Aadikeshava: వైష్ణవ్ తేజ్‌కు శ్రీలీల బుజ్జి బంగారమట.. ఇద్దరూ ఇరగేశారు

ABN , First Publish Date - 2023-10-11T21:28:36+05:30 IST

పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా.. పూర్తి ఫ్యామిలీ మరియు యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘ఆదికేశవ’. టాలీవుడ్ అగ్రగామి సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘సిత్తరాల సిత్రావతి’ అనే పాట మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ‘హే బుజ్జి బంగారం’ అనే మెలోడీని చిత్రయూనిట్ విడుదల చేసింది.

Aadikeshava: వైష్ణవ్ తేజ్‌కు శ్రీలీల బుజ్జి బంగారమట.. ఇద్దరూ ఇరగేశారు
Panja Vaisshnav Tej and Sreeleela

పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej), శ్రీలీల (Sreeleela) జంటగా.. పూర్తి ఫ్యామిలీ మరియు యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘ఆదికేశవ’ (Aadikeshava). టాలీవుడ్ అగ్రగామి సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాతో పంజా వైష్ణవ్ తేజ్‌ మొదటిసారి యాక్షన్ ఫిల్మ్‌లో నటిస్తుండటం విశేషం. ఇటీవల ‘మ్యాడ్’ (Mad)తో బ్లాక్ బస్టర్ అందుకున్న సితార.. దీపావళికి ఆదికేశవతో ఆ విజయపరంపరను కొనసాగించాలని చూస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదికేశవ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘హే బుజ్జి బంగారం’ (Hey Bujji Bangaram) అనే మెలోడీని చిత్రయూనిట్ విడుదల చేసింది.

Sreeleela-1.jpg

జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘సిత్తరాల సిత్రావతి’ అనే పాట మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఆ పాటలో శ్రీలీల, పంజా వైష్ణవ్ తేజ్ డ్యాన్స్ మూమెంట్స్ అందరినీ అలరించాయి. ఇప్పుడు విడుదలైన ‘హే బుజ్జి బంగారం’ పాట అబ్బాయి ప్రేమను తెలుపుతూ సాగింది. ముఖ్యంగా మంచి సాహిత్యం ఈ పాటకు కుదిరింది. ఈ సంవత్సరం ప్రతి రొమాంటిక్ ప్లే లిస్టులో ఈ పాటను భాగం చేసేలా సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి ఎంతో అర్థవంతమైన, అద్భుతమైన సాహిత్యాన్ని ఈ పాటకు అందించారు. జి.వి.ప్రకాష్ సంగీతం ఈ రొమాంటిక్ పాటకి ఓ కొత్త అనుభూతిని జోడించింది. అర్మాన్ మాలిక్, యామిని ఘంటసాల ఈ పాటను ఆలపించారు. శ్రీలీల, వైష్ణవ్ తేజ్‌ల మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. మరోసారి ఇద్దరూ డ్యాన్స్ మూమెంట్స్‌ని ఇరగేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (Hey Bujji Bangaram Song From Aadikeshava Out)


Sreeleela-2.jpg

‘ఆదికేశవ’ (Aadikeshava Movie) టీమ్ ఈ చిత్ర విజయం పట్ల చాలా నమ్మకంగా ఉంది. పాటలు, టీజర్‌ల ద్వారా ప్రేక్షకులలో ఏర్పడిన అంచనాలు, ఆసక్తి ఈ చిత్రానికి ఘన విజయాన్ని అందిస్తాయని చిత్ర బృందం ఆశిస్తోంది. జోజు జార్జ్, అపర్ణా దాస్ ఈ సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని నవంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Nupur Sanon: సౌత్ సినీ ఎంట్రీ.. మా అక్క కృతి సనన్ ఏమని సలహా ఇచ్చిందంటే..

*********************************

*God: జయం రవి, నయనతారల క్రైమ్ థ్రిల్లర్ రెడీ టు రిలీజ్

*********************************

*Producers: నిర్మాతలూ.. మీకు ఈ రైట్స్ గురించి తెలుసా? తెలియకపోతే..

************************************

*University: ఆర్ నారాయణ మూర్తి ‘యూనివర్సిటీ’కి అంతా క్లియర్.. ప్రముఖులకు ప్రివ్యూ

**********************************

*Kalki2898AD: బర్త్‌డే స్పెషల్‌గా అమితాబ్ లుక్ విడుదల.. ట్రెండ్ బద్దలవుతోంది

**********************************

Updated Date - 2023-10-11T21:28:36+05:30 IST