Ileana: నా కన్నీళ్లు తుడిచాడు.. తన ప్రియుడిపై ఇలియానా ఆసక్తికరమైన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-06-12T18:18:00+05:30 IST

ఈమధ్య కొన్ని కష్టమైన రోజులు గడిచాయి. ఆ పరిస్థితులు నన్ను గందరగోళానికి గురి చేశాయి. అయితే వాటి నుంచి నేను క్రమంగా బయటపడ్డా. ఆ క్షణంలో తను నా చెంత ఉన్నాడు, నా కన్నీళ్లు తుడిచాడు, నా జీవితంలో చిరునవ్వులు పూయించాడు అంటూ సోషల్ మీడియా వేదికగా ఇలియానా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Ileana: నా కన్నీళ్లు తుడిచాడు.. తన ప్రియుడిపై ఇలియానా ఆసక్తికరమైన వ్యాఖ్యలు
Heroine IleanaDCruz

‘అమ్మ’ (Mother) పదవి ఆడవాళ్లకు మాత్రమే దక్కే అదృష్టం. గర్భం దాల్చిన దగ్గర్నుంచి, ఓ బిడ్డకు జన్మనిచ్చేంత వరకూ ఉండే దశ... ఓ అపురూపమైన ప్రయాణం. అదెలా ఉంటుందో మాటల్లో చెప్పలేనంటోంది ఇలియానా (Ileana DCruz). ఎందుకంటే ఇప్పుడు తను కూడా ఓ బిడ్డకు తల్లికాబోతోంది. ఈ విషయాన్ని ఇటీవలే సోషల్‌ మీడియా ద్వారా తెలియపరిచింది. అంతేకాదు, బేబీ బంప్‌ (Ileana Baby Bump)తో ఉన్న ఓ ఫొటోని కూడా ఇప్పటికే ఇలియానా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ‘అమ్మ’ పదవి గురించి రాసిన ఈ పోస్ట్‌తో పాటు ఆమె షేర్ చేసిన ఫొటో కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

ఆ ఫొటోలో ఉన్న పర్సనల్ ఎవరనేది తెలియనివ్వకుండా.. అతనెవరో చెప్పకుండా.. ఇలియానా (Ileana) ఈ పోస్ట్ చేసింది. ఈ పిక్‌ని పరిశీలిస్తే.. అతనే తన ‘అమ్మ’ పదవికి (Mother Role) కారణం అని తెలుస్తోంది. ఎందుకంటే.. ఈ పిక్‌లో ఇలియానా అతనితో లిప్ కిస్‌ (LipLock)కి సిద్ధమవుతున్నట్లుగా ఉంది. ఈ పిక్‌తో పాటు ఆమె ఏం తెలిపిందంటే..

Ileana-Pic.jpg

‘‘తల్లికావడం ఓ అద్భుతమైన అనుభూతి. మాటల్లో వర్ణించలేనిది. ఈ క్షణాల్ని ఆస్వాదిస్తున్నా. నాలో ఓ జీవి ప్రాణం పోసుకొంటుందన్న ఊహే అపురూపంగా అనిపిస్తోంది. నా బిడ్డ బయటకు వచ్చాక తనని ఎంత ప్రేమిస్తానో, ఎలా చూసుకొంటానో నాకు తెలీదు. కానీ ఇప్పటికైతే అమితంగా ఇష్టపడుతున్నా’’ అంటూ ఓ ఉద్వేగభరితమైన పోస్ట్‌ పెట్టింది. ఇంకా.. ‘‘ఈమధ్య కొన్ని కష్టమైన రోజులు గడిచాయి. ఆ పరిస్థితులు నన్ను గందరగోళానికి గురి చేశాయి. అయితే వాటి నుంచి నేను క్రమంగా బయటపడ్డా. ఆ క్షణంలో తను నా చెంత ఉన్నాడు, నా కన్నీళ్లు తుడిచాడు, నా జీవితంలో చిరునవ్వులు పూయించాడు’’ అంటూ తన ప్రియుడి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి:

************************************************

*Gopichand: ‘రామబాణం’ తర్వాత మరో పవర్‌ఫుల్ టైటిల్‌తో.. ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల


*********************************************************************

*Sreeleela: నిర్మాతలకు ‘నో’ చెబుతున్న శ్రీలీల

*****************************************************************

*Samantha: క్లబ్‌లో బీర్ కొడుతూ.. ‘ఊ అంటావా మావ’ పాటకి నాటు నాటు స్టెప్స్.. వీడియో వైరల్


*************************************************************

*VarunLav: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్ ఫొటోలు

***********************************

*Sharwa-Rakshita: శర్వానంద్, రక్షితల వెడ్డింగ్ రిసెప్షన్‌లో సెలబ్రిటీల సందడి

***********************************************************

Updated Date - 2023-06-12T18:18:00+05:30 IST