచ్చారు. ఇది నాకు మంచి లాంచింగ్ ప్రాజెక్ట్ అవుతుందని భావించాను. అలాగే దర్శకుడు వంశీ గారు. ఈ పాత్ర కోసం దాదాపు 200 మందిని ఆడిషన్స్ చేశారని తెలిసింది. ఈ పాత్రకు నేను యాప్ట్‌గా వుంటానని ఆయన బిలీవ్ చేయడం నాకు చాలా నమ్మకాన్ని ఇచ్చింది. (Nupur Sanon About TNR)


Nupur-2.jpg

ఇది పీరియడ్ సినిమా కదా.. ఈ పాత్ర కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు?

దర్శకుడు వంశీగారు ఈ కథపై దాదాపు మూడేళ్ళు రీసెర్చ్ చేశారు. ఏ పాత్ర ఎలా ఉండాలో ఆయనకి చాలా క్లారిటీ వుంది. హీరోయిన్ హెయిర్ బ్యాండ్ ఎలా ఉండాలో కూడా క్లియర్‌గా రాసుకున్నారు. ఆయన చెప్పినట్లుగా నటించాను.

రవితేజ సినిమాలు చూశారా? ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

దాదాపు అన్నీ సినిమాలు చూశాను. రవితేజగారు ఒరిజినల్ విక్రమ్ రాథోడ్. రవితేజ యాక్టింగ్ అమేజింగ్. ఆయన కామిక్ టైమింగ్ అద్భుతంగా వుంటుంది. మాస్ మహారాజా టైటిల్ రవితేజ గారికి యాప్ట్. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఆయన హిందీ చాలా అద్భుతంగా వుంటుంది. షూటింగ్‌లో చాలా సపోర్ట్ చేశారు. ఆయన వలన లాగ్వేంజ్ బారియర్ తొలిగిపోయింది. (Nupur Sanon Interview)

మీ సోదరి కృతిసనన్ నుంచి ఎలాంటి సలహాలు తీసుకున్నారు?

తన జర్నీ కూడా తెలుగు నుంచి ప్రారంభమైయింది. మా ఇద్దరి అభిరుచులు వేరుగా ఉంటాయి. తను నాకు ఇచ్చిన ఒకే ఒక సలహా.. ‘నువ్వు నీలా వుండు’ అని చెప్పింది. నేను కూడా అదే ఫాలో అవుతాను.


Nupur-1.jpg

సౌత్ సినీ పరిశ్రమ ఎలా అనిపించింది?

సౌత్ ఇండస్ట్రీ చాలా ఆర్గనైజ్‌గా వుంటుందని విన్నాను. ఈ సినిమాతో ప్రత్యక్షంగా చూశాను. చాలా గౌరవంగా మర్యాదగా చూసుకున్నారు. చాలా సపోర్ట్ చేశారు. అలాగే టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్ వుంటారు ఇక్కడ. మధి గారు, జీవి ప్రకాష్‌గారు బ్రిలియంట్ వర్క్ ఇచ్చారు. (Heroine Nupur Sanon)

మీకు ఇష్టమైన హీరోయిన్స్ ఎవరు?

సాయి పల్లవి అంటే చాలా ఇష్టం. ఫిదా చూసి ఫిదా అయిపోయాను. అలాగే అనుష్క శెట్టి, కీర్తి సురేష్ అంటే కూడా ఇష్టం.

టాలీవుడ్‌లో ఇష్టమైన హీరోలు?

నాని గారు అంటే ఇష్టం. అలాగే రామ్ పోతినేని, విశ్వక్ సేన్ కూడా ఇష్టం.

భవిష్యత్‌లో ఎలాంటి పాత్రలు చేయాలని వుంది?

అన్ని రకాల పాత్రలు చేయాలని వుంది. అలాగే ఒక బలమైన ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా చేయాలని వుంది. ప్రస్తుతం నవాజుద్దీన్ సిద్ధిఖీతో ఓ సినిమా చేస్తున్నాను.

Nupur-3.jpg


ఇవి కూడా చదవండి:

============================

*God: జయం రవి, నయనతారల క్రైమ్ థ్రిల్లర్ రెడీ టు రిలీజ్

*********************************

*Producers: నిర్మాతలూ.. మీకు ఈ రైట్స్ గురించి తెలుసా? తెలియకపోతే..

************************************

*University: ఆర్ నారాయణ మూర్తి ‘యూనివర్సిటీ’కి అంతా క్లియర్.. ప్రముఖులకు ప్రివ్యూ

**********************************

*Kalki2898AD: బర్త్‌డే స్పెషల్‌గా అమితాబ్ లుక్ విడుదల.. ట్రెండ్ బద్దలవుతోంది

**********************************

*Bubblegum Teaser: ఆ కిస్సులేంటి? ఆ డైలాగ్స్ ఏంటి? రోషన్ కనకాల రొమాన్స్ అరాచకం అంతే..

***********************************

Updated Date - 2023-10-11T20:54:26+05:30 IST