Ravi Teja: పెయింటరా? లేక పత్తి పండించే రైతా?.. మాస్ రాజా ఖాతాలో మరొకటి!

ABN , First Publish Date - 2023-06-12T19:26:45+05:30 IST

సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా.. వరసబెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఇప్పటికే రెండు మూడు సినిమాలు సెట్స్‌పై ఉండగా.. తాజాగా మరో సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ని మేకర్స్ వదిలారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కుతోన్న చిత్రానికి ‘ఈగల్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

Ravi Teja: పెయింటరా? లేక పత్తి పండించే రైతా?.. మాస్ రాజా ఖాతాలో మరొకటి!
Ravi Teja in Eagle Movie

సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా.. వరసబెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja). ఇప్పటికే రెండు మూడు సినిమాలు సెట్స్‌పై ఉండగా.. తాజాగా మరో సినిమాతో మాస్ సందడికి సిద్ధమవుతున్నట్లుగా రవితేజ నుంచి ప్రకటన వచ్చేసింది. రీసెంట్‌గా రవితేజ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) నిర్మాణంలో వచ్చిన ‘ధమాకా’ (Dhamaka) చిత్రం ఎటువంటి విజయాన్ని అందుకుందో తెలియంది కాదు. రవితేజ (Ravi Teja) కెరీర్‌లో బిగ్గెస్ట్ సోలో హిట్‌ చిత్రంగా అది నిలిచింది. ఆ సినిమా తర్వాత.. సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamneni) దర్శకత్వంలో చేయబోతున్న మాసీవ్ ప్రాజెక్ట్ కోసం రవితేజ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్‌తో మళ్లీ కలిసి పని చేస్తున్నారు. ఈ కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమాకు సంబంధించిన టైటిల్‌ను.. అలాగే టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు ‘ఈగల్’ (Eagle) అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

Anupama.jpg

టైటిల్‌తో పాటు విడుదల చేసిన గ్లింప్స్‌లో.. ‘‘రవితేజ మోస్ట్ వాంటెడ్ పెయింటర్. అతన్ని పట్టుకోవడానికి ‘రా’ ఏజెన్సీ వెదుకుతుంటుంది. ఇంతలో ఓ వ్యక్తి.. అతను పెయింటర్ కాదు.. పత్తి పండించే రైతు అని చెబుతాడు. తనకి ఇంకొన్ని అవతారాలు కూడా ఉన్నాయంటూ.. అనుపమ పరమేశ్వరన్ చెప్పే డైలాగ్‌తో అర్థమవుతుంది. చివరగా రవితేజ ఒక సరస్సు దగ్గర నిలబడి పాక్షికంగా తన ముఖాన్ని చూపించారు. ఆ తర్వాత ‘ఈగల్’ అనే టైటిల్‌ని రివీల్ చేశారు. టైటిల్ స్ట్రైకింగ్‌గా వుంది. ముఖ్యంగా రవితేజ కెరీర్‌లో మరో విభిన్నమైన చిత్రంగా ఈ ‘ఈగల్’ ఉండబోతుందనే సంకేతాలను ఈ గ్లింప్స్ (Eagle Glimpse) కలిగిస్తోంది.

Ravi-Teja.jpg

ఇందులో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran), నవదీప్, మధుబాల, అవసరాల శ్రీనివాస్ వంటి ప్రముఖ తారాగణం నటిస్తున్నట్లుగా గ్లింప్స్‌లో వారికి కూడా ప్లేస్ కల్పించారు. కావ్యా థాపర్‌ మరో కథానాయిక నటిస్తోంది. కాగా.. కార్తీక్ ఘట్టమనేని రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిబాబు కరణంతో పాటు దర్శకుడు స్వయంగా స్క్రీన్‌ప్లే రాశారు. టీజీ విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల (Vivek Kuchibhotla) సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. గ్లింప్స్ ద్వారా నిర్మాతలు ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి దవ్‌జాంద్ (Davzand) సంగీతం అందిస్తున్నారు.

Eagle.jpg


ఇవి కూడా చదవండి:

************************************************

*Ileana: నా కన్నీళ్లు తుడిచాడు.. తన ప్రియుడిపై ఇలియానా ఆసక్తికరమైన వ్యాఖ్యలు

**************************************************************************

*Gopichand: ‘రామబాణం’ తర్వాత మరో పవర్‌ఫుల్ టైటిల్‌తో.. ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల

*********************************************************************

*Sreeleela: నిర్మాతలకు ‘నో’ చెబుతున్న శ్రీలీల

*****************************************************************

*Samantha: క్లబ్‌లో బీర్ కొడుతూ.. ‘ఊ అంటావా మావ’ పాటకి నాటు నాటు స్టెప్స్.. వీడియో వైరల్


*************************************************************

*VarunLav: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్ ఫొటోలు

***********************************

*Sharwa-Rakshita: శర్వానంద్, రక్షితల వెడ్డింగ్ రిసెప్షన్‌లో సెలబ్రిటీల సందడి

********************************************************

Updated Date - 2023-06-12T19:26:45+05:30 IST