Custody Teaser: చైతూ ‘కస్టడీ’ టీజర్ విడుదల ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2023-03-13T20:52:30+05:30 IST

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya Akkineni), వెంకట్ ప్రభు (Venkat Prabhu) కాంబినేషన్‌లో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందుతోన్న చిత్రం ‘కస్టడీ’ (Custody). ఇప్పటికే ప్రొడక్షన్ ఫార్మాలిటీస్

Custody Teaser: చైతూ ‘కస్టడీ’ టీజర్ విడుదల ఎప్పుడంటే?
Naga Chaitanya in Custody

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya Akkineni), వెంకట్ ప్రభు (Venkat Prabhu) కాంబినేషన్‌లో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందుతోన్న చిత్రం ‘కస్టడీ’ (Custody). ఇప్పటికే ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ క్రమంలో మేకర్స్ టీజర్‌ను విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు (Custody Teaser Release Date). మార్చి 16న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

అంతేకాదు, టీజర్ తేదీని అనౌన్స్ చేయడానికి, టీజర్‌పై ఆసక్తిని పెంచడానికి ఉద్దేశించిన టీజర్ టీజ్‌ (teaser tease)ని తాజాగా మేకర్స్ విడదల చేశారు. నదిలో జైలు.. ఆ జైలు నుంచి తనని తాను విడిపించుకొని బయటికి వస్తున్న నాగచైతన్య వీడియో చాలా క్యురియాసిటీని పెంచింది. ఈ టీజ్ వీడియోలో నాగచైతన్య ఖాకీ యూనిఫామ్‌లో కనిపించారు. నాగచైతన్య కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఈ ‘కస్టడీ’ ఒకటి. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ (Srinivasaa Silver Screen) బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి (Srinivasaa Chitturi) నిర్మిస్తున్నారు. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా రూపొందుతోంది.

నాగ చైతన్య సరసన కృతి శెట్టి (Krithi Shetty) కథానాయికగా నటిస్తుండగా, అరవింద్ స్వామి (Arvind Swami) కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రియమణి (Priyamani) పవర్ ఫుల్ పాత్రలో నటిస్తోంది. తమిళ నటుడు శరత్‌కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్‌జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్‌ సమర్పిస్తుండగా.. మాస్ట్రో ఇళయరాజా (Maestro Ilaiyaraaja), లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా (Little Maestro Yuvan Shankar Raja) కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 12 మే, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ చిత్రం విడుదల కానుంది.


ఇవి కూడా చదవండి:

*********************************

*Oscar to RRR: తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి స్పందనిదే..

*Ram Charan: ఉపాసనని, ఆమె మెడలోని నగని కాపాడుకోవాలి

*Talasani: ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్.. BJP ప్రభుత్వానికి ఇది గుణపాఠం

*SS Rajamouli: జక్కన్న మంట పుట్టించాడు.. ఈ పిక్‌కి అర్థం అదేనా?

* Harish Shankar: పెరుగన్నం, బిర్యానీ.. దర్శకుడు మహాకు కౌంటర్

*Pavitra Naresh: బ్యాచ్‌లర్స్ ఫీల్ కాకండి.. ఈ మీమ్స్ ఏంటి సామి?

*Ram Charan: మా నాన్న పెంపకం అలాంటిది.. ఆసక్తికర విషయాలు చెప్పిన చరణ్

*Radha Nair: తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసమో.. మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసమో?

*Jr NTR: ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ సైడ్ యాక్టరా? ఇలా అవమానించారేంటి?

Updated Date - 2023-03-13T20:52:31+05:30 IST