సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Dasara: ‘దసరా’ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే..?

ABN, First Publish Date - 2023-03-17T19:33:32+05:30

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) మొదటి పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ (Dasara). మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి

Dasara Movie Still
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) మొదటి పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ (Dasara). మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రతీది.. సినిమాపై భారీగా అంచనాలను పెంచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ (SLV Cinemas) పతాకంపై నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల (Srikanth Odela) దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ఈ సినిమాని నిర్మించారు. సెన్సార్ ఫార్మాలిటీస్‌ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి.. సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికెట్‌ను జారీ చేసింది.

అలాగే సినిమా రన్ టైమ్ కూడా 2 గంటల 36 నిమిషాల నిడివికి లాక్ చేశారు (Dasara Movie Run Time). ఇలాంటి జానర్‌ సినిమాలకు ఇది పర్ఫెక్ట్ రన్‌టైమ్ అని చెప్పుకోవచ్చు. ఒక మంచి కథను భారీ స్పాన్‌తో చెప్పారు. ఇందులో పల్లెటూరి స్నేహితుల మధ్య అందమైన బాండింగ్, రస్టిక్ లవ్ స్టొరీ, మునుపెన్నడూ లేని విధంగా యాక్షన్, అందరినీ కదిలించేలా భావోద్వేగాలు ఉన్నాయని.. పాన్ ఇండియాకి పర్ఫెక్ట్ సినిమా ఇదని సెన్సార్ సభ్యులు ప్రశంసలు కురిపించినట్లుగా సమాచారం. సెన్సార్ సభ్యుల స్పందనతో చిత్రయూనిట్ కూడా సంతోషాన్ని వ్యక్తం చేసింది. (Dasara Censor Talk)

ఇందులో డి-గ్లామరస్‌గా కనిపించే ఛాలెంజింగ్ పాత్రను నాని (Nani) పోషించారు. అలాగే వెన్నెలగా కీర్తి సురేష్ (Keerthi Suresh) కూడా దాదాపు అదే తరహా పాత్రని పోషించింది. నాని స్నేహితుడిగా దీక్షిత్ శెట్టి (Deekshit Shetty) కనిపించనున్నారు. పరిస్థితులకు అనుగుణంగా భిన్నంగా ప్రవర్తించే అనూహ్య పాత్రలో ధరణి (Dharani)గా నాని కనిపిస్తారు. అతని పవర్-ప్యాక్డ్ షో సినిమా ప్రేక్షకులను అద్భుతంగా ఎంటర్‌టైన్ చేస్తుంది. సముద్రఖని (Samuthirakani) పాత్ర కూడా కీలకంగా ఉండబోతోంది.

నిజానికి సినిమాలోని ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉండేలా దర్శకుడు తెరకెక్కించారు. అలాగే సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ, సంతోష్ నారాయణన్ (Santhosh Narayanan) మ్యూజిక్ మాయాజాలంతో సన్నివేశాలను మరో స్థాయికి ఎలివేట్ చేశారు. సాంకేతిక నిపుణులందరూ అత్యద్భుతమైన వర్క్ కనబరిచారని నిర్మాత సుధాకర్ చెరుకూరి పేర్కొన్నారు. మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా భారీగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*Shruti Haasan: సిల్లీ క్వశ్చన్ అడగమంటే.. శృతిని అలాంటి ప్రశ్నేనా అడిగేది?

*Pavitra Lokesh: పెద్ద బాంబ్ పేల్చిన పవిత్రా లోకేష్ మొదటి భర్త.. పాపం నరేష్..?

*Kantara: ఆస్కార్‌తో ‘ఆర్ఆర్ఆర్’‌ చరిత్ర సృష్టించింది.. ఇక ‘కాంతార’ వంతు!

*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

*Ram Gopal Varma: డిగ్రీ పట్టాని అలా వదిలేశాడేంటి? 37 ఏళ్ళ తర్వాత..

*VBVK: ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

*RGV: స్వర్గంలో వాళ్లుంటారనే అపోహ వద్దు.. ఆ పని ఇప్పుడే చేయండి

*Richa Panai: అవకాశాలు లేక ఈ భామ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

*SS Rajamouli: జక్కన్న మంట పుట్టించాడు.. ఈ పిక్‌కి అర్థం అదేనా?

Updated Date - 2023-03-17T19:38:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!